Published : Jul 08, 2025, 10:43 AM ISTUpdated : Jul 08, 2025, 10:51 AM IST
సరస్వతి పవర్ నుంచి భారతి సిమెంట్ వరకు... వైఎస్సార్ తో పాటు ఆయన కుటుంబసభ్యులు అనేక వ్యాపారసంస్థలు స్థాపించారు. ఇలా రాజకీయ నాయకుడిగానే కాదు వ్యాపారవేత్తగా కూడా సక్సెస్ అయ్యారు వైఎస్సార్. ఆయన చేసిన వ్యాపారాలేమిటో ఇక్కడ తెలుసుకుందాం.
YSR Jayanthi : వైఎస్ రాజశేఖర్ రెడ్డి... తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివారు ఉండరు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసారు... ఈయన హయాంలోనే వ్యవసాయానికి ఉచితకరెంట్, 108 అంబులెన్స్ సేవలు, ఆరోగ్యశ్రీ, ఫీజు రియింబర్స్ మెంట్, జలయజ్ఞం వంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెలుగు ప్రజలకు అందాయి. ఇలా తన సంక్షేమ పాలనతో ప్రజలకు దగ్గరైన వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉండగానే ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. ఆయన మరణవార్తను తట్టుకోలేక చాలామంది ప్రాణాలు వదిలారంటేనే ఎంతటి అభిమానాన్ని సంపాదించారో అర్థమవుతుంది.
ఇలా వైఎస్ రాజశేఖర్ రెడ్డి భౌతికంగా దూరమైనా ఇప్పటికీ తెలుగు ప్రజల మదిలో సజీవంగానే ఉన్నారు. ఇవాళ (జులై 8 మంగళవారం) వైఎస్సార్ జయంతి సందర్భంగా కేవలం వైఎస్ కుటుంబసభ్యులే కాదు తెలుగు ప్రజలు కూడా ఆయనను గుర్తుచేసుకుంటున్నారు. రాజకీయంగా ఆయన సాధించిన విజయాలు, ఓ సాధారణ డాక్టర్ నుండి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎలా ఎదిగారో అందరికీ తెలుసు. రాజకీయాల్లో ఉన్నత శిఖరాన్ని అధిరోహించారు వైఎస్సార్.
25
వైఎస్సార్ కు రాజకీయాలే కాదు వ్యాపారాలు తెలుసు...
ఇలా సక్సెస్ ఫుల్ పొలిటీషియన్ గా అందరికీ తెలిసిన వైఎస్సార్ లో మరో కోణం దాగివుంది. ఆయన సక్సెస్ ఫుల్ డాక్టర్ మాత్రమే కాదు వ్యాపారవేత్తకూడా. ఆయన స్థాపించిన వ్యాపారాల్లో వాటా కోసమే బిడ్డలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల మధ్య వివాదం సాగుతోందని అందరికీ తెలిసిందే. మరి వైఎస్సార్ చేసిన వ్యాపారాలు, ఆయన స్థాపించిన వ్యాపారసంస్థల గురించి తెలుసుకుందాం.
35
వైఎస్ కుటుంబ వ్యాపారాలివే...
సరస్వతి పవర్ ఆండ్ ఇండస్ట్రీస్ :
సరస్వతి పవర్ ఆండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ను 1999, మార్చి 31న స్థాపించారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. తన భార్య విజయారెడ్డి ఎండీగా ఈ సంస్థను ఏర్పాటుచేసారు. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, జనరేషన్ రంగంలో ఈ సంస్ధ వ్యాపారాలు చేస్తుంది. హైదరాబాద్ చిరునామాతో ఈ సంస్థ కొనసాగుతోంది.
ఈ సరస్వతి పవర్స్ విషయంలోనే వైఎస్సార్ వారసులు వైఎస్ జగన్, షర్మిల మధ్య వివాదం సాగుతోంది. ప్రస్తుతం వైఎస్ జగన్ భార్య వైఎస్ భారతి ఈ సంస్థ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.
సండూరు పవర్ ప్రాజెక్ట్ :
వైఎస్ కుటుంబానికి మరో సంస్థ సండూర్ పవన్ కంపనీ ప్రైవేట్ లిమిటెడ్. దీన్ని 1998 డిసెంబర్ 23న స్థాపించారు. ప్రస్తుతం వైఎస్ భారతి బోర్డు సభ్యురాలిగా ఉన్నారు. ఈ సంస్థ వ్యక్తిగత, సామాజిక సేవల రంగంలో ఉంది... అంటే వివిధ హాస్పిటల్స్ లో సౌకర్యాలు కల్పించే వ్యాపారం చేస్తోంది. కొన్ని మిలిటరీ బేస్, జైళ్లలోని హాస్పిటల్స్ కు ఈ సంస్థ సేవలు అందిస్తోంది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే 2008 లో సొంత మీడియా సంస్థను సాక్షి పేరిట స్థాపించారు. జగతి పబ్లికేషన్ లో భాగంగా ఈ పత్రిక పనిచేస్తోంది. తర్వాత సాక్షి న్యూస్ ఛానల్ కూడా వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్ ప్రారంభించారు. ప్రస్తుతం ఈ మీడియా సంస్థ బాధ్యతలను వైఎస్ భారతి చూసుకుంటున్నారు.
భారతి సిమెంట్ :
1999 డిసెంబర్ 12న భారతి సిమెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ స్థాపించారు. ప్రస్తుతం వైఎస్ భారతి ఈ సంస్థ డైరెక్టర్ గా ఉన్నారు. ఈ సంస్థ సిమెంట్, లైమ్, ప్లాస్టర్ తయారీ చేపడుతుంది. వైఎస్సార్ తో పాటు ఆయన తనయుడు వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఈ సంస్థకు భూముల కేటాయింపు వివాదాస్పదంగా మారింది.
55
వైఎస్సార్ సక్సెస్ ఫుల్ బిజినెస్ మేన్..
ఇలా వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి అనేక వ్యాపార సంస్థలు ఏర్పాటుచేసారు. ఓవైపు రాజకీయాలు చేస్తూనే మరోవైపు వ్యాపారాలు చూసుకునేవారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు వివిధ రాష్ట్రాల్లో వైఎస్ కుటుంబం వ్యాపారాలు చేసింది. ఇలా వైఎస్సార్ రాజకీయాల్లోనే కాదు వ్యాపారంరంగంలో సక్సెస్ ఫుల్ బిజినెస్ మేన్ గా నిలిచారు.