vizag
1.ఇండోర్, మధ్యప్రదేశ్:
భారత్ లో అత్యంత పరిశుభ్రమైన నగరంగా (క్లీనెస్ట్ సిటీ) మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నంబర్ 1 స్థానంలో ఉంది. ఈ నగరం వరుసగా ఏడు సంవత్సరాలుగా నంబర్ వన్ ర్యాంకింగ్‌లో కొనసాగుతోంది. వ్యర్థాల నిర్వహణ వ్యవస్థతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అలాగే, గొప్ప పర్యాటక ప్రాంతంగా కూడా ఉంది. దేవి అహల్యాబాయి హోల్కర్ విమానాశ్రయం, ఇండోర్ రైల్వే జంక్షన్ లు మంచి ప్రయాణ సౌకర్యాలుగా ఉన్నాయి.
2. సూరత్, గుజరాత్:
దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరాల్లో సూరత్ రెండో స్థానంలో ఉంది. స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో రెండో స్థానం దక్కించుకున్న గుజరాత్‌లోని ఈ నగరం వస్త్ర, వజ్రాల పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన వాణిజ్య నగరం.
3. నవీ ముంబై, మహారాష్ట్ర:
భారత్ లో అత్యంత పరిశుభ్రమైన నగరాల్లో నవీ ముంబై మూడో స్థానంలో ఉంది. ఈ నగరం చుట్టూ వ్యర్థాలను తగ్గించడం, పునర్వినియోగం చేయడం, రీసైక్లింగ్ చేయడం వంటి చర్యలతో ఈ లిస్టులో చోటుదక్కించుకుంది.
4. విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్:
ఆంధ్రప్రదేశ్‌లోని అతిపెద్ద నగరం విశాఖపట్నం. వైజాగ్‌గా ప్రసిద్ధి చెందిన ఈ తీరప్రాంత నగరం స్వచ్ఛ సర్వేక్ష సర్వే లో భారత్ లోని అత్యంత పరిశుభ్రమైన నగరాల్లో ఒకటిగా నిలిచింది. పర్యావరణాన్ని కాపాడుతూనే స్థిరమైన వృద్ధితో విశాఖపట్నం ఒక ఐకానిక్ నగరంగా ముందుకు సాగుతోంది.
durga temple
5. విజయవాడ, ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ భారతదేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరాల్లో ఒకటిగా నిలిచింది. సమర్థవంతమైన వ్యర్థాల నిర్వహణ, చురుకైన ప్రజా భాగస్వామ్యంతో నగరం పరిశుభ్రతను కాపాడుకోవడంలో అద్భుతమైన పురోగతిని సాధించింది. విజయవాడ భారతదేశంలో పట్టణ పారిశుధ్యానికి ఒక నమూనా నగరంగా కూడా నిలుస్తుంది.
6. భోపాల్, మధ్యప్రదేశ్:
భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరం అవార్డును గెలుచుకున్న మధ్యప్రదేశ్‌లోని మరో నగరం భోపాల్. స్వచ్ఛ సర్వేక్ష మధ్యప్రదేశ్ రాజధాని నగరాన్ని భారతదేశంలోని పరిశుభ్రమైన నగరాల జాబితాలో 6వ స్థానంలో చేర్చింది. సరైన పారిశుధ్యాన్ని నిర్వహించడం, వ్యర్థాలను సరిగ్గా పారవేయడం వల్ల ఈ నగరం ఈ అవార్డును అందుకుంది.
7. తిరుపతి, ఆంధ్రప్రదేశ్:
స్వచ్ఛ సర్వేక్షణ్ లో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి నగరం కూడా భారతదేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరాల్లో జాబితాలో చేరింది. ఈ నగరం కారణంగా మధ్యప్రదేశ్‌తో పాటు, భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రసిద్ధి చెందింది. ఏపీ నుంచి ఈ లిస్టులో చోటు దక్కించుకున్న మూడో నగరం ఇది.
8. మైసూర్, కర్ణాటక:
భారతదేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరాల్లో కర్నాటకలోని మైసూర్ కూడా ఉంది. గృహ వ్యర్థాలను సరిగ్గా వేరు చేయడం, ప్రణాళికాబద్ధమైన వ్యర్థాల నిర్వహణ వ్యవస్తతో ఈ నగరం క్లీనెస్ట్ సిటీగా నిలిచింది. తోటలు, రాజభవనాలతో కూడిన ఈ నగరం పర్యాటకులకు స్వర్గధామంగా చెప్పవచ్చు.
9. న్యూఢిల్లీ, ఢిల్లీ:
వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అవిశ్రాంత ప్రయత్నాలు చేస్తున్నందున న్యూఢిల్లీ భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరాల జాబితాలో చోటు సంపాదించింది. నేషనల్ రైల్ మ్యూజియం, జామా మసీదు, ఎర్రకోట, ప్రగతి మైదాన్, మజ్ను కా టీలా, గురుద్వారా శ్రీ బంగ్లా సాహిబ్, రాష్ట్రపతి భవన్, రాజ్‌ఘాట్‌లు ఇక్కడ చూడదగ్గ ప్రాంతాలుగా ఉన్నాయి.
10. అంబికాపూర్, ఛత్తీస్‌గఢ్:
2025లో ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్ భారతదేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అంబికాపూర్ వరుసగా ఎనిమిది సంవత్సరాలు అత్యంత పరిశుభ్రమైన నగరంగా నిలుస్తోంది. ఇది 2019లో భారతదేశంలో రెండవ అత్యంత పరిశుభ్రమైన నగర అవార్డును కూడా అందుకుంది.