యూట్యూబ్ ఛాన‌ల్ లాంచ్ చేసిన దేవాన్ష్‌.. ఇంత‌కీ నారా వారి అబ్బాయి ఏం చెప్పనున్నాడంటే.?

Published : May 17, 2026, 03:30 PM IST

Nara Devaansh: ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు మ‌నవ‌డు, మంత్రి లోకేష్ త‌న‌యుడు నారా దేవాన్ష్‌ డిజిట‌ల్ ప్ర‌పంచంలోకి అడుగు పెట్టాడు. మొన్న‌టి వ‌ర‌కు చెస్ గేమ్‌తో వార్త‌ల్లో నిలిచిన దేవాన్ష్ ఇప్పుడు యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌తో ఆక‌ట్టుకోవ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు. 

PREV
14
డైనోసార్లపై ఆసక్తితో మొదలైన కొత్త ప్రయాణం

దేవాన్ష్ యూట్యూబ్ ఛాన‌ల్‌కు సంబంధించిన వీడియోను తండ్రి లోకేష్‌తో క‌లిసి పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన ఓ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. “Dino Deets” పేరుతో లాంచ్ చేసిన ఈ యూట్యూబ్ ఛాన‌ల్‌లో ఓ టీజ‌ర్‌ను ఆదివారం విడుద‌ల చేశారు. డైనోసార్ బొమ్మలు, పుస్తకాలు, చిత్రాలు కనిపించడంతో ఆశ్చర్యపోయినట్లు మంత్రి లోకేశ్ సరదాగా చెప్పిన సంభాషణ టీజర్‌లో ఆక‌ట్టుకుంటోంది. డైనోసార్ల గురించి తాను ప్రత్యేకంగా అధ్యయనం చేస్తున్నానని, వాటిపై పాడ్‌కాస్ట్ రూపొందిస్తున్నానని దేవాన్ష్‌ వివరించారు. ఈ పాడ్‌కాస్ట్‌లో పురాతన జీవులు ఎలా జీవించాయి, వాటి అవశేషాలు ఎలా బయటపడుతున్నాయి, శిలాజాల వెనుక ఉన్న కథలు ఏమిటి వంటి అనేక ఆసక్తికర విషయాలను పంచుకోబుతున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. పిల్లలకు విజ్ఞానం చేరేలా నవ్విస్తూ, ఆలోచింపజేసే రీతిలో ఈ ఎపిసోడ్లు ఉండనున్నాయి.

24
సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా టీజర్

దేవాన్ష్‌ పాడ్‌కాస్ట్ టీజర్‌ను మంత్రి నారా లోకేశ్ తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్నారు. “పిల్లలు ఎప్పుడూ కొత్త సర్‌ప్రైజ్‌లు ఇస్తుంటారు” అంటూ ఆయన చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దేవాన్ష్‌ సృష్టించిన డైనోసార్ల ప్రపంచాన్ని ఒక ప్రేక్షకుడిలా ఆస్వాదించేందుకు ఎదురుచూస్తున్నానని కూడా లోకేశ్ పేర్కొన్నారు.

34
యూట్యూబ్‌తో పాటు సోషల్ మీడియాలో కూడా ఎంట్రీ

“Dino Deets” పేరుతో దేవాంశ్ యూట్యూబ్ ఛానల్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అకౌంట్లను కూడా ప్రారంభించారు. మొదటి ఎపిసోడ్ త్వరలో విడుదల కానుండగా, ఇప్పటికే టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా పిల్లల్లో డైనోసార్లపై ఉన్న ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక కంటెంట్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. సైన్స్, చరిత్ర, పురాతన జీవులపై ఆసక్తి ఉన్న చిన్నారులకు ఈ ఛానల్ కొత్త అనుభూతిని ఇవ్వొచ్చని భావిస్తున్నారు. వినోదంతో పాటు జ్ఞానం అందించే విధంగా కంటెంట్ ఉండబోతుందని టీజర్ ద్వారా స్పష్టమైంది.

44
చెస్‌లో రికార్డు.. ఇప్పుడు పాడ్‌కాస్ట్‌లో కొత్త ఇన్నింగ్స్

దేవాన్ష్‌ ఇప్పటికే చెస్ ప్రపంచంలో తన ప్రతిభను నిరూపించుకున్నారు. గతంలో క్లిష్టమైన 175 చెక్‌మేట్ పజిల్స్‌ను అత్యంత వేగంగా పరిష్కరించి “ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్”గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. ‘5334 Problems and Games’ పుస్తకంలోని క్లిష్టమైన చెస్ పజిల్స్‌ను వేగంగా పూర్తి చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు అదే ఉత్సాహంతో డిజిటల్ కంటెంట్ ప్రపంచంలోకి అడుగుపెడుతూ పాడ్‌కాస్ట్ రూపంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు.

Read more Photos on
click me!

Recommended Stories