తెలుగు విద్యార్థులకు సూపర్ ఛాన్స్.. ఇక ఈ దేశాల్లో ఈజీగా జాబ్స్

Published : Nov 06, 2025, 12:30 PM IST

Overseas Jobs : రాష్ట్రంలోని యువతీయువకులకు విదేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి నారా లోకేష్ ఆసక్తికర ప్రకటన చేశారు.   

PREV
15
విదేశాల్లో ఉద్యోగావకాశాలు..

Anhdra Pradesh Jobs : విదేశాల్లో ఉద్యోగం చాలామంది యువత కల... కానీ అందుకు తగిన స్కిల్స్ లేకపోవడం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొందరు దాన్ని సాకారం చేసుకోలేకపోతున్నారు. అలాంటివారికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెబుతోంది. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఆసక్తి, అర్హత గల యువతీయువకులను విదేశాల్లో ఉద్యోగాలకు సంసిద్దం చేయనున్నట్లు స్వయంగా మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇందుకోసం యువతకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ఓ జాతీయ స్థాయి యూనివర్సిటీతో చర్చలు జరుపుతున్నట్లు లోకేష్ తెలిపారు.

25
విద్యార్థులకు విదేశీ భాషలు

విదేశాల్లో ఉద్యోగం చేయాలంటే స్కిల్స్ ఉండటమే కాదు అక్కడి భాషపై పట్టు ఉండాలి. అయితేనే ఉద్యోగం సాఫీగా సాగుతుంది.. కెరీర్ గ్రోత్ ఉంటుంది. అయితే చాలాదేశాలు ఇంగ్లీష్ ను అధికారిక కార్యకలాపాలకు ఉపయోగిస్తాయి… కాబట్టి ఈ గ్లోబల్ లాంగ్వేజ్ వస్తే చాలనుకుంటారు చాలామంది. కానీ కొన్నిదేశాలు మాత్రం స్థానిక భాషలోనే కార్యకలాపాలు సాగిస్తుంటాయి... ఇలాంటిచోట కేవలం ఇంగ్లీష్ మాత్రమే వస్తే ఇబ్బందులు తప్పవు. అందుకే ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన యువతీయువకులకు విదేశీ భాషలు నేర్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.

విదేశీ భాషలు నేర్చుకునేందుకు ఆసక్తిచూపే ఏపీ యువతీయువకులకు శిక్షణ ఇప్పించేందుకు ఇంగ్లీష్ ఆండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (EFL) తో చర్చలు జరుపుతున్నట్లు లోకేష్ తెలిపారు. హైదరాబాద్ లోకి ఈ సెంట్రల్ యూనివర్సిటీ సహకారంతో జర్మన్, ఇటాలియన్, జపనీస్, కొరియన్ భాషలపై శిక్షణ ఇవ్వనున్నట్లు... తద్వారా ఆయా దేశాల్లో ఉద్యోగ అవకాశాలను మెరుగుపర్చనున్నట్లు నారా లోకేష్ తెలిపారు.

35
ఇప్పటికే జర్మన్ లో ఉద్యోగాలపై చర్యలు

ఏపీ యువతకు జర్మనీలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కూడా ప్రారంభించింది. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద ప్రత్యేక శిక్షణ ఇచ్చి విదేశాలకు పంపించనున్నట్లు ప్రకటించింది. ఇలా విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే అభ్యర్థులు ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ అధికారిక వెబ్ సైట్ apssdc.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం ఐటిఐ పూర్తిచేసినా సరే... నెలకు రూ.2.60 నుండి రూ.2.70 లక్షల జీతంతో జర్మనీలో ఉద్యోగం పొందవచ్చు.

45
యువతకు ఉద్యోగాలే ఉద్యోగాలు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా రెండేళ్లు కూడా పూర్తికాలేదు... అప్పుడే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో 4,71,574 ఉద్యోగాలు ఇచ్చామని ఇటీవల సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో మెగా డిఎస్సి ద్వారా 15,941 ఉపాధ్యాయ, 6100 పోలీస్, ఇతర శాఖల్లో 9,093 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్లు తెలిపారు. భారీ పెట్టుబడులను ఆకర్షించి ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలను కల్పిస్తున్నామని సీఎం తెలిపారు.

తాజాగా మంత్రి నారా లోకేష్ కూడా నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 175 నియోజకవర్గాల్లో 406 జాబ్ మేళాలు నిర్వహించినట్లు... ఇందులో పాల్గొని 78వేలమంది యువతకు ఉద్యోగాలను పొందినట్లు లోకేష్ వెల్లడించారు. ఈ జాబ్ మేళాల్లో మరిన్ని సంస్థలను భాగస్వాములను చేయాలని.. యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించేలా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

55
యువత కోసం కూటమి ప్రభుత్వం ఏం చేస్తోంది..?

ఏపీ యువతకు బ్లూకాలర్ ఉద్యోగావకాశాల కోసం 30 ఇండస్ట్రీ ఎలైడ్ కోర్సులను ప్రవేశపెట్టినట్లు స్కిల్ డెవలప్మెంట్ అధికారులు మంత్రి లోకేష్ కు తెలిపారు. అలాగే 12 మోడల్ కెరీర్ సెంటర్ల ద్వారా 1,22,575 మందికి శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని 5 క్లస్టర్ల పరిధిలోని 16 సెక్టార్లలో 273 పారిశ్రామిక సంస్థలతో ఐటిఐ, పాలిటెక్నిక్ లను అనుసంధానం చేసినట్లు చెప్పారు. ల్యాబ్ స్పాన్సర్ షిప్ కోసం 17పరిశ్రమలు ముందుకు వచ్చాయని అన్నారు.

రాష్ట్రంలోని 16 ఇండస్ట్రియల్ క్లస్టర్ల పరిధిలో 16 పెద్ద సంస్థలను గుర్తించి పాలిటెక్నిక్, ఐటిఐలతో అనుసంధానించాలని మంత్రి అధికారులకు సూచించారు. రాష్ట్రస్థాయి న్యాక్ సెంటర్ ను మంగళగిరిలో ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్ పై ఐటిఐలలో 30, పాలిటెక్నిక్ కళాశాలలో 23 యాడ్ ఆన్ కోర్సులను ప్రవేశపెట్టామని అధికారులు మంత్రి లోకేష్ కు తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories