వర్షాలే వర్షాలు...
Rain Alert : దేశ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలపై వాతావరణ శాఖ బిగ్ అప్ డేట్ ఇచ్చింది. ఈ ఏడాది రుతుపవనాలు జూన్ 1నే కేరళ తీరాన్ని తాకనున్నాయని అంచనా వేస్తోంది భారత వాతావరణ శాఖ (IMD). మే 20 నాటికి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులకు చేరుకుంటాయని తెలిపింది.
కొన్ని అంతర్జాతీయ వాతావరణ ఏజెన్సీలు రుతుపవనాలు కాస్త ముందుగానే రావొచ్చని అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో కురుస్తున్న వేసవి జల్లులు, ఉరుములు కూడా రుతుపవనాలు సరైన సమయానికే వస్తున్నాయనడానికి సంకేతాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడులో కురుస్తున్నవి రుతుపవనాలకు ముందు సంభవించే ఉరుములతో కూడిన వర్షాలు (pre-monsoon thunderstorms). మరోవైపు, ఆస్ట్రేలియాలో వర్షాకాలం ముగిసి, వేసవి మొదలవ్వడం భారత ఉపఖండానికి అనుకూలంగా మారింది. ఆస్ట్రేలియాలో పొడి వాతావరణం ఉండటం వల్ల, అక్కడి నుంచి భారత ఉపఖండం వైపు తేమ గాలులు వీచేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఆస్ట్రేలియా వాతావరణ కేంద్రం (Bureau of Meteorology) కూడా అక్కడ వర్షాకాలం ముగిసినట్లు అధికారికంగా ప్రకటించింది.
ఆస్ట్రేలియాలో వర్షాలు ఆగిపోవడంతో, 'అదృశ్య మేఘాల వలయం' (Invisible Belt) సముద్రం నుంచి తేమ గాలులను దక్షిణాసియా వైపునకు తీసుకొస్తుంది. ప్రస్తుతం ఈ వలయం భూమధ్యరేఖను దాటి మాల్దీవుల సమీపానికి చేరుకుందని… రాబోయే రోజుల్లో శ్రీలంక, అండమాన్ వైపు కదులుతుందని అంచనా వేస్తున్నారు.