Pawan Kalyan Mother Birthday : ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన తల్లికి అరుదైన పుట్టినరోజు కానుక ఇచ్చారు. బంగారం, వజ్రాల కంటే విలువైన కానుక ఇచ్చాడని.. ఓ తల్లికి ఇంతకంటే గొప్ప గిఫ్ట్ ఇంకేది ఉండదంటున్నారు అభిమానులు. ఇంతకూ ఆ గిప్ట్ ఏంటి..?
Pawan Kalyan : ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం, సినీ హీరో పవన్ కళ్యాణ్ ఏది చేసినా ప్రత్యేకమే. ఆయన రాజకీయ, సినీ ప్రస్థానం చూస్తేనే అర్థమవుతుంది... నలుగురు నడిచే దారిలో ఆయన నడవరని... ఆయన రూటే సెపరేటని. చివరకు ఓ కొడుకుగా కూడా ప్రత్యేకతను చాటుకున్నారు పవన్ కళ్యాణ్. తాజాగా తన తల్లి అంజనా దేవి పుట్టినరోజు సందర్భంగా ఎవరూ ఊహించని అరుదైన బహుమతిని అందించారు. ఆయన నిర్ణయానికి యావత్ తెలుగు ప్రజలు ఫిదా అవుతున్నారు... ఇదికదా అసలుసిసలైన భర్త్ డే గిప్ట్ అంటున్నారు. బంగారం, వజ్రాలతో ఖరీదైన బహుమతులు ఇవ్వడంకాదు... ఇలా మానవత్వాన్ని ప్రదర్శించే గిప్టులు ఇచ్చే కొత్త ట్రెండ్ ను పవన్ ప్రారంభించారు.
26
తల్లికి పవన్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా..?
ఇవాళ (జనవరి 29న) మెగా బ్రదర్స్ తల్లి అంజనా దేవి పుట్టిన రోజు. అయితే ప్రతిసారి ఎలాంటి హడావిడి లేకుండా తన కొడుకులు, కోడళ్లు, మనవళ్లు, మనవరాళ్ళతో భర్త్ డే వేడుకలు జరుపుకుంటారు అంజనమ్మ. అయితే రాజకీయాలు, పాలనాపరమైన వ్యవహారాలో పవన్ కల్యాణ్ ఈసారి తల్లి పుట్టినరోజుకు దూరంగా ఉన్నాడు. అయినాకూడా తన తల్లికి అరుదైన పుట్టినరోజు కానుకను అందించాడు.
పాలనా వ్యవహారాల్లో భాగంగా ఇవాళ(గురువారం) విశాఖపట్నం జూపార్క్ ను సందర్శించారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో ఆయన జూపార్క్ లోని జిరాఫీలను చూసి ముచ్చటపడ్డారు... వాటికి అహారం తినిపిస్తూ చాలా ఆనందంగా గడిపారు. ఈ క్రమంలోనే పవన్ జంతుప్రేమను ప్రదర్శించారు... రెండు జిరాఫీలను దత్తత తీసుకుంటున్నట్లు అక్కడికక్కడే ప్రకటించారు. తన తల్లి పుట్టినరోజును పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఏడాదిపాటు ఈ రెండు జిరాఫీల సంరక్షణ ఖర్చు తానే భరిస్తానని వెల్లడించారు. ఇలా జంతుప్రేమను చాటుకుని తల్లి అంజనాదేవి మర్చిపోలేని బహుమతిని ఇచ్చారు పవన్ కళ్యాణ్.
36
వన్యప్రాణి సంరక్షణలో భాగంకండి... పవన్ పిలుపు
వన్యప్రాణుల సంరక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యతమాత్రమే కాదు ప్రజలది కూడా అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కాబట్టి పర్యావరణాన్ని, వన్యప్రాణులను కాపాడేందుకు ప్రతిఒక్కరు ముందుకు రావాలని సూచించారు. ముఖ్యంగా జూపార్కుల అభివృద్ధిలో కార్పొరేట్ సంస్థలు, వ్యాపారవేత్తలు, వీఐపీలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తమకు నచ్చిన జంతువును ఎంచుకొని వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని సూచించారు.
ఈ క్రమంలోనే తనతో పాటు కుటుంబసభ్యులకు మూగజీవులంటే ఎంతో ప్రేమ అని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇందుకు నిదర్శనం తమ ఇంట్లో పెంచుకుంటున్న నాలుగు కుక్కలేనని అన్నారు. జంతు సంరక్షణపై కుటుంబమంతా శ్రద్ద పెడుతుందని.. అందరం జంతుప్రేమికులమే అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
విశాఖపట్నంలో ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కును పరిశీలించిన పవన్ కళ్యాణ్ కొన్ని జంతువులకు అహారం తినిపించారు. ఇలా ఏనుగులకు పండ్లు, జిరాఫీలకు రావి ఆకులు, ఎలుగుబంట్లకు అహారం అందించారు. జింకలపార్క్, జూలో ఉన్న సింహాలు, ఆఫ్రికన్ మకావు జాతి చిలుకలు, పులులను తిలకించారు. వారి రక్షణకు తీసుకుంటున్న చర్యలు, జూలో ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలపై చర్చించారు.
56
పవన్ పై వాలిన సీతాకోక చిలక
అయితే సీతాకోక చిలుకల పార్కును సందర్శించే సమయంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ అందమైన టైగర్ రకానికి చెందిన సీతాకోక చిలుక పవన్ కళ్యాణ్ పై వాలింది... దీంతో ఆయన ఎంతో మురిసిపోయారు. దానికి ఎలాంటి హాని కలగకుండా చాలా సున్నితంగా పూల మొక్కల పైకి మళ్లించారు. అయితే పవన్ ఆ సీతాకోక చిలకను పట్టుకున్న సమయంలో మీడియా ప్రతినిధులు ఫోటోలు తీశారు.. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మెగా అభిమానులు, జనసేన శ్రేణులు ఈ ఫోటోను చూసి మురిసిపోతున్నారు.
66
కంబాలకొండ ఎకో పార్క్ లో పవన్ కెనోపీ వాక్
జూ పార్క్ సందర్శన అనంతరం కంబాలకొండ ఎకో పార్క్ ను పరిశీలించారు పవన్ కళ్యాణ్. ఇందులో అటవీశాఖ 50 ఎకరాల్లో అభివృద్ధి చేసిన నగరవనాన్ని ప్రారంభించారు. అనంతరం వుడెన్ బ్రిడ్జిపై వివిధ రకాల వృక్ష జాతుల మధ్య 400 మీటర్లు కెనోపీ వాక్ చేశారు. ఉడెన్ బ్రిడ్జికి ఇరువైపులా దిడిశ, వేప, ఇప్ప, బిలుడు, మహాగని, ఏగిస, వివిధ జాతుల వెదురు, పనస వృక్షాలను పరిశీలించారు. ఆయా వృక్షాల శాస్త్రీయ నామాలు, వాటి వల్ల ఉపయోగాలు అడిగి తెలుసుకున్నారు. ఎకో పార్కులోని శాంతివనంలో మహాగని మొక్కలను నాటారు. ఇలా పవన్ కళ్యాణ్ ఇవాళ ప్రకృతి ఒడిలో, జంతువుల మధ్యలో హాయిగా గడిపారు.