రూ.182400 సాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, నో ఎగ్జామ్.. మన విశాఖపట్నంలోనే పోస్టింగ్

Published : Nov 10, 2025, 09:22 AM IST

Central Government Jobs 2025 : నెలనెలా లక్షల జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం… పోస్టింగ్ తెలుగు రాష్ట్రాల్లోనే. ఇంకెందుకు ఆలస్యం… మీకు అన్ని అర్హతలుంటే వెంటనే అప్లై చేసుకొండి. 

PREV
18
తెలుగు యువతకు లక్కీ ఛాన్స్

Jobs : తెలుగు యువతకు గుడ్ న్యూస్ ... కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ (PRC) లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. విశాఖపట్నంలోని PRC సెంటర్ పోస్టింగ్.. అంటే స్వరాష్ట్రంలోనే మంచి సాలరీతో కూడిన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పొందే అద్భుత అవకాశం తెలుగు యువతకు వచ్చిందన్నమాట. కాబట్టి ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకొండి... వెంటనే అప్లై చేసుకొండి... ఉద్యోగాన్ని పొందండి.

28
పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ జాబ్స్

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 16 రాష్ట్రాల్లో 18 పాపులేషన్ రీసెర్చ్ సెంటర్స్ పనిచేస్తున్నారు. ఇందులో ఒకటి ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో ఉంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం 1978 లో జనాభా పెరుగుదలకు సంబంధించిన అంశాలపై పరిశోధన కోసం స్థాపించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజారోగ్యానికి సంబంధించిన పథకాలు, కార్యక్రమాల కోసం ఈ PRC డేటా ఎంతగానో ఉపయోగపడుతోంది. తాజాగా ఆంధ్ర యూనివర్సిటీలోని ఈ PRC కేంద్రంలో మొత్తం 6 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో అసిస్టెంట్ ప్రొఫెసర్ తో పాటు క్లర్క్ పోస్టులున్నాయి.

38
పోస్టుల వారిగా ఖాళీల వివరాలు
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ - 01 (అన్ రిజర్వుడ్)
  • రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్ - 01 (అన్ రిజర్వుడ్)
  • ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ - 02 ( అన్ రిజర్వుడ్)
  • రీసెర్చ్ ఫెల్లో (కాంట్రాక్ట్) - 01 (అన్ రిజర్వుడ్)
  • ఎల్డిసి/టైపిస్ట్ (కాంట్రాక్ట్) - 01 (అన్ రిజర్వుడ్)
48
ముఖ్యమైన తేదీలు
  • దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 25 అక్టోబర్ 2025
  • దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ : 25 నవంబర్ 2025

దరఖాస్తు ఫారమ్ డౌన్‌లోడ్ చేసి నవంబర్ 25, 2025లోగా The Registrar, Central Administrative Office, Andhra University, Visakhapatnam-530003 చిరునామాకు పంపాలి.

58
విద్యార్హతలు

అసిస్టెంట్ ప్రొఫెసర్ : మాస్టర్ డిగ్రీ ఇన్ డొమోగ్రఫి లేదా పాపులేషన్ స్టడీస్ లేదా స్టాటిస్టిక్స్ లేదా బయో స్టాటిస్టిక్స్ లేదా ఎకనామిక్స్ లేదా మేథమెటిక్స్ లేదా సోషియాలజి లేదా సోషల్ వర్క్ లేదా సైకాలజీ లేదా ఆంథ్రపాలజీ.

మిగతా ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ చేసినవారు అర్హులు. టైపిస్ట్ పోస్టులకు ప్రత్యేక అర్హతలుంటాయి.

68
వయో పరిమితి

అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి లేదు. మిగతా ఉద్యోగాలకు 18 నుండి 42 ఏళ్లలోపు వారు అర్హులు. అయితే ఎస్సి, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబిసిలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు గరిష్టంగా 15 ఏళ్లు వయోపరిమితి సడలింపు ఉంటుంది.

78
ఎంపిక విధానం

ఎలాంటి రాత పరీక్ష ఉండదు. మెరిట్ ఆధారంగా దరఖాస్తు చేసుకున్నవారిని షార్ట్ లిస్ట్ చేసి తర్వాత కంప్యూటర్ టెస్ట్, ఆ తర్వాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ తర్వాత అభ్యర్థులకు ఫైనల్ చేస్తారు.

88
సాలరీ

విశాఖపట్నం PRC లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు నెలనెలా రూ.57,700 నుండి రూ.1,82,400 వరకు జీతం ఉంటుంది. మిగతా ఉద్యోగాలకు జీతం రూ.37,747 వరకు ఉంటుంది. ఇతర అలవెన్సులు కూడా వర్తిస్తాయి.

మరిన్ని వివరాలకు అధికారిక నోటిఫికేషన్ ను పరిశీలించండి… ఆ తర్వాతే దరఖాస్తు చేసుకొండి. 

Read more Photos on
click me!

Recommended Stories