ప్రభుత్వరంగ బ్యాంకులో ఉద్యోగాలు, సొంత రాష్ట్రంలో పోస్టింగ్.. తెలంగాణ, ఏపీ యువతకు లక్కీ ఛాన్స్

Published : Nov 12, 2025, 06:06 PM IST

Bank of Baroda Recruitment 2025 : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుసా?

PREV
18
బ్యాంక్ ఆఫ్ బరోడా జాబ్స్

Bank Jobs : బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ప్రత్యేకంగా సన్నద్దమయ్యే తెలుగు యువతకు సూపర్ ఛాన్స్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలయ్యింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అప్రెంటిస్ గా శిక్షణ పొందితే మంచి అవకాశాలను పొందవచ్చు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఖాళీలు ఉన్నాయి... ఇలా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఉద్యోగాలున్నాయి. కాబట్టి వెంటనే నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలను దరఖాస్తు చేసుకోవచ్చు.

28
రాష్ట్రాలవారిగా ఖాళీలు

బ్యాంక్ ఆఫ్ బరోడా తెలంగాణలో 158, ఆంధ్ర ప్రదేశ్ లో 38 పోస్టులకు అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఇక కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్‌, వెస్ట్ బెంగాల్, పంజాబ్,డిల్లీలలో అత్యధికంగా ఖాళీలున్నాయి. ఇతర రాష్ట్రాల్లో కూడా అప్రెంటిస్ ఖాళీలున్నాయి.

38
ముఖ్యమైన తేదీలు

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 11 నవంబర్ 2025

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ : 01 డిసెంబర్ 2025

48
దరఖాస్తు విధానం

దరఖాస్తు పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చేయాలి. బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్ సైట్ bankofbaroda.bank.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

అప్లికేషన్ ఫీజు :

జనరల్ / ఓబిసి/ ఈడబ్ల్యుఎస్ – రూ.800

ఎస్సి/ ఎస్టి/ వికలాంగులు – ఫీజు లేదు (No Fee)

58
వయోపరిమితి

బ్యాంక్ ఆఫ్ బరోడాలో అప్రెంటిస్ గా చేరాలంటే కనీసం 20 సంవత్సరాల వయసు నిండివుండాలి. గరిష్టంగా 28 సంవత్సరాలలోపు ఉండాలి (01.11.2025 నాటికి) ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది:

ఎస్సి/ఎస్టి – 5 సంవత్సరాలు

ఓబిసి – 3 సంవత్సరాలు

వికలాంగులు – 10 సంవత్సరాలు

68
విద్యార్హతలు, ఎంపిక విధానం

గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ పొంది ఉండాలి. దరఖాస్తు చేసే రాష్ట్రంలో స్థానిక భాష తెలిసి ఉండటం అవసరం.

ఎంపిక విధానం :

ఆన్‌లైన్ రాత పరీక్ష

సర్టిఫికేట్ వెరిఫికేషన్

స్థానిక భాషా పరీక్ష

78
సాలరీ

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.15,000/- వరకు శిక్షణ స్టైఫండ్ (Stipend) చెల్లిస్తారు. ఇది కాంట్రాక్ట్ ఆధారిత శిక్షణ ఉద్యోగం.

88
బ్యాంకు ఆఫ్ బరోడా ఉద్యోగాల ప్రత్యేకతలు

గ్రాడ్యుయేట్లకు బ్యాంకింగ్ రంగంలో అనుభవం సంపాదించడానికి గొప్ప అవకాశం. తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారత రాష్ట్రాల్లో ఎక్కువ ఖాళీలున్నాయి. సాధారణ డిగ్రీ ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.పని అనుభవంతో బ్యాంకింగ్ రంగంలో స్థిరమైన కెరీర్ అవకాశాన్ని సృష్టించుకునే అవకాశమిది. బ్యాంకింగ్ రంగంపై ఆసక్తి ఉన్న యువతకు, గ్రాడ్యుయేట్లకు ఇది ఒక సూపర్ ఛాన్స్! అర్హత ఉన్నవారు ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు చేసుకోండి.

Read more Photos on
click me!

Recommended Stories