నారా లోకేష్ శాఖలకు కేటాయింపులు...
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వారసుడు నారా లోకేష్ తెలుగుదేశం పార్టీలోనే కాదు కూటమి ప్రభుత్వంలోనే కీలక నాయకుడు. చెప్పాలంటే తండ్రి తర్వాత సెకండ్ ప్లేస్ అతడిదే. ఇప్పటికే అనేక సందర్భాల్లో ఈ విషయం బైటపడింది... తాజాగా బడ్జెట్ 2026 లోనూ ఇది స్పష్టంగా కనిపించింది.
లోకేష్ మానవ వనరుల అభివృద్ధి (విద్యాశాఖ),సమాచార సాంకేతికత (ఐటీ), ఎలక్ట్రానిక్స్ ఆండ్ కమ్యూనికేషన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ మంత్రిత్వ శాఖలు చూసుకుంటున్నారు. ఇందులో ఆయన విద్యాశాఖపై స్సెషల్ ఫోకస్ పెట్టారు.. ఈ క్రమంలోనే తాజా బడ్జెట్ లో పాఠశాల విద్యాశాఖకు ఏకంగా రూ.32,308 కోట్లు నిధులు దక్కాయి.
ఇక విద్యాశాఖకు సంబంధించిన పథకాలు, ప్రాజెక్టులకు ప్రత్యేక నిధులు కేటాయించింది కూటమి ప్రభుత్వం. విద్యాసంస్థల్లో మధ్యాహ్న భోజనానికి రూ.2161 కోట్లు, విద్యార్థుల ఉపకారవేతనాలకు రూ.3,836 కోట్లు, తల్లికి వందనం పథకానికి రూ.9,668 కోట్లు, నైపుణ్యాభివృద్ధి రూ. 1,232 కోట్లు కేటాయించారు. ఇలా విద్యాశాఖకు భారీగా నిధులు దక్కాయి.
హైదరాబాద్ కు పోటీగా రాష్ట్రంలో ఐటీ రంగాన్ని డెవలప్ చేయాలని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది. ఇందులో భాగంగానే విశాఖపట్నం, అమరావతి వంటి ప్రాంతాల్లో పెట్టుబుడులకు ముందుకువచ్చిన కంపెనీలకు రాయితీలు, ఇతర సౌకర్యాలు కల్పిస్తోంది. ఇందుకోసం ఐటీ శాఖకు నిధులు కేటాయించింది.