పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ డబ్బులు జమ కావాలంటే ఇ-కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. రైతులు ఈ ప్రాసెస్ ని మూడు రకాలుగా పూర్తి చేసుకోవచ్చు..
• ఆధార్ OTP విధానం: పీఎం కిసాన్ అధికారిక పోర్టల్ (pmkisan.gov.in) కు వెళ్లి, 'Farmers Corner' లో ఉన్న 'e-KYC' ఆప్షన్ ఎంచుకోవాలి. ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, లింక్ అయిన మొబైల్‌కు వచ్చే OTP సబ్మిట్ చేస్తే ప్రక్రియ పూర్తవుతుంది.
• ఫేస్ స్కాన్ : స్మార్ట్‌ఫోన్‌లో 'PMKISAN GoI' యాప్ డౌన్‌లోడ్ చేసుకుని, ముఖ గుర్తింపు ద్వారా వేగంగా ఇ-కేవైసీ చేయవచ్చు.
• సీఎస్‌సీ/మీసేవా కేంద్రాలు: ఫోన్ నంబర్ ఆధార్‌తో లింక్ లేనివారు దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా మీసేవా కేంద్రానికి వెళ్లి బయోమెట్రిక్ ద్వారా స్వల్ప రుసుముతో కేవైసీ పూర్తి చేసుకోవచ్చు.
అలాగే ఏపీ రైతులు తమ బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ కాకపోతే, తమ 1బీ, ఆధార్, ఫోన్ నంబరుతో గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సంప్రదించి విఆర్ఓ, తహసీల్దార్ల ఆమోదంతో ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.