YS Jagan, PM Narendra Modi
ఉభయ సభల్లో వక్ఫ్ బిల్లు పాస్ కావడం, ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదంతో బిల్లు చట్టంగా మారిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ చట్టాన్ని సవాలు చేస్తూ... దేశవ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలు, పార్టీల నుంచి సుప్రీంకోర్టులో పలు పిటీషన్లు దాఖలయ్యాయి. తాజాగా ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పిటిషన్ దాఖలు చేసింది.
YS JAGAN
వక్ఫ్ సవరణ అనేది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని వైసీపీ పేర్కొంది. ముస్లింల మనోభావాలు, వారి అభిప్రాయాలు, అభ్యంతరాలను తెలుసుకోకుండా చట్టం చేయడం సరికాదన్నారు. దీంతో కోర్టులో పిటీషన్ వేసినట్లు పార్టీ చెబుతోంది. వక్ఫ్ బిల్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 13, 14 , 25, 26 లను ఉల్లంఘించేలా ఉందని పేర్కొంది.
ys jagan
ముస్లింల హక్కులు, సమానత్వం, మత స్వేచ్చలకు వ్యతిరేకంగా ఉందని తెలిపింది. వక్ఫ్ కేవలం కొన్ని మతాలకు అనుకూలించేలా ఉందని, అంతేకాకుండా అన్యమతస్తులను వక్ఫ్ బోర్డులో చేర్చేందుకు చట్టం దోహదపడుతోందన్నారు. వక్ఫ్ బోర్డు అంతర్గత విషయాలో ఇతరుల జోక్యం వల్ల బోర్డు స్వతంత్త్ర ప్రతిపత్తి దెబ్బతింటుదని వైసీపీ పిటిషన్‌లో పేర్కొంది. ఈ మేరకు ఆ పార్టీ ఎక్స్ ఖాతాలో పిటిషన్ వివరాలను ట్వీట్ చేసింది.
ys jagan
ఇక వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంట్‌లో వ్యతిరేకంగా వైసీపీ ఎంపీలు ఓటు వేసినట్లు ఆ పార్టీ గతంలో ప్రకటించింది. తమ పార్టీ మైనార్టీలకు అండగా ఉంటుందని పేర్కొంది. దీనిలో భాగంగా వక్ఫ్ బిల్లును ఇటీవల పార్లమెంట్‌లో వైసీపీ వ్యతిరేకించినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నారు.