బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆరోపించారు. ఏపీ పరిస్థితి ఒకప్పటి బీహార్‌ను తలపిస్తోందని జగన్ ఫైర్ అయ్యారు. ఎక్కడికక్కడ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి నేతలు అరాచకాలకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కూటమి పార్టీకి స్థానిక సంస్థల్లో సంఖ్యా బలం లేకున్నా.. గొడవలు, దాడులు, బెదిరింపులకు పాల్పడి గ్రామాల్లో అలజడులు సృష్టిస్తున్నారని జగన్ తెలిపారు. దీనిలో భాగంగానే శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం, రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన లింగమయ్యను బైక్‌పై వెళ్తుండగా.. బేస్‌బాల్ బ్యాట్‌తో దాడి చేశారని ఆయన ఆరోపించారు.