Cyclone Senyar Alert : తెలుగు రాష్ట్రాలకు మరోసారి తుపాను గండం తప్పేలా లేదు. ఈ నెలలోనే బంగాళాఖాతంలో తుపాను ఏర్పడే అవకాశాలున్నాయట… దీని పేరేంటి? ఇది ఎక్కడ తీరం దాటనుందో తెలుసా?
IMD Weather Update : తెలుగు రాష్ట్రాల్లో మళ్లిగా వర్షాలు మొదలయ్యాయి... ప్రస్తుతం అక్కడక్కడా చిరుజల్లులు మాత్రమే కురుస్తున్నాయి. ఇవి రోజురోజుకు పెరుగుతూ నెలాఖరు నాటికి భారీ నుండి అతిభారీ వర్షాలుగా మారే అవకాశాలున్నాయని వాతావరణ విభాగాలు హెచ్చరిస్తున్నాయి. బంగాళాఖాతంలో పరిస్థితులు వర్షాలకు అనుకూలంగా మారుతున్నాయని... దీంతో ఇక చలి తగ్గి వర్షాలు పెరగనున్నాయని ప్రకటిస్తోంది భారత వాతావరణ శాఖ.
26
బంగాళాఖాతంలో సెన్యార్ తుపాను..?
ఇటీవల మొంథా తుపాను సృష్టించిన బీభత్సం ఇంకా తెలుగు ప్రజల కళ్లముందు మెదులుతోంది... దీన్ని మర్చిపోకముందే బంగాళాఖాతంలో మరో తుపాను ఏర్పడే అవకాశాలున్నాయన్న హెచ్చరికలు తెలుగు ప్రజలను కంగారు పెట్టిస్తున్నాయి. ఈ తుపాను కూడా ఆంధ్ర ప్రదేశ్ తీరంవైపు దూసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్న హెచ్చరిక మరింత ఆందోళన కలిగిస్తోంది. రాబోయే ఐదారురోజులు తుపానుకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయట... ఆ తర్వాత భారీ వర్షాలుంటాయని హెచ్చరిస్తోంది. ఈ తుపానుకు 'సెన్యార్' అనే పేరు పెట్టనున్నారు.
36
అల్పపీడనం నుండి తుపాను వరకు
ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.... దీని ప్రభావంతో రేపు(నవంబర్ 22, శనివారం) ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్ర ప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ సోమవారం (నవంబర్ 24) నాటికి దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశముందని APSDMA వెల్లడించింది.
ఈ వాయుగుండం పశ్చిమవాయువ్య దిశగా ప్రయాణిస్తూ 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడేందుకు అవకాశం ఉందట. నవంబర్ 26 లేదా 27 నాటికి తుపాను ఏర్పడే అవకాశాలున్నాయని అంచనా వేస్తోంది. ఈ తుపాను ఆంధ్ర ప్రదేశ్ తీరంవైపు దూసుకువస్తుందని... నవంబర్ 29 నాటికి తీరందాటే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు కురుస్తున్నాయి... రాబోయే రోజుల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని APSDMA తెలిపింది. నవంబర్ 27 నుండి 29 వరకు (వచ్చే గురు, శుక్ర, శని వారాల్లో) వర్షతీవ్రత ఎక్కువగా ఉంటుందట. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం విపత్తు నిర్వహణ సంస్ధ హెచ్చరిస్తోంది.
ప్రస్తుతం వరికోతలు కొనసాగుతున్న నేపథ్యంలో వర్ష హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వర్షాల నుండి ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ముందుగానే తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని విపత్తు సంస్థ సూచించింది. ఇక ప్రజలు సమాచారం, సహాయం కోసం APSDMA కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112,1070, 18004250101 సంప్రదించాలని విపత్తు నిర్వహణ సంస్ధ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
56
నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
శుక్రవారం (నవంబర్ 21న) తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశాలు లేవు... కానీ అల్పపీడనం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయట. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తెలంగాణలో ఆదివారం నుండి వర్షాలు మొదలవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
66
ఇకపై వచ్చే 5 తుపాన్లు ఇవే
ఒక్కో తుపానుకు ఒక్కోదేశం పేరు పెడుతుంది... ఇటీవల వచ్చిన తుపానుకు మొంథా అని థాయిలాండ్ నామకరణం చేసింది. ఇక తర్వాత రాబోయే తుపానుకు 'సెన్యార్' అని పేరుపెట్టనుంది అరబ్ ఎమిరేట్స్. ఆ తర్వాత వచ్చే తుపానుకు యెమెన్ 'డిత్వా' అని... తర్వాతిదానికి బంగ్లాదేశ్ అర్నబ్ అని పేరు పెడతారు. వీటి తర్వాత వచ్చేది 'మురుసు' తుపాను... ఇది ఇండియా పేరు. దీని తర్వాత ఇరాన్ పేరుతో 'అక్వాన్' తుపాను వస్తుంది.