Severe cyclones in AP: ఆంధ్రప్రదేశ్ ను వణికించిన తీవ్ర తుఫానులు ఇవే, వర్ష బీభత్సాన్నే సృష్టించాయి

Published : Oct 28, 2025, 12:25 PM IST

Severe cyclones in AP: ఆంధ్రప్రదేశ్లో సైక్లోన్ మొంథా గడగడలాడిస్తోంది. తీవ్ర తుపానుగా మారి వర్ష బీభత్సాన్ని సృష్టించేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన తీవ్ర తుఫానుల గురించి తెలుసుకుందాం. 

PREV
15
ఏపీ చరిత్రలో భారీ తుఫానులు

ప్రతి ఏడాది తుపానుల బారిన పడే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటుంది.ఈ రాష్ట్రం తూర్పు తీరాన ఉండడం, బంగాళాఖాతం పక్కనే ఉండడం వల్ల సహజంగానే తుపానుల బారిన పడుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఈ తుపానుల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టాలు కూడా కలుగుతాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాల కారణంగా భారీ తుపానులు ఏర్పడ్డాయి. అలాంటి వాటిలో కొన్నింటిని మర్చిపోవడం చాలా కష్టం.

25
హుద్ హుద్

ఆంధ్రప్రదేశ్ ప్రజలు హుద్ హుద్ తుఫానును మర్చిపోలేరు. 2014 అక్టోబర్ 12న విశాఖపట్నం తీరాన్ని ఈ తుఫాను ఎంతో బలంగా తాకింది. గంటకు 180 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. వైజాగ్ లోని భవనాలు, చెట్లు, విద్యుత్ స్తంభాలు అన్నీ కూలిపోయాయి. వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఈ తుపాను తర్వాత విశాఖపట్నం నగరాన్ని తిరిగి నిలబెట్టడానికి ప్రభుత్వం ఎంతో కష్టపడింది. అది పెద్ద సవాలుగా మారిపోయింది. వైజాగ్ లో ఉన్న కోటీశ్వరుల సైతం తుపాను కారణంగా ఆకలితో అలమటించాల్సి వచ్చింది.

35
ఫైలిన్ తుఫాను

2013లో ఫైలిన్ తుపాను ఏపీ తీరాన్ని గట్టిగానే తాకింది. దీనివల్ల ఉత్తరాంధ్ర జిల్లాల వారికి విపరీతమైన వర్షాలు, గాలి వానలు ఏర్పడ్డాయి. వందలాది గ్రామాలు నీళ్లలో మునిగిపోయాయి.ఆంధ్ర రాష్ట్రానికి చెందిన రైతులు ఎంతోమంది వ్యవసాయపరంగా తీవ్రంగా నష్టపోయారు.

45
గులాబ్

2021లో ఏర్పడిన గులాబ్ తుఫాను కూడా విశాఖపట్నాన్ని అల్లాడించింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా జిల్లాల్లో విపరీతమైన వర్షాలు పడ్డాయి. గాలి వేగం గంటకు 90 కిలోమీటర్ల వేగంతో పెరిగింది. రహదారులు, విద్యుత్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నాయి. పంటలన్నీ నాశనమైపోయాయి.2010లో వచ్చిన లైలా తుఫాను గుంటూరు, ప్రకాశం జిల్లాలో విపరీతమైన వర్షాలను కురిపించింది. దీనివల్ల రైతులు, ప్రజలు భారీగా నష్టపోయారు.

55
దివిసీమ ఉప్పెన

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో దివిసీమ ఉప్పెన మర్చిపోలేని ఘటనగా మిగిలిపోయింది. చరిత్రలో జరిగిన అత్యంత భయంకరమైన ప్రకృతి విపత్తులలో దివిసీమ ఉప్పెన కూడా ఒకటి. భారీ తుఫాను, సముద్రపు అలల కారణంగా కృష్ణాజిల్లాలోని దివి సీమ ప్రాంతం పూర్తిగా మునిగిపోయింది. అత్యంత ఘోరమైన విపత్తుల్లో ఇది ఒకటిగా నిలిచిపోయింది. 1977 నవంబర్ 19న ఈ సంఘటన జరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన భారీ తుఫాను కారణంగా పంట నష్టం, పదివేల మందికి పైగా ప్రజల మరణం వంటివి చోటు చేసుకున్నాయి. సముద్రమట్టం నుండి నీరు మూడు నుంచి ఐదు మీటర్ల ఎత్తున పైకి ఎగిసి తీర ప్రాంతాన్ని పూర్తిగా ముంచేసింది. అలాగే మచిలీపట్నం, అవనిగడ్డ, నాగాయలంక ప్రాంతాల్లో కూడా చొచ్చుకుని వచ్చేసింది.

Read more Photos on
click me!

Recommended Stories