ఏపీలోని ఈ జిల్లా మ‌రో రంగారెడ్డి కావ‌డం ఖాయం.. క్యూ క‌డుతోన్న ల‌క్షల కోట్ల పెట్టుబ‌డులు

Published : Apr 23, 2026, 02:23 PM IST

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా ఇప్పుడు పెట్టుబడుల హబ్‌గా మారుతోంది. ఈ జిల్లాకు పెట్టుబ‌డులు క్యూ క‌డుతున్నాయి. దీంతో ఈ జిల్లా త్వ‌ర‌లోనే అభివృద్ధిలో ప‌రుగులు పెట్ట‌డం ఖాయ‌మ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

PREV
14
రాంబిల్లిలో క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ – భారీ పెట్టుబడి

రాంబిల్లి ప్రాంతంలో రూ.5,400 కోట్లతో భారీ క్లీన్ ఎనర్జీ ప్లాంట్‌కు సీఎం చంద్ర‌బాబు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 2,100 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. ఈ ప్లాంట్‌లో సోలార్ ఇన్‌గాట్-వేఫర్ ఉత్పత్తి జరగనుంది. దీంతో విదేశాలపై ఆధారపడే పరిస్థితి తగ్గి, దేశీయ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి బలమైన అడుగుగా భావిస్తున్నారు.

24
భారీ పరిశ్రమల ప్రవేశం – స్టీల్ ప్లాంట్‌తో మరో మైలురాయి

ఇటీవలే రూ.1.36 లక్షల కోట్లతో ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన జరిగింది. ఈ ప్రాజెక్ట్ అనకాపల్లి జిల్లాలో పరిశ్రమల విస్తరణకు కీలక మలుపుగా చెబుతున్నారు. ఇలాంటి పెట్టుబడులు వరుసగా రావడం వల్ల ఈ జిల్లా పరిశ్రమల కేంద్రంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

34
రంగారెడ్డి మోడల్ – అనకాపల్లికి కొత్త లక్ష్యం

తెలంగాణ‌లోని రంగారెడ్డి జిల్లాలాగే అనకాపల్లిని దేశంలో అత్యంత ధ‌నిక జిల్లాగా మార్చుతామ‌ని ముఖ్య‌మంత్రి ఈ సంద‌ర్భంగా తెలిపారు. ఈ ప్రాంతంలో రానున్న రోజుల్లో పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరగడం వల్ల జిల్లా ఆర్థికంగా వేగంగా ఎదగనుందని సీఎం తెలిపారు.

44
గ్రీన్ ఎనర్జీ విప్లవం – భారీ ప్రణాళికలు

రాష్ట్రంలో 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పటికే 90 గిగావాట్లకు అనుమతులు లభించాయి. ఈ రంగంలో రూ.5.95 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు సీఎం తెలిపారు. అదే సమయంలో ఎన్‌టీపీసీ కూడా గ్రీన్ ఎనర్జీపై భారీగా పెట్టుబడులు పెట్టనుంది. ఈ ప్రాజెక్టులు పూర్తైతే లక్షలాది మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.

ఎలక్ట్రిక్ భవిష్యత్ – ట్రాన్స్‌పోర్ట్ రంగంలో మార్పులు

రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. త్వరలో 1,050 ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టనున్నారు. అలాగే వేల సంఖ్యలో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. మూడేళ్లలో 5,000కి పైగా ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రణాళిక ఉంది. దీని వల్ల రవాణా రంగంలో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories