Free Bus Travel: ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం.. గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్ర‌బాబు.. కీలక ఆదేశాలు

Published : Jul 21, 2025, 05:53 PM IST

Free Bus Travel: ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని జిల్లాలో ఎక్కడికైనా ‘జీరో ఫేర్ టికెట్’తో ప్రయాణించవచ్చిన పేర్కొంటూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కీల‌క ఆదేశాలు జారీ చేశారు.

PREV
15
ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణ ప‌థ‌కం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకువ‌స్తున్న ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకం ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది. సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ విషయాన్ని స్పష్టంగా ప్రకటించారు.

మహిళలు జిల్లాలో ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని సీఎం వెల్లడించారు. ఈ ప్రయోజనం రాష్ట్రంలోని అన్ని జిల్లాల మహిళలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ క్ర‌మంలోనే కీల‌క ఆదేశాలు ఇచ్చారు.

25
ఉచిత బ‌స్సు ప్ర‌యాణం కానీ, టిక్కెట్టు ఇస్తారు !

మహిళలకు ఇచ్చే టికెట్‌పై ‘జీరో ఫేర్ టికెట్’ అనే విధానాన్ని ప్రవేశపెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ టికెట్‌లో ప్రయాణ స్థలం, ప్రయోజనం పొందిన మొత్తం, ప్రభుత్వ రాయితీ వివరాలు ముద్రించాలన్నారు. 

దీనివల్ల మహిళలు తమకు ప్రయోజనం ఎంతగా లభించిందో స్పష్టంగా తెలుసుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాడు ఆధికారుల‌కు సూచించారు.

35
ఉచిత బ‌స్సు ప్ర‌యాణం ప‌థ‌కం ఆర్థిక భారం కాకుండా చర్యలు

ఉచిత బ‌స్సు ప్ర‌యాణం పథకం ఆర్టీసీకి భారంగా మారకుండా చూసేందుకు ఇతర ఆదాయ మార్గాలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నిర్వహణ వ్యయం తగ్గించే మార్గాలను అన్వేషించి సంస్థను లాభాల బాటలో నడిపే విధంగా కార్యాచరణ రూపొందించాలని అధికారుల‌ను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల అనుభవాల ఆధారంగా ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.

45
ఇకపై ఏపీ ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు మాత్ర‌మే !

భవిష్యత్తులో ఏపీ ఆర్టీసీ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులే కొనుగోలు చేయాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావ‌డం ద్వారా నిర్వహణ వ్యయం తగ్గుతుందని పేర్కొన్నారు. అవసరమైన విద్యుత్‌ను స్వయం ఉత్పత్తి చేసుకునే చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని RTC డిపోలలో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశించారు.

55
ఎన్నికల హామీల‌ను త‌ప్ప‌కుండా అమ‌లు చేస్తాం : చంద్రబాబు నాయుడు

2024 ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఒకటి. ఈ హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం స్కీమ్‌ను రూపొందించి అమలుకు కసరత్తు ప్రారంభించింది. తాము ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అమలవుతోన్న ఉచిత బస్సు ప్ర‌యాణం పథకాలను అధ్యయనం చేసి, అక్కడి విధానాల ఆధారంగా ఏపీలో అమలుకు సిద్ధమవుతోంది.

ఆగస్టు 15 నుంచి అమలుకానున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక పురోగతికి నాంది పలుకుతుంద‌ని అధికార వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ‘జీరో ఫేర్ టికెట్’, ఎలక్ట్రిక్ బస్సులు, నిర్వహణ వ్యయం తగ్గింపు వంటి చర్యలతో ఇది వ్యయబద్ధమైన పథకంగా మారనుందని చెబుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories