Telangana, Andhra Pradesh Weather Update: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మళ్లీ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మళ్లీ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు తెలుస్తోంది. దీని ప్రభావంతో లంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఒడిశా-పశ్చిమబెంగాల్, ఆంధ్ర తీరా ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారత వాతావరణ విభాగం (IMD) ప్రకారం నేడు (సోమవారం) ఈ అల్పపీడనం ఏర్పడే అవకాశముందని తెలిపింది.
25
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
భారత వాతావరణ విభాగం (IMD) ప్రకారం.. బంగాళఖాతంలో ఏర్పడబోయే అల్పపీడనం కారణంగా ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల్లో గణనీయంగా కనిపించనుంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మూడు రోజుల్లో మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
35
తెలంగాణలో రెయిన్ అలర్ట్
తెలంగాణలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న మోస్తరు వర్షాల తర్వాత రాష్ట్రానికి మరో అల్పపీడనం ప్రభావం చూపనుంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు సంబంధించిన అల్పపీడనం రానున్న మూడు రోజులలో తెలుగు రాష్ట్రాలపై గణనీయ ప్రభావం చూపుతుంది. ఈ ప్రభావంతో తెలంగాణలో రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్గొండ, మహబాబ్ నగర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశముంది.
45
వాతావరణ శాఖ హెచ్చరిక
రాబోయే మూడు రోజుల్లో వాతావరణం ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ అధికారులు సూచించారు. సముద్రం అలజడిగా ఉండే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరించారు. అలాగే, భారీ వర్షాల సమయంలో చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న భవనాల దగ్గర, పెద్ద హోర్డింగ్స్ కింద ఉండరాదని, పొంగిపొర్లే వాగులు, కాలువలను దాటే ప్రయత్నం చేయరాదని సూచించారు. ప్రత్యేకంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని సూచననిచ్చారు.
55
వరద ప్రభావం తగ్గుముఖం
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో గోదావరి, కృష్ణా నదుల్లో వరద ప్రభావం తగ్గుముఖం పట్టింది. భద్రాచలం వద్ద నీటిమట్టం 39.2 అడుగులకు చేరినప్పటికీ, ప్రస్తుతం ఎలాంటి ప్రమాద హెచ్చరికలు అమలులో లేవు. గోదావరి నది కూనవరం వద్ద నీటిమట్టం 18.99 మీటర్లు, పోలవరం వద్ద 12.65 మీటర్లుగా ఉంది. మరోవైపు, ధవళేశ్వరం డ్యామ్‌లో ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 12.34 లక్షల క్యూసెక్కులుగా నమోదయ్యాయి.
ఇక కృష్ణా నది వరద పరిస్థితిని పరిశీలిస్తే.. శ్రీశైలం డ్యాం వద్ద ఇన్ ఫ్లో 4.73, ఔట్ ఫ్లో 5.14 లక్షల క్యూసెక్కులు ఉన్నాయి. నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో 4.45, ఔట్ ఫ్లో 4.05 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో రెండూ 3.92 లక్షల క్యూసెక్కుల వద్ద నిలిచాయి. అయితే, వరద పూర్తిగా తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.