టీడీపీతో పొత్తుపై సంక్రాంతికి విడుదల: మోడీకి నివేదిక

First Published | Dec 29, 2023, 4:29 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  టీడీపీతో పొత్తుపై  సంక్రాంతికి భారతీయ జనతా పార్టీ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. 

టీడీపీతో పొత్తుపై సంక్రాంతికి విడుదల: మోడీకి బీజేపీ నివేదిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  పొత్తుల విషయంలో  భారతీయ జనతా పార్టీ  సంక్రాంతి తర్వాత  ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తుల విషయమై  భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆ పార్టీ  జాతీయ నాయకత్వానికి నివేదిక పంపింది.   పొత్తుల విషయంలో బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకోనుంది.  

also read:బీసీలపై తెలుగు దేశం ఫోకస్: జయహో బీసీకి శ్రీకారం, జగన్ ‌కు చెక్ పెట్టేనా?

టీడీపీతో పొత్తుపై సంక్రాంతికి విడుదల: మోడీకి బీజేపీ నివేదిక


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన, బీజేపీ మధ్య పొత్తుందని  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయాన్ని కాషాయ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి  గుర్తు చేశారు. తాము కూడ  జనసేనతో  పొత్తు విషయంలో సందేహం లేదని  ఆమె పునరుద్ఘాటించారు

also read:నాలుగేళ్లకో పెళ్లి: మ్యారేజీ స్టార్ అంటూ పవన్ కళ్యాణ్ పై జగన్ తీవ్ర విమర్శలు

Latest Videos


టీడీపీతో పొత్తుపై సంక్రాంతికి విడుదల: మోడీకి బీజేపీ నివేదిక

 అయితే  జనసేన, టీడీపీలు 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. అయితే  టీడీపీతో కలిసి  పోటీ చేసే విషయమై  బీజేపీ పార్లమెంటరీ బోర్డు  నిర్ణయం తీసుకుంటుందని  పురంధేశ్వరి ప్రకటించారు. తెలుగుదేశం, జనసేన మధ్య సీట్ల సర్ధుబాటు ప్రకటనపై చర్చలు చివరి దశకు వచ్చాయి.  

also read:బీఆర్‌ఎస్‌కు కాళేశ్వరం కష్టాలు: మేడిగడ్డ ముంచుతుందా, తేల్చుతుందా?

టీడీపీతో పొత్తుపై సంక్రాంతికి విడుదల: మోడీకి బీజేపీ నివేదిక

2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో  తెలుగుదేశం, బీజేపీలు కలిసి పోటీ చేశాయి.  తెలంగాణ రాష్ట్రంలో కూడ  ఈ కూటమి పోటీ చేసింది. అయితే ఈ కూటమి అభ్యర్థులకు  రెండు రాష్ట్రాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించారు. 

also read:జగనన్న వదిలిన బాణం: కాంగ్రెస్‌ చేతికి అస్త్రం కానుందా?

టీడీపీతో పొత్తుపై సంక్రాంతికి విడుదల: మోడీకి బీజేపీ నివేదిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని  విపక్షాలు  కలిసి పోటీ చేయాలని  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారు.తెలుగుదేశంతో జనసేన పొత్తుకు ఇదే ప్రధాన కారణంగా  పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు.  జనసేన విడిగా పోటీ చేసినా  ఆ పార్టీ వైఎస్ఆర్‌సీపీని ఓడించే పరిస్థితి లేదు. దీంతో  ఈ రెండు పార్టీలు కలవాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. మరో వైపు  ఇదే కూటమిలో బీజేపీ కూడ  చేరాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్  ఆకాంక్షను వ్యక్తం చేశారు.

also read:కాంగ్రెస్‌లోకి వై.ఎస్. షర్మిల?: వై.ఎస్. విజయమ్మ ఎటువైపు

టీడీపీతో పొత్తుపై సంక్రాంతికి విడుదల: మోడీకి బీజేపీ నివేదిక

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది,  విడి విడిగా పోటీ చేస్తే ఎలా ఉంటుందనే విషయమై  బీజేపీ నాయకత్వం  నివేదికను తెప్పించుకుంది.మోడీకి ఈ నివేదిక చేరింది. ఈ విషయమై రాష్ట్ర నేతల నుండి కూడ  పార్టీ నాయకత్వం అభిప్రాయాలను అడిగినట్టుగా  ప్రచారం సాగుతుంది.

also read:ఆయేషా మీరా హత్యకు నేటికి 16 ఏళ్లు: ఎన్నో మలుపులు, తేలని దోషులు

టీడీపీతో పొత్తుపై సంక్రాంతికి విడుదల: మోడీకి బీజేపీ నివేదిక

తెలుగుదేశం పార్టీతో  కలిసి పోటీ చేస్తే  బీజేపీ 12 అసెంబ్లీ స్థానాలు, ఆరు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తుంది. బీజేపీ తన వైఖరిని ప్రకటించిన తర్వాత  ఈ రెండు  పార్టీలు తమ సీట్ల సర్దుబాటుపై ప్రకటన చేసే అవకాశం ఉంది.

also read:ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ కూటమి:బాబుకు దెబ్బేనా?

click me!