నేటి నుంచే స్మార్ట్ రేషన్ కార్డులు.. వీటిని ఎలా పొందాలి? అస‌లు వీటితో ఉప‌యోగం ఏంటి?

Published : Aug 25, 2025, 10:36 AM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మ‌రో వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టింది. పాత రేష‌న్ కార్డుల స్థానంలో స్మార్ట్ రేష‌న్ కార్డుల‌ను తీసుకొస్తోంది. సోమ‌వారం నుంచే ఈ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. ఈ నేప‌థ్యంలో వీటి ఉపయోగం ఏంటో తెలుసుకుందాం.  

PREV
15
ఆంధ్రప్రదేశ్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డుల వ్యవస్థలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టింది. ఇకపై పాత రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ రేషన్ కార్డులను ప్రజలకు అందించనుంది. మొత్తం నాలుగు విడతల్లో ఈ పంపిణీ కార్యక్రమం జరగనుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మొదటిగా తొమ్మిది జిల్లాల్లో ప్రారంభమై, దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని కుటుంబాలకు చేరుతాయి. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం (ఆగ‌స్టు 25) నుంచి ఈ ప్ర‌క్రియ మొద‌లైంది.

DID YOU KNOW ?
రాజకీయ నాయకుల ఫొటోలు ఉండవు
ఈ కొత్త స్మార్ట్ కార్డులో కుటుంబ సభ్యుల వివరాలు, ఇంటి యజమాని ఫోటో మాత్రమే ఉంటుంది. గ‌తంలో మాదిరిగా రాజకీయ నాయకుల ఫొటోలు ఉండవు.
25
స్మార్ట్ కార్డుల ప్రత్యేకతలు

కొత్త రేషన్ కార్డులు ఏటీఎం కార్డు సైజులో ఉంటాయి. వీటిలో క్యూఆర్ కోడ్ ఉండటం వల్ల మరింత భద్రత లభిస్తుంది. కుటుంబ సభ్యుల వివరాలు, ఇంటి యజమాని ఫోటో మాత్రమే ఉంటుంది. గ‌తంలో మాదిరిగా రాజకీయ నాయకుల ఫొటోలు ఉండవు. డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల మాదిరిగానే పర్సులో పెట్టుకుని తీసుకెళ్లేలా వీటిని డిజైన్ చేశారు. ప్రభుత్వం వీటిని పూర్తిగా ఉచితంగా అందిస్తోంది.

35
పంపిణీ విధానం

మొత్తం 1.46 కోట్ల కుటుంబాలకు ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అందజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఇంటివద్దకే వెళ్లి కార్డులను ఇస్తారు. ఇందుకోసం ప్ర‌జ‌లు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. ఆగస్టు 30న రెండో విడత పంపిణీ ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 6 నుంచి మూడో విడత, సెప్టెంబర్ 15 నుంచి నాలుగో విడతలో మిగతా జిల్లాలకు కార్డులు చేరతాయి. ప్రతి జిల్లా వారీగా ఇప్పటికే తహసీల్దార్ కార్యాలయాలకు కార్డులు పంపిణీ చేశారు.

45
ఎలా చెక్ చేసుకోవాలి.?

కొత్తగా వివాహమై కుటుంబంలో చేరిన వారు, చిరునామా మారిన వారు, పిల్లల పేర్లు జోడించుకోవాలనుకునే వారు, లేదా కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసిన వారు కూడా ఈ స్మార్ట్ కార్డులను పొందొచ్చు. ఇప్పటివరకు 16 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అందులో దాదాపు 15 లక్షల పరిశీలన పూర్తయింది. మీ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవాలంటే AP Seva Portal (https://vswsonline.ap.gov.in/#/home)లో "Service Request Status Check" ఆప్షన్ ద్వారా మీ అప్లికేషన్ నంబర్ ఎంటర్ చేసి చూసుకోవచ్చు.

55
స్మార్ట్ రేషన్ కార్డుల ప్రయోజనాలు

* ఎక్కడైనా వినియోగం – రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా ఈ కార్డుతో రేషన్ సరుకులు పొందవచ్చు.

* మోసాల నివారణ – క్యూఆర్ కోడ్ ఉండటం వల్ల నకిలీ లావాదేవీలు తగ్గుతాయి.

* వేగవంతమైన సరఫరా – రేషన్ షాపుల్లో రద్దీ తగ్గి, సరుకుల పంపిణీ వేగంగా జరుగుతుంది.

* పారదర్శకత – లబ్ధిదారులకు రావాల్సిన సరుకులు ఇతరుల చేతికి వెళ్లకుండా అడ్డుకడతాయి.

* గుర్తింపు కార్డు – అత్యవసర సమయాల్లో అధికారిక ఐడీ కార్డులాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories