YCP Sajjala Rama krishna: జగన్‌ 2.0లోనూ సజ్జలదేనా పెత్తనం... అయోమయంలో వైసీపీ, సంతోషంలో కూటమి!

Bala Raju Telika | Published : Apr 13, 2025 6:26 PM
Google News Follow Us

Sajjala Still Behind Jagan2.0: ఓటమి ప్రతి ఒక్కరికీ గుణపాఠం నేర్పుతుందని అంటారు. ఒడిపోవడం తప్పు కాదు.. కానీ కారణాలు తెలుసుకుని వాటిని సరిదిద్దుకోలేకపోతే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. 2019 ఎన్నికల్లో భారీ విజయాన్ని కైవసం చేసుకున్న వైసీపీ... గత ఏడాది ఘెరంగా పరాజయం మూటగట్టుంది. పార్టీ ఓడిపోయినా 40 శాతం ఓటు బ్యాంకు సాధించుకుని కొంత వరకు మనుగడ సంపాదించుకుంది. గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే.. జగన్‌కు అనేక విషయాలు తెలియకుండా కోటరీ అడ్డుకుందని మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నుంచి బయటకు వచ్చి కూటమిలో చేరిన వారు చెబుతున్నారు. ప్రధానంగా వారందరూ సజ్జల రామకృష్ణా రెడ్డి వల్లే ఇబ్బందులు పడినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్‌ మాత్రం సజ్జలకు రోజుకో బాధ్యతను అప్పగిస్తున్నారు. దీనిపై కూటమి ఫుల్‌ హ్యాపీగా కనిపిస్తోంది, వైసీపీలో నేతలు హ్యాపీగా లేరట. అసలు సజ్జల వల్ల వైసీపీకి నష్టమా? లాభమా?  
 

15
YCP Sajjala Rama krishna: జగన్‌ 2.0లోనూ సజ్జలదేనా పెత్తనం... అయోమయంలో వైసీపీ, సంతోషంలో కూటమి!
sajjala ramakrishna reddy talks about snap elections in andhra pradesh

సజ్జల రామకృష్ణ రెడ్డి గతంలో సీఎంగా ఉన్న జగన్‌కు ప్రధాన సలహాదారుగా ఉన్నారు. సజ్జల కుమారుడు భార్గవ్‌ వైసీపీ సోషల్‌మీడియా బాధ్యతలను చూసుకునేవారు. ఇక 2024లొ వైసీపీ ఓడిపోయిన తర్వాత పాతసీసాలో కొత్త నీరు ఎక్కించి జగన్‌ 2.0 అంటే ప్రజలు, ఆ పార్టీ కేడర్‌ గర్వంగా చెప్పుకునే ఉంటుందని అందరూ భావించారు. కానీ మరోసారి మాజీ సీఎం జగన్‌ పాత టీంనే నమ్ముకునేలా కనిపిస్తున్నారని వైసీపీ కీలక నాయకులు తలలు పట్టుకుంటున్నారు. సజ్జల గత ప్రభుత్వ హయాంలో వ్యవహరించన తీరుపై ఇటీవల భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ ఆరోపణలు చేశారు. ఆయనతోపాటు అనేక మంది కూటమి పార్టీలో చేరిన నేతలు సజ్జల కర్ర పెత్తనాన్ని తప్పుబట్టారు. పార్టీలో కూడా అంతర్గతంగా అనేక మంది నాయకులు, రీజనల్‌ కోఆర్డినేటర్లు సైతం ఇప్పుడు, అప్పుడు సజ్జల పెత్తనాన్ని యాక్సెప్ట్‌ చేసే స్థితిలో లేరని చర్చ నడుస్తోంది.  

25

వైసీపీలో అధికారంలో ఉండగా.. జగన్‌కు అనేక విషయాలు తెలయకుండా కోటరీలా ఏర్పడి పార్టీ ఓటమికి సజ్జల కారకుడు అయ్యారని పలువురు వైసీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్కడ కలుసుకున్నా ఇప్పటికీ బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారంట. ఇలాంటి పరిస్థితిల్లో సజ్జలకు కొన్ని నెలల కిందట వైసీపీకి రాష్ట్ర సమన్వయకర్త బాధ్యతలను అప్పగించారు. తాజాగా వైసీపీ పీఏసీ కమిటీకి కూడా ఆయనకే సమన్వయ బాధ్యతలను కట్టబెట్టారు. దీంతో అసలు మాజీ సీఎం జగన్‌కు పార్టీ నడపడం కష్టంగా ఉందా అన్న అనుమానాలు వైసీపీ అగ్రనాయకుల్లో కలుగుతున్నాయంట. 

35
sajjala ramakrishna reddy

వాస్తవానికి సజ్జల రామకృష్ణా రెడ్డి తెలివితేటలకు, ఆయన రాజకీయ చాతుర్యానికి తిరుగులేదు. పైగా మాటకారి.. మీడియాకు ఏ బెరుకు లేకుండా సమాధానం చెప్పగలరు. కానీ మనకున్న తెలివితేటలు ఎవరికీ లేవు.. అందరివీ మట్టిబుర్రలే అన్నట్లు ప్రవర్తిస్తే సమస్యలు మొదలవుతాయి. పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కీలకమైన వ్యక్తుల అభిప్రాయాలు తీసుకుని చేస్తే.. ఎలాంటి గొడవలు ఉండవు. అలా కాకుండా ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకోవడం వల్లే సమస్యలు, తలనొప్పులు మొదలవుతాయి. గత ప్రభుత్వ హయాంలో అనేక నిర్ణయాలు అలాగే జరిగేవని దాని వల్లే పార్టీకి చెడ్డపేరు వచ్చిందని వైసీపీ నాయకులు చర్చించుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో జగన్‌ తాడేపల్లికి పరిమితం అయ్యి.. పరిపాలన అంతా సజ్జల చూసుకోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని వైసీపీ నాయకులు మాట్లాడుకుంటున్నారు. 

Related Articles

45
sajjala

రీసెంట్‌గా వైసీపీ పూర్తిగా పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌రిస్తున్నామంటూ 33 మంది పార్టీ పొలిటిక‌ల్ అడ్వైజ‌రీ క‌మిటీ (పీఏసీ) జాబితాను కేంద్ర క‌మిటీ ప్ర‌క‌టించింది. అయితే ఆ కమిటీ కన్వీనర్‌గా స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిని జగన్‌ నియమించారు. దీంతో పెద్దఎత్తున సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వచ్చాయంట. రీజనల్‌ కోఆర్డినేటర్లు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ నియామకంపై అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. దీంతో వెంటనే పార్టీ కార్యాలయం నుంచి మరోనోట్‌ను విడుదల చేసి స‌జ్జ‌ల క‌న్వీన‌ర్ కాద‌ని, కేవ‌లం కోఆర్డినేట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తారని పార్టీ ప్రకటించింది. ఇక సజ్జలకు కీలక బాధ్యతలను కట్టబెట్టడంపై పార్టీ నాయకుల్లో అనేక ప్రశ్నలు మెదులుతున్నాయని సమాచారం. భవిష్యత్తులో పార్టీని జగన్‌ నడుపుతారా? లేదా సజ్జలకు కట్టబెడతారా? ఇలా అయితే.. రాజకీయలు చేయలేమని కొందరు కీలక నేతలు తెగేసి చెబుతున్నారని వినికిడి. స‌జ్జ‌ల గురించి పార్టీలో ఏమ‌నుకుంటున్నారో నిజంగానే జ‌గ‌న్‌కు తెలియ‌దా? లేక అన్నీ తెలిసి ఇలా చేస్తున్నారా అనే సందేహాన్ని సైతం వారు వ్యక్తం చేస్తున్నారంట. పార్టీని నడిపే ఓపికి అసలు జగన్‌కు ఉందా.. ఉంటే సజ్జలకు మరోసారి ఇలా కీలకబాధ్యతలు అప్పగించడం ఏంటని, తప్పులను ఎప్పుడు సరిచేసుకుంటారని నాయకులు మదనపడుతున్నట్లు సమాచారం. 

 

55
sajjala bhargav reddy father..

కూటమి పార్టీ చేసే పొరపాట్లు, లోటుపాట్లను ఎత్తిచూపి వచ్చే ఎన్నికల నాటికి బలోపేతం కావాలని వైసీపీ క్యాడర్, లీడర్‌ భావిస్తున్నారు. అయితే.. వర్గాలను పెంచిపోషించే వారికి కీలక బాధ్యతలు ఏవిధంగా కట్టబెడుతున్నారో తెలియక వైసీపీ నాయకులు తలలుపట్టుకుంటున్నారంట. ఇక సజ్జల నియామకంపై టీడీపీ, జనసేన శ్రేణులు సామాజిక మాధ్యమాల్లో వి ఆర్‌ హ్యాపీ అనే పోస్టులు పెడుతున్నారు. ఇలాగే నిర్ణయాలు తీసుకుని మంటగలసిపోవాలి అంటూ స్మైల్‌ ఎమోజీలు పెడుతున్నారు. మరోవైపు వైసీపీ రీజనల్‌ కోఆర్డినేటర్లు, ముఖ్యనేతలు మాత్రం సంతృప్తికరంగా లేరని మాత్రం తెలుస్తోంది. ఇప్పటికే పార్టీకి తొలి నుంచి కీలకంగా ఉన్న విజయసాయి రెడ్డి వైసీపీని వీడారు, గతంలో అనేక మంది పార్టీ నుంచి దూరమయ్యారు. ఇందులో ఎక్కువ మంది సజ్జల పెత్తనాన్ని జీర్ణించుకోలేని వారే ఉండటం గమనార్హం. అతను తప్ప ఇంక పార్టీలో పదవులు ఇవ్వడానికి నాయకులే లేనట్టు జగన్‌ వ్యవహరిస్తున్న తీరు చూస్తే.. వైసీపీ అభిమానులకు మైండ్‌ బ్లాక్‌ అవుతోందని టాక్‌ నడుస్తోంది.   

Read more Photos on
Recommended Photos