తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్ ... న్యూఇయర్ గిప్ట్ ప్రకటించిన ప్రభుత్వం, ఇక మీ డబ్బులు సేవ్..!

Published : Nov 06, 2025, 10:01 AM IST

Andhra Pradesh :  తెలుగు ప్రజలకు నెలనెలా కొంత డబ్బు సేవ్ అయ్యే  పథకాన్ని నూతన సంవత్సరం నుండి ప్రారంభించనుంది కూటమి ప్రభుత్వం. ఆ పథకం ఏంటి.. ఎంత డబ్బు సేవ్ అవుతుంది? 

PREV
15
ఏపీ ప్రజలకు ప్రభుత్వ కానుక

Andhra Pradesh : నిరుపేద, మద్యతరగతి ప్రజలకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే రేషన్ షాపుల్లో బియ్యంతో పాటు ఇతర నిత్యావసర సరుకులు అందిస్తున్న విషయం తెలిసిందే.. వీటి జాబితాలోకి మరో వస్తువును చేర్చింది. వచ్చే ఏడాది ఆరంభంనుండి అంటే జనవరి 2026 నుండి పట్టణప్రాంతాల్లోని రేషన్ షాపుల్లో గోధుమ పిండిని కూడా అందించనున్నట్లు పౌరసరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.

25
కిలో గోధుమపిండి కేవలం రూ.18 కే

ప్రస్తుతం మార్కెట్లో కిలో గోధుమ పిండి ధర రూ.50 రూపాయల వరకు ఉంది. దీంతో సామాన్య ప్రజలు దీన్ని కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. ఆరోగ్యకరమైన జీవితానికి గోధుమలు చాలా కీలకమైనవి.. అందుకే తక్కువ ధరకే గోదుమపిండి ప్రతి కుటుంబానికి అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ షాపుల ద్వారా వచ్చేఏడాది నుండి కిలో గోధుమ పిండి రూ.18 కే అందించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. అంటే మార్కెట్ ధర కంటే దాదాపు రూ.30 తక్కువకే గోధుమపిండి అందించనున్నారన్నమాట. తద్వారా ప్రజల డబ్బులు ఆదా అవడమే కాదు పోషకాహారం అంది ఆరోగ్యంగా ఉంటారు.

35
ఉచిత టార్పాలిన్ల పంపిణీ

రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణ ప్రారంభించినట్లు మంత్రి నాదెండ్ల తెలిపారు. నవంబర్ 3 నుండి ధాన్యం సేకరణ కేంద్రాలు కొనుగోలు ప్రారంభించాయని... రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. గత సీజన్ ఎదురైన అనుభవంతో ఈసారి ఆరు కోట్ల గోనే సంచులను సిద్దం చేసినట్లు తెలిపారు.

నవంబర్ లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో ముందుగానే అప్రమత్తం అయ్యామని... రైతుల కోసం టార్పాలిన్లు సిద్దం చేశామని మంత్రి తెలిపారు. అవసరం అయితే ఉచితంగానే రైతులకు 50 వేల టార్పాలిన్లు అందించడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు. రైతులు కష్టపడి పండించిన ధాన్యం వర్షాల కారణంగా దెబ్బతినకుండా సేవా కేంద్రాల ద్వారా ఈ టార్పాలిన్లు అందించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

45
రైతుల కోసం వాట్సాప్ నెంబర్

మరింత సులభంగా రైతులు ధాన్యం అమ్మేందుకు వాట్సాఫ్ నెంబర్ ఏర్పాటుచేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 7337359375 నెంబర్ కు రైతులు హాయ్ అని మెసేజ్ పంపితేచాలు... రిజిస్ట్రేషన్ జరిగిపోతుందని తెలిపారు. తర్వాత రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించవచ్చని తెలిపారు. ధాన్యం అమ్మిన గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని... గతంలో మాదిరిగా ఆలస్యం ఉండదన్నారు.

మొత్తంగా ఖరీఫ్ సీజన్లో పండిన ధాన్యం సేకరణకు రాష్ట్రవ్యాప్తంగా 3,013 రైతు సేవా కేంద్రాలు, 2,061 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు మంత్రి వెల్లడించారు. 10,700 మంది సిబ్బందిని ఈ ధాన్యం కొనుగోలు కోసమే వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. ఈ సీజన్లో 51 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు కేంద్రం అనుమతి ఇచ్చిందని తెలిపారు. అయితే రాష్ట్రంలో 85 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నారు... కాబట్టి ధాన్య కొనుగోలు కోటాను పెంచాలని కేంద్రాన్ని కోరనుంది ప్రభుత్వం.

55
మొంథా తుపాను బాధితులకు ఉచిత రేషన్ పంపిణీ

ఇటీవల మొంథా తుపాను బీభత్సంతో తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు ఉచితంగా రేషన్ అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది... పునరావాస కేంద్రాల నుండి ఇళ్లకు వెళ్లిపోయే సమయంలో నిత్యావసర సరుకులు అందించారు. అలాగే తుపాను కారణంగా ఉపాదిలేకపోవడంతో ఇబ్బంది పడుతున్న మత్స్యకారులకు కూడా సరుకులు అందించారు. ఇలా మొత్తం 2.39,169 కుటుంబాలకు పౌరసరఫరా శాఖ నిత్యావసర సరుకులు అందించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

తుపాను ప్రభావం ఉన్న ప్రాంతాల్లోని 14,415 రేషన్ షాపుల్లో 1 లక్ష మెట్రిక్ టన్నుల బియ్యం, 3424 మెట్రిక్ టన్నుల పంచదారతోపాటు ఇతర నిత్యావసరాలను పంపిణీకి ముందుగానే సిద్ధంగా ఉంచామని... తుపాను తీవ్రత తగ్గగానే పంపిణీ ప్రారంభించామన్నారు. తుపాను బాధిత సామాన్య ప్రజలకు 25 కేజీలు, ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు, చేనేత కార్మికులకు 50 కేజీల చొప్పున బియ్యం, కందిపప్పు కేజీ, పామాయిల్ ఒక లీటర్, ఉల్లిపాయలు కేజీ, బంగాళాదుంపలు కేజీ, పంచదార కేజీ చొప్పున అందించింది కూటమి ప్రభుత్వం. అలాగే మొంథా తుపానుతో నష్టపోయిన కుటుంబాలకు ఆర్థిక సాయం కూడా చేసింది కూటమి ప్రభుత్వం.

Read more Photos on
click me!

Recommended Stories