Pawan Kalyan : వైసిపి బిగ్ షాకిచ్చి జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే... ఎవరీ వరుపుల సుబ్బారావు?

Published : Sep 21, 2026, 09:02 PM ISTUpdated : Sep 21, 2026, 09:16 PM IST

ఇప్పటికే అధికారాన్ని కోల్పోయి డీలాపడ్డ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.

PREV
13
జనసేనలోకి మాజీ ఎమ్మెల్యే వరుపుల

Janasena Party : గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన వైసిపి ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. ఎన్నికలకు ముందే కొందరు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ పార్టీని వీడగా అధికారాన్ని కోల్పోయాక ఈ వలసలు పెరిగాయి. వైసిపి నుండి తెలుగుదేశం, జనసేన పార్టీల్లో చేరికలు పెరిగాయి... తాజాగా ఓ మాజీ ఎమ్మెల్యే ఆ పార్టీకి షాక్ ఇచ్చాడు.

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే, వైసిపి సీనియర్ నాయకులు వరుపుల సుబ్బారావు జనసేన కండువా కప్పుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన జనసేనలో చేరారు. ప్రస్తుతం సొంత నియోజకవర్గం పిఠాపురం పర్యటనలో ఉన్న ఉపముఖ్యమంత్రి సుబ్బారావు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

23
జనసేన పార్టీలోకి భారీ చేరికలు

మాజీ ఎమ్మెల్యేతో పాటు పలువురు వైసిపి నాయకులు, కార్యకర్తలు కూడా జనసేనలో చేరారు. ఇలా ప్రత్తిపాడు, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల నుండి వచ్చిన నాయకులకు పవన్ కల్యాణ్ కండువా కప్పారు. వీరిలో పెద్దాపురం మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్, సామర్లకోట మాజీ మున్సిపల్ చైర్మన్ గంగిరెడ్డి అరుణ, రెండు మున్సిపాలిటీలకు చెందిన మాజీ కౌన్సిలర్లు, పలువురు నాయకులు ఉన్నారు. అందరికీ స్వయంగా పవన్ కల్యాణ్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు... క్షేత్రస్థాయి కూటమి నాయకులను సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

వైసిపి నాయకులను జనసేనలో చేర్చుకోవడంలో కీలకంగా వ్యవహరించిన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల రామస్వామి లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ శివ శ్రీనివాస్, రాష్ట్ర నీటి పారుదల అభివృద్ధి సహకార సంస్థ ఛైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్మన్ తోట సుధీర్, కౌడా ఛైర్మన్ తలాటం సత్య, పిఠాపురం ఫైవ్ మెన్ కమిటీ సభ్యులు ఓదూరి కిషోర్ తదితరులు కూడా పాల్గొన్నారు.

33
ఎవరీ వరుపుల సుబ్బారావు?

వరుపుల సుబ్బారావు 1955 లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు వెంకటలక్ష్మి, సూర్యారావు. విద్యార్థి దశనుండే రాజకీయాలపై ఆసక్తి కలిగిన ఆయన కాంగ్రెస్ పార్టీలో చురుకుగా వ్యవహరించారు... 1983 లో ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీచేసి ముద్రగడ పద్మనాభం చేతిలో ఓడిపోయారు.

వరుస ఓటములు ఎదురైనా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నం చేశారు... దీంతో 2004 లో వరుపుల విజయం సాధించారు. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత వైఎస్ జగన్ స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు... ఆ పార్టీ తరపున 2014 లో పోటీచేశారు. రాష్ట్రవ్యాప్తంగా వైసిపికి ఎదురుగాలి వీచినా ప్రత్తిపాడులో మాత్రం సుబ్బారావు విజయం సాధించారు. కానీ 2016లో వైసిపిని వీడి అధికార టిడిపిలో చేరారు.

అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి నుండి టికెట్ దక్కకపోవడంతో తిరిగి వైసిపిలో చేరారు సుబ్బారావు. ఆ పార్టీ తరపునే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలయ్యారు… ఇప్పుడు మళ్లీ పార్టీ మారారు. ఇలా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సుబ్బారావు జనసేన పార్టీలో చేరి కొత్త రాజకీయాలను ప్రారంభించారు.

Read more Photos on
click me!

Recommended Stories