అయ్యో పాపం... ఈ సాప్ట్ వేర్ సైకోగాడు తెలుగింటి చదువులతల్లిని పొట్టునబెట్టుకున్నాడే..!

Published : Apr 25, 2026, 04:40 PM IST

ఆమె చదువులో చాలా చురుకు. ఇటీవలే అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఏకంగా రాష్ట్ర గవర్నర్ చేతులమీదుగా పట్టా అందుకుంది. అలాంటి చదువులతల్లిని పొట్టునబెట్టుకున్నాడు ఓ సాప్ట్ వేర్ సైకో. 

PREV
14
కడప యువతి సూసైడ్...

Kadapa Suicide Case : ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలో 26 ఏళ్ల రెహానా ఆత్మహత్య ఘటన ఆధునిక సంబంధాల్లోని చీకటి కోణాలను బయటపెట్టింది. బెంగళూరులో టెక్ ప్రొఫెషనల్‌గా పనిచేస్తున్న ప్రొద్దుటూరువాసి షాజహాన్‌తో రెహానాకు ఇటీవలే ఎంగేజ్‌మెంట్ జరిగింది. 

అయితే మొదట్లో అంతా బాగానే ఉంది… ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడినట్లే కనిపించింది. కానీ కొద్ది వారాలకు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వాళ్లిద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. చివరకు కాబోయేవాడి వేధింపులు తట్టుకోలేక రెహానా సూసైడ్ చేసుకుంది. ఆమె చనిపోతూ రాసిన 12 పేజీల సూసైడ్ నోట్‌లో చాలా తీవ్రమైన ఆరోపణలు చేసింది. అందులో ముఖ్యంగా కాబోయే భర్త తనతో ఎమోషనల్‌గా దూరమయ్యాడని, ముఖం మీదే "నాకు నీపై ఎలాంటి ఫీలింగ్స్ లేవు" అని చెప్పాడని ఆవేదన వ్యక్తం చేసింది.

24
12 పేజీల లేఖ.. అమ్మాయి వేదన..!

పోలీసుల కథనం ప్రకారం... ఎంగేజ్‌మెంట్ తర్వాత షాజహాన్ ప్రవర్తన ఎలా మారిపోయిందో రెహానా తన నోట్‌లో వివరంగా రాసింది. పెళ్లిని రద్దు చేసుకోవాలని షాజహాన్ తనపై తీవ్రమైన మానసిక ఒత్తిడి తెచ్చాడని ఆమె ఆరోపించింది. అతడికి గతంలోనూ చాలా మంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని... ఈ విషయం తన మానసిక వేదనను మరింత పెంచిందని నోట్‌లో పేర్కొంది. ఈ వేధింపులన్నీ కలిసి రెహానాను తీవ్రమైన డిప్రెషన్‌లోకి నెట్టాయని, అందుకే ఆమె ఆత్మహత్య లాంటి దారుణమైన నిర్ణయం తీసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఎంగేజ్‌మెంట్ రద్దు చేసుకోవాలని షాజహాన్ మానసికంగా ఒత్తిడి తెచ్చాడని, పదేపదే తమ సంబంధాన్ని అవమానించేలా ప్రవర్తించాడని రెహానా కుటుంబం తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఇది కేవలం ఎమోషనల్ గ్యాప్ మాత్రమే కాదని, పక్కా ప్లాన్‌తో చేసిన మానసిక హింస అని వారు అంటున్నారు. తమ కూతురితో ఉన్న బంధానికి ఇక విలువ లేదనిపించేలా షాజహాన్ ప్రవర్తించాడని, ఈ విషయాన్ని ఆమె తన చివరి లేఖలో స్పష్టంగా రాసిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

34
కేసులో కీలక మలుపు.. ముగ్గురి అరెస్ట్

ఈ కేసులో పోలీసులు వేగంగా స్పందించారు. షాజహాన్‌తో పాటు అతని తల్లిదండ్రులను కూడా అరెస్ట్ చేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించారనే అభియోగంపై వారిపై కేసు నమోదు చేశారు. నిందితులందరినీ కోర్టులో హాజరుపరచగా, వారికి జ్యుడిషియల్ కస్టడీ విధించారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్, డిజిటల్ ఆధారాల ఆధారంగా తదుపరి విచారణ కొనసాగుతుందని పోలీసులు చెబుతున్నారు. ఇది కేవలం ఇద్దరి మధ్య గొడవేనా లేక దీని వెనుక ఏదైనా పెద్ద కుట్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

44
చదువుకున్న అమ్మాయిలూ... ఏమిటీ తొందరపాటు..!

రెహానా చదువులేని అమ్మాయి కాదు అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోడానికి. ఆమె చాలా తెలివైన అమ్మాయి.. ఇటీవలే ఉన్నతచదువులు (ఎమ్మెస్సీ) పూర్తిచేసింది. చదువలో ఎంతో ప్రతిభ చూపి ఏకంగా గవర్నర్ చేతులమీదుగా పట్టా అందుకుంది. ఇలాంటి అమ్మాయి ఆత్మహత్య చేసుకుందంటే అతడు ఎంతలా వేధించాడో అర్ధంచేసుకోవచ్చు.

ఈ ఘటన కేవలం ఒక ఆత్మహత్య మాత్రమే కాదు. నేటితరం సంబంధాలలో ఎమోషనల్ ఇన్‌స్టెబిలిటీ, కమ్యూనికేషన్ గ్యాప్, మానసిక ఆరోగ్యం ఎంత కీలకమో తెలియజేస్తోంది. పెద్దచదువులు చదివి స్వతంత్రంగా ఆలోచించగల అమ్మాయే ఇలా చేసిందంటే ఇక తల్లిదండ్రులపైనే ఆధారపడే అమ్మాయిల సంగతేంటి..? వాళ్ల మానసిక పరిస్థితి ఇంకెంత వీక్ గా ఉంటుంది. అందుకే అమ్మాయిలు స్ట్రాంగ్ గా ఉండాలి... ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోడానికి సిద్దంగా ఉండాలని మానసిక నిపుణులు హెచ్చరించేది.

ప్రస్తుతం ఈ కేసులో 12 పేజీల సూసైడ్ నోట్ అత్యంత కీలకమైన ఆధారంగా మారింది. ఈ లేఖలోని నిజాలు బయటపడితే, ఈ కేసులోని అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories