Amaravati: దుబాయ్ సింగపూర్ రేంజ్‌లో అమరావతి.. రూ. 415 కోట్లతో మైండ్ బ్లోయింగ్ ప్లాన్ !

Published : Aug 31, 2026, 11:21 AM IST

Amaravati: దుబాయ్, సింగపూర్ తరహాలో అమరావతి రాజధానిలో రూ.415 కోట్లతో డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ నిర్మాణానికి సీఆర్‌డీఏ గ్లోబల్ టెండర్లు పిలిచింది. అమరావతిలో దేశంలోనే అతిపెద్ద సెంట్రల్ కూలింగ్ ప్లాంట్ కు ప్రభుత్వం సద్ధమైంది.

PREV
15
అమరావతిలో గ్లోబల్ లెవెల్ డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్

దుబాయ్, సింగపూర్, దోహా వంటి అంతర్జాతీయ మెట్రోపాలిటన్ సిటీల్లో చూసే అత్యాధునిక మౌలిక వసతులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అందుబాటులోకి రాబోతున్నాయి. పర్యావరణ హితంగా, ఏపీ రాజధానిని గ్లోబల్ స్టాండర్డ్స్‌లో నిర్మించేందుకు ప్రభుత్వం ఒక పవర్ ఫుల్ నిర్ణయం తీసుకుంది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలోని సచివాలయం, శాసనసభ, హైకోర్టు వంటి భవనాల కోసం సెంట్రలైజ్డ్ డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (APCRDA) గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది.

25
రూ. 415 కోట్లతో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ మోడల్

ఈ భారీ అల్ట్రా మోడర్న్ ప్రాజెక్టును పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ పద్ధతిలో చేపట్టబోతున్నారు. దీని అంచనా వ్యయం సుమారు 415 కోట్ల రూపాయలు. బిల్ట్- డెవలప్- ట్రాన్స్‌ఫర్ ప్రాతిపదికన ఈ ప్లాంట్‌ను డెవలప్ చేయడానికి సీఆర్డీఏ ప్లాన్ చేసింది. కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థకు లీజు రూపంలో స్థలాన్ని కేటాయిస్తారు. కూలింగ్ యాజ్ ఏ సర్వీస్ మోడల్‌లో ఈ ప్రాజెక్ట్ నడుస్తుంది. బిడ్లు దాఖలు చేయడానికి సెప్టెంబరు 17 మధ్యాహ్నం 3 గంటల వరకు టైమ్ ఉంది. లీజ్ సాధించిన సంస్థ ఏడాదిన్నరలో నిర్మాణం పూర్తి చేసి, 30 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతలను చూసుకోవాల్సి ఉంటుంది.

35
ఒకే చోట కూలింగ్ ప్లాంట్.. భూగర్భ పైప్‌లైన్ నెట్‌వర్క్

సాధారణంగా ప్రతి ఆఫీస్ లేదా గదికి విడివిడిగా ఏసీలు వాడతారు. కానీ ఈ డిస్ట్రిక్ట్ కూలింగ్ విధానంలో 1,350 ఎకరాల అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధికి ఒకే సెంట్రలైజ్డ్ రిఫ్రిజిరేషన్ ప్లాంట్ ఉంటుంది. దాదాపు 30,000 టన్నుల కూలింగ్ సామర్థ్యంతో ఈ సెంట్రల్ ప్లాంట్ పనిచేస్తుంది. ఇక్కడి నుంచి చల్లటి నీటిని ప్రత్యేక భూగర్భ ఇన్సులేటెడ్ పైప్‌లైన్ నెట్‌వర్క్ ద్వారా ప్రతి ప్రభుత్వ భవనానికి పంపిస్తారు. దీనివల్ల బిల్డింగ్ ల పైన ఉండే పెద్ద పెద్ద ఏసీ అవుట్‌డోర్ మెషీన్లు తగ్గడమే కాక రాజధాని అందం దెబ్బతినకుండా ఉంటుంది.

45
40 శాతం విద్యుత్ ఆదా.. ఎన్విరాన్‌మెంట్ ఫ్రెండ్లీ టెక్నాలజీ

విడివిడిగా ఏసీలు పెట్టడం వల్ల కరెంట్ బిల్లులు పెరగడమే కాకుండా, పర్యావరణానికి హాని చేసే గ్రీన్‌హౌస్ వాయువులు విపరీతంగా విడుదలవుతాయి. అయితే ఈ సెంట్రలైజ్డ్ కూలింగ్ విధానం వల్ల దాదాపు 30 నుంచి 40 శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ భాగస్వామ్యంతో గ్రీన్ ఎనర్జీని ఉపయోగించి ఈ ప్లాంట్ నడిచేలా ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల పర్యావరణానికి ముప్పు తగ్గుతుంది.

55
సింగపూర్, దుబాయ్ సిటీల సరసన అమరావతి

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సింగపూర్ (మరీనా బే), దుబాయ్ (డౌన్‌టౌన్), ఖతార్ లోని దోహా (ది పెర్ల్) వంటి టాప్ గ్లోబల్ సిటీస్ మాత్రమే ఈ టెక్నాలజీని వాడుతున్నాయి. అమరావతిని కేవలం పరిపాలనా నగరంగానే కాకుండా, ఫ్యూచర్ నీడ్స్‌కు తగ్గట్టుగా అల్ట్రా-మోడర్న్ డెస్టినేషన్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories