Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. దూసుకొస్తున్న తుపాను.. జిల్లాల్లో కుండపోత వర్షాలు

Published : Sep 22, 2026, 09:33 AM IST

Weather Update: బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర తుపానుగా మారే అవకాశం వుందని భారత వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి.

PREV
15
బంగాళాఖాతంలో డేంజర్ బెల్స్.. తుపానుగా మారుతున్న అల్పపీడనం

బంగాళాఖాతంలో మొదలైన అలజడి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను వణికించేందుకు సిద్ధమైంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త బలపడి వాయుగుండంగా మారింది. ఇది రాబోయే 24 గంటల్లో మరిన్ని నీటి ఆవిరిని పీల్చుకుని 'తీవ్ర వాయుగుండం'గా మారబోతోందని భారత వాతావరణ శాఖ (IMD), ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) స్పష్టం చేశాయి. ఒకవేళ ఇది మరింత తీవ్ర రూపం దాల్చితే దీనికి 'ఆర్నాబ్' తుపానుగా నామకరణం చేయనున్నారు. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

25
విశాఖ – గోపాల్‌పూర్ మధ్య తీరం దాటే అవకాశం

ఈ తీవ్ర వ్యవస్థ ప్రస్తుతం పశ్చిమ-వాయువ్య దిశగా వేగంగా కదులుతోంది. తాజా వెదర్ రిపోర్ట్స్ ప్రకారం, బుధవారం సెప్టెంబర్ 23 రాత్రి లేదా గురువారం సెప్టెంబర్ 24 తెల్లవారుజామున ఇది ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, ఒడిశాలోని గోపాల్‌పూర్ ప్రాంతాల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఈ సమయంలో తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో భయంకరమైన ఈదురుగాలులు వీస్తాయి. సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారనున్నందున మత్స్యకారులు సెప్టెంబర్ 26 వరకు సముద్రంలో వేటకు వెళ్లకూడదని ఆంక్షలు విధించారు.

35
ఆంధ్రప్రదేశ్ వాతావరణం: ఆ జిల్లాలకు 'రెడ్ అలర్ట్' జారీ

కోస్తాంధ్ర జిల్లాలపై ఈ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉండనుంది. వర్ష తీవ్రతను బట్టి అధికారుల అలర్ట్‌లు ఇచ్చారు..

• సెప్టెంబర్ 23 (బుధవారం): డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలతో పాటు యానాం ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అమలులో ఉంటుంది.

• సెప్టెంబర్ 24 (గురువారం): కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, యానాంలలో భారీ వర్షాలు పడనుండటంతో రెడ్ అలర్ట్ ఇచ్చారు.

రాయలసీమలోని కర్నూలు, వైఎస్సార్ కడప, తిరుపతి తదితర జిల్లాల్లో ఎండ, ఉక్కపోతతో పాటు అక్కడక్కడా స్వల్ప జల్లులు పడే అవకాశం ఉంది. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, SDRF, NDRF బృందాలను సిద్ధం చేయాలని, అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు.

45
తెలంగాణ పరిస్థితి: హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు

తెలంగాణలోనూ వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రానున్న 48 గంటల్లో హైదరాబాద్‌తో సహా పలు జిల్లాల్లో వర్షాల ఉధృతి పెరిగే అవకాశం ఉంది.

• ఆరెంజ్ అలర్ట్: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడొచ్చని ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

• ఎల్లో అలర్ట్: ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, నల్గొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు.

హైదరాబాద్ పరిధిలోని ఆకాశం మేఘావృతమై ఉండి, మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన సడెన్ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సాయంత్రం ట్రాఫిక్ చిక్కులు పడకుండా జీహెచ్‌ఎంసీ (GHMC) సిబ్బంది ముందస్తు చర్యలు చేపట్టారు.

55
ప్రజలకు హెచ్చరికలు

భారీ వర్షాలు, బలమైన గాలుల నేపథ్యంలో విపత్తు నిర్వహణ శాఖ కొన్ని కీలక సూచనలు చేసింది..

• గ్రామీణ ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున, ప్రవాహాలు దాటేందుకు సాహసించవద్దు.

• ఈదురుగాలులు వీచే సమయంలో పాత భవనాలు, చెట్లు, విద్యుత్ స్తంభాలు లేదా హోర్డింగ్‌ల కింద నిలబడకూడదు.

• అనవసరమైన ప్రయాణాలను వాయిదా వేసుకోవడం శ్రేయస్కరం. అత్యవసర పరిస్థితుల కోసం ప్రభుత్వం 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్‌లను అందుబాటులోకి తెచ్చింది.

Read more Photos on
click me!

Recommended Stories