Tirumala: తిరుమ‌ల శ్రీవారిని మొద‌టి గ‌డ‌ప నుంచి ద‌ర్శించుకునే అవ‌కాశం.. ఏం చేయాలంటే.?

Published : Jul 08, 2025, 12:07 PM IST

క‌లియుగ వైకుంఠ దైవం వెంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకోవాల‌ని ప్ర‌తీ ఒక్క‌రూ కోరుకుంటారు. స్వామి వారి రూపాన్ని ఒక్క క్ష‌ణం చూసేందుకు గంట‌ల పాటు ప్ర‌య‌ణించి తిరుమ‌ల‌కు చేరుకుంటారు. వెంక‌న్న‌ను ద‌గ్గ‌రి నుంచి ద‌ర్శించుకోవాల‌ని చాలా మంది కోరుకుంటారు. 

PREV
16
తిరుమల మొదటి గడప దర్శనం అంటే ఏమిటి?

"మొదటి గడప" అనేది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి సంబంధించిన పవిత్ర స్థలాల్లో ఒకటి. సాధారణంగా రూ. 300 ప్రత్యేక టికెట్లు, సర్వదర్శనం భక్తులను దూరం నుంచే దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తారు. కానీ వీఐపీ బ్రేక్ దర్శనం, శ్రీవాణి టికెట్‌తో పాటు ప‌లు ర‌కాల ప్ర‌త్యేక ద‌ర్శ‌న టికెట్లు తీసుకున్న వారికి మొద‌టి గ‌డ‌ప నుంచి స్వామి వారి ద‌ర్శించుకునే అవ‌కాశం ల‌భిస్తుంది.

26
సామాన్యుల‌కు కూడా

అయితే ఈ అవ‌కాశాన్ని కేవ‌లం సెల‌బ్రిటీలు, ఎక్కువ ధ‌ర పెట్టి టికెట్ కొనుగోలు చేసే వారికి మాత్ర‌మే కాకుండా సామాన్యుల‌కు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో భాగంగానే తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) వాళ్లు ల‌క్కీ డిప్ ద్వారా ఈ టికెట్ల‌ను అందిస్తున్నారు. ఇంత‌కీ ఈ టికెట్లు ఏయే రోజుల్లో అందుబాటులో ఉంటాయి.? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.

36
ప్ర‌తీ నెల మూడు రోజుల పాటు

ప్ర‌తీ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వ‌ర‌కు మొద‌టి గ‌డ‌ప ద‌ర్శనం కోసం టికెట్ల‌ను జారీ చేస్తారు. ల‌క్కీడిప్‌లో మీ పేరు న‌మోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మీ పేరు రిజిస్ట‌ర్ చేసుకుంటే ల‌క్కీడిప్ తీసి పేర్ల‌ను ప్ర‌క‌టిస్తారు. అయితే ఇందుకు చాలా పోటీ ఉంటుంది. ఈ ల‌క్కీ డిప్ రిజిస్ట్రేష‌న్ రెండు నెల‌ల ముందుగానే చేసుకోవాల్సి ఉంటుంది.

46
టీటీడీ దేవ‌స్థానం యాప్ ద్వారా

ఈ రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌లో పాల్గొనాలంటే ముందుగా స్మార్ట్‌ఫోన్‌లో టీటీడీ దేవ‌స్థానం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అనంత‌రం మీ మొబైల్ నెంబ‌ర్‌తో రిజిస్ట‌ర్ అవ్వాలి. ఆ త‌ర్వాత హోం పేజీలో క‌నిపించే పిలిగ్రిమ్ స‌ర్వీస్‌లో క‌నిపించే వ్యూ ఆల్ ఆప్ష‌న్‌పై క్లిక్ చేయాలి. ఆ త‌ర్వాత అందులో క‌నిపించే seva edip ఆప్ష‌న్‌ను సెల‌క్ట్ చేసుకోవాలి.

56
పూర్తి వివ‌రాలు అందించాలి.

seva edip సెల‌క్ట్ చేసుకున్న త‌ర్వాత మీ పూర్తి వివ‌రాలు అందించాల్సి ఉంటుంది. ఫొటో ఐడీ ప్రూఫ్ కూడా ఇవ్వాలి. ఈ టికెట్ కోసం గ‌రిష్టంగా ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను సెల‌క్ట్ చేసుకోవ‌చ్చు. వివ‌రాల‌న్నీ అందించిన త‌ర్వాత కంటిన్యూ బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి. ఆ త‌ర్వాత క‌నిపించే షో సెల‌క్ట్‌డ్ సేవ అండ్ డేట్ అనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. దానిని క్లిక్ చేయాలి. 

అక్క‌డ కనిపించే సెల‌క్ట్ ఆల్ సేవ డేట్స్ అనే ఆప్ష‌న్‌ను సెల‌క్ట్ చేసుకోవాలి. త‌ర్వాత కంటిన్యూ ఆప్ష‌న్‌పై క్లిక్ చేయాలి. చివ‌రిగా మీరు అందించిన పూర్తి స‌మాచారాన్ని ఒక‌సారి రివ్యూ చేస‌కొని స‌బ్‌మిట్‌పై నొక్కాలి.

66
రిజిస్ట్రేష‌న్ నెంబ‌ర్

చివ‌రిగా రిజిస్ట్రేష‌న్ స‌క్సెస్ అనే అల‌ర్ట్ వ‌చ్చి ఒక రిజిస్ట్రేష‌న్ ఐడీ వ‌స్తుంది. ల‌క్కీడిప్‌లో సెల‌క్ట్ అయిన వారి వివ‌రాలు ఎప్పుడు తెలియ‌జేస్తామ‌న్న విష‌యాన్ని స్క్రీన్‌పై చూపిస్తారు. టైమ్ టూ లెఫ్ట ఫ‌ర్ డ్రా అనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. ఒక‌వేళ మీరు సేవ‌కు ఎంపికైతే మీ రిజిస్ట‌ర్ మొబైల్‌కు మెసేజ్ వ‌స్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories