Published : Apr 09, 2025, 05:42 PM ISTUpdated : Apr 09, 2025, 05:53 PM IST
Mark Shankar: పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్‌డేట్ వచ్చేసింది. సింగపూర్‌కి సమ్మర్ క్యాంపు కోసం వెళ్లిన మార్క్ శంకర్ అక్కడి పాఠశాలలో అగ్ని ప్రమాదం జరగడంతో తీవ్రంగా గాయపడ్డాడు. శంకర్ ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో ఊపిరి తీసుకోవడంలో తొలుత కాస్త ఇబ్బంది పడ్డాడు. ఈవిషయం తెలుసుకున్న వెంటనే నిన్న రాత్రి పవన్ కల్యాణ్, మెగస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ సింగపూర్ వెళ్లారు. మరోవైపు పవన్ అభిమానులు, జనసేన క్యాడర్ అనేక ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. ఎట్టకేలకు వారి పూజలు ఫలించాయి. ప్రస్తుతం బాబు ఆరోగ్య పరిస్థితి ఏంటంటే..
పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదానికి గురయ్యాడు. కాళ్లు, చేతులకు గాయాలు కావడంతో వెంటనే అక్కడి సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. అరకు పర్యటనలో ఉన్న సమయంలో బాబు తల్లి అన్నా ఫోన్‌లో పవన్‌కు ఘటన గురించి తెలిపారు. మిగిలిన నాయకుల్లా కాకుండా.. అరకు ప్రజలకు ఇచ్చిన మాట కోసం పవన్ తన టూర్‌ని కొనసాగించారు. ఒకవైపు బాధను దిగుమింగుకుని గిరిజనులతో మమేకమై పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు.
25
Chiranjeevi, Mark Shankar
అరకు పర్యటన మంగళవారం మధ్యాహ్నం ముగించుకున్న పవన్ ఆ రాత్రి 9.30 గంటలకు సింగపూర్ వెళ్లారు. పవన్ వెంటన, అన్న చిరంజీవి, వదిన సురేఖ కూడా ఆయనకు తోడుగా వెళ్లారు. పవన్ నిన్న మీడియాతో మాట్లాడుతూ.. పెద్ద కుమారుడు అఖీరా నందన్ పుట్టినరోజు నాడే చిన్న కుమారుడు గాయపడటం బాధ కలిగించిందన్నారు. బాబు కోలుకుంటున్నాడని, కాకపోతే అతని ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో కొంత కాలం ఆ ప్రభావం ఆరోగ్యంపై ఉంటుందని వైద్యులు చెబుతున్నారన్నారు. పవన్ కుమారుడు గాయపడటంపై ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారని, వారితోపాటు అనేక మంది రాజకీయ నాయకులు బాబు కోలుకోవాలని దీవించారని వారందరికీ పవన్ ధన్యవాదాలు తెలిపారు.
35
pawan kalyan, akira nandan, mark shankar
పవన్‌కల్యాణ్, కుటుంబ సభ్యులు బుధవారం ఉదయానికి సింగపూర్ చేరుకున్నారు. నేరుగా బాబుని వెళ్లి పలకరించారు. నిన్న ఎమర్జీనీ వార్డులో మార్క్ శంకర్‌కి వైద్యులు చికిత్స అందించారు. ఈరోజు సాధారణ వార్డులోకి మార్చినట్లు పవన్ కల్యాణ్ సన్నిహితులు చెబుతున్నారు. దీంతో పాటు మార్క్ శంకర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ ఫొటో సోషల్‌మీడియాలో దర్శనమిచ్చింది. ఈ ఫోటోలో శంకర్ చేతికి గాయం కాగా.. అక్కడ వైద్యులు కట్టుకట్టారు. బాబు ఫేస్‌కి మాత్రం ఆక్సిజన్ పైపు ఉంచి ఆక్సిజన్ అందిస్తున్నారు.
45
pawan kalyan
మార్క్ శంకర్ కోలుకోవడానికి ఇంకా మూడు రోజులు పడుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రమాదం ఏమీ లేదని అంటున్నారు. అయితే.. శ్వాస తీసుకోవడం కొంత ఇబ్బందిగా ఉందని రెండు మూడు రోజుల్లో అది కూడా నయం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. రీసెంట్‌గా విడుదలపై ఫొటోలో మార్క్ శంకర్ ఐయామ్ ఫైన్ అన్నట్లు చేతులు చూపించాడు. ఈ చిత్రం చూస్తే.. తను కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెబుతున్నట్లు ఉంది. ఇదిలా ఉంటే శంకర్ క్షేమంగా ఇంటికి చేరుకోవాలని జనసేన నాయకులు, శ్రేణులు, పవన్ అభిమానులు ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. శంకర్ క్షేమంగా ఉన్నట్లు ఫోటో రావడంతో వారందరూ హ్యాపీగా ఫీలవుతున్నారు.
55
పవన్ కుమారుడు శంకర్ గాయపడిన విషయం తెలుసుకున్న ప్రధాని మోదీ పవన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. దీంతోపాటు అక్కడి ఇండియన్ ఎంబసీని అలెర్ట్ చేసి వీఐటీ ట్రీట్‌మెంట్ జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఇక తన కుమారుడికి అన్న చిరంజీవిపై ఎనలేని ప్రేమ ఉందని అందరికీ తెలిసిందే. అందుకే పవన్ చిన్న కుమారిడికి తన అన్న పేరు కలిసేలా చిరంజీవి అసలు పేరు శివ శంకర వరప్రసాద్ పేరు కలిసి వచ్చేలా మార్క్ శంకర్ అని పెట్టారు. శంకర్ గాయపడిన విషయం తెలిసిన వెంటనే చిరంజీవి, సురేఖ దంపతులు తొలుత షాక్‌కి గురయ్యారని సమాచారం. వెంటనే పవన్‌తోపాటు వారుకూడా సింగపూర్ వెళ్లి ఇలాంటి ఆపత్కాల సమయంలో తమ్ముడికి ధైర్యం చెబుతూ.. బాబుని దగ్గరుండి చూసుకుంటున్నారని జనసేన వర్గాల సమాచారం.