దూసుకొస్తున్న వాయుగుండం.. .. 14 జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ హెచ్చరికలు

Published : Oct 22, 2025, 04:22 PM IST

Heavy Rains alert : బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ హెచ్చరికల మధ్య ఏపీలో 14 జిల్లాలకు భారీ వర్షాలు, ఫ్లాష్‌ఫ్లడ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. 

PREV
15
ఆంధ్రప్రదేశ్ లో 14 జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ వార్నింగ్స్

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పలు ప్రాంతాల్లో ఇప్పటికే వానలు దంచికొడుతున్నాయి. రానున్న 24 గంటల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. దీంతో 14 జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ అలర్ట్‌ జారీ చేశారు. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు వరద ప్రమాద ప్రాంతాలుగా అధికారులు పేర్కొన్నారు.

25
దంచికొడుతున్న వానలు.. అప్రమత్తంగా ఉండండి

బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం రాబోయే 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో హోంమంత్రి అనిత రాష్ట్రవ్యాప్తంగా విపత్తు నిర్వహణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత భవనాల్లో ఉండాలని సూచించారు.

అలాగే, NDRF, SDRF, పోలీస్, ఫైర్‌ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. 24 గంటల కంట్రోల్ రూమ్‌లు ప్రారంభించి, టోల్‌ఫ్రీ నంబర్లు 112, 1070, 18004250101 ద్వారా ప్రజలకు సహాయం అందించాలని సూచించారు.

35
తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కుండపోత వర్షాలు

తిరుపతి, చిత్తూరు జిల్లాలో రెండ్రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమై, రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. తిరుమలలోనూ మోకాళ్ల లోతు వరకు నీరు ప్రవహిస్తోంది. ఆలయ నాలుగు మాఢ వీధులు వర్షపు నీటితో నిండాయి. భక్తులు దర్శనానికి, వసతిగృహాలకు వెళ్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

టీటీడీ అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. రెండవ ఘాట్‌ రోడ్డులో కొండచరియలు విరిగిపడే ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని మానిటరింగ్‌ బృందాలను ఏర్పాటు చేశారు.

45
కోస్తా, రాయలసీమలో అతి భారీ వర్షాలు

నైరుతి బంగాళాఖాతంలో ఉన్న ఈ అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్ర తీరం మీదుగా ఇది కదిలి మరింత బలపడుతుందని తెలిపారు.

దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో కూడా భారీ నుంచి అతి భారీవర్షాలు వచ్చే అవకాశముందని అధికారులు చెప్పారు. ఈదురుగాలులు గంటకు 55 కిమీ వేగంతో వీచే అవకాశం ఉన్నందున చెట్ల క్రింద నిలవకూడదని, లోతట్టు ప్రాంతాల వాసులు బయటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు.

55
తెలంగాణ, తూర్పు తీర ప్రాంతాల పై కూడా ప్రభావం

అల్పపీడనం ఇప్పటికే తమిళనాడు తీరం దాటి ఉత్తరం వైపు కదులుతోంది. దీని ప్రభావం తెలంగాణపై కూడా పడే అవకాశం ఉంది. ఈ సాయంత్రం నుంచి హైదరాబాద్‌తో పాటు గద్వాల, ఖమ్మం, నల్గొండ, కల్వకుర్తి, కొత్తగూడెం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు గమనిస్తే.. ఈ నెలంతా వర్షాలు పడే అవకాశం వుండని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories