ఈఏపీసెట్ ర్యాంకుల ఆధారంగానే రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కళాశాలల్లో ప్రవేశ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఫలితాల విడుదల ఆలస్యం కావడంతో కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా వెనక్కి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు జులై 2న ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నప్పటికీ, అధికారిక ప్రకటన వచ్చే వరకు పూర్తి స్పష్టత లేదు. మరి జూలై 2న అయినా ఫలితాలు వస్తాయో చూడాలి.