హైదరాబాద్ ఐఎండీ తెలిపిన ప్రకారం.. తెలంగాణలోని పలు జిల్లాల్లో గాలిలో తేమ పెరగడం వల్ల అక్కడక్కడ సాయంత్రం వేళల్లో చినుకులు పడవచ్చు. అదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో మధ్యాహ్నానికి మోస్తరు వానలు పడే అవకాశం ఉంది.
నారాయణపేట, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో సాయంత్రానికి వర్షాలు కురుస్తాయి. రాజధాని హైదరాబాద్‌లో సాయంత్రం లేదా రాత్రి వేళల్లో తేలికపాటి నుండి మోస్తరు జల్లులు పడే ఛాన్స్ ఉంది.
ఇక ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఈరోజు, రేపు గంటకు 40-50 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తూ అక్కడక్కడ తేలికపాటి వానలు పడే వీలుంది.