ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ తీరం, పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి తోడు తమిళనాడు మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ఒక ద్రోణి విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, పలుచోట్ల వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
శనివారం (మార్చి 21) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఆదివారం కూడా ఉత్తర కోస్తా జిల్లాల్లో వర్షాల తీవ్రత కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు.