ప్రముఖ పునరుత్పాదక ఇంధన సంస్థ ReNew Power ఆంధ్రప్రదేశ్‌లో రూ. 82,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టబోతోంది. ఈ ప్రాజెక్ట్‌లో సోలార్ ప్యానెల్ తయారీ, వాఫర్ ఉత్పత్తి, గ్రీన్ హైడ్రోజన్ తయారీ, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు ఉంటాయి. ఈ విషయమై మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. “ఐదు సంవత్సరాల తర్వాత ReNew Power మళ్లీ ఆంధ్రప్రదేశ్‌లోకి వస్తోంది. ఇది రాష్ట్రానికి పెద్ద గర్వకారణం” అని రాసుకొచ్చారు.
24
విశాఖలో మరో డేటా సెంటర్
ఇప్పటికే గూగుల్ విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు సిద్ధమైన విషయం తెలిసిందే. కాగా తాజాగా మరో సంస్థ సైతం డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. అమెరికాకు చెందిన టిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్ (Tillman Global Holdings) సంస్థ విశాఖపట్నంలో రూ. 15,000 కోట్లతో డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఢిల్లీలో జరిగిన యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పాట్నర్‌షిప్ ఫోరమ్‌లో సంతకం చేశారు.
34
భారీగా ఉద్యోగాలు
ఈ పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఉద్యోగాలు రానున్నాయి. ఈ డేటా సెంటర్ ద్వారా 200 నుంచి 300 ప్రత్యక్ష ఉద్యోగాలు, అలాగే 800 నుంచి 1,000 పరోక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే రెన్యూ పవర్ పెట్టుబడితో కకూడా వేల సంఖ్యలో టెక్నికల్, ఇంజినీరింగ్ ఉద్యోగాలు రానున్నాయి.
ఇదిలా ఉంటే రెన్యూ పవర్ ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌లో ఎమ్ఓయూపై సంతకం చేయనున్నారు. ఈ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్‌ను పునరుత్పాదక ఇంధన రంగంలో దేశానికి కేంద్రంగా మార్చనున్నాయి అని మంత్రి లోకేష్ చెప్పుకొచ్చారు.