తెలంగాణలో శనివారం కూడా చలి వాతావరమే ఉంటుంది.... ఆదివారం నుండి వర్షాలు మొదలవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నవంబర్ 23న జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఒకటిరెండు చోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది.
నవంబర్ 24 సోమవారం కూడా గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేటతో పాటు ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నవంబర్ 25 మంగళవారం జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కాబట్టి ఈ జిల్లాల ప్రజలు వచ్చేవారం కాస్త అప్రమత్తంగా ఉండాలి.