Andhra Pradesh Holidays : ఈవారం లాంగ్ వీకెండ్.. శుక్ర, శని, ఆది మూడ్రోజులు సెలవులే..?

Published : Sep 02, 2025, 12:00 PM IST

ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులు, ఉద్యోగులకు ఈ వారాంతంలో వరుస సెలవులు వస్తున్నాయి. ఏరోజు ఎందుకు సెలవు ఉందో ఇక్కడ తెలుసుకుందాం.  

PREV
15
ఈ వారాంతంలో సెలవులే సెలవులు

Andhra Pradesh Holidays : తెలుగు ప్రజలకు ఈ వీకెండ్ కాస్త లాంగ్ వీకెండ్ గా మారేలా కనిపిస్తోంది. మరో రెండ్రోజులే స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు పూర్తిగా నడిచేది... తర్వాత మూడ్రోజులు సెలవులు వస్తున్నాయి. హైదరాబాద్ తో పాటు చుట్టపక్కల జిల్లాల్లో ఈ సెలవులు ఖాయంగా కనిపిస్తున్నాయి... ఏపీలో మాత్రం రెండ్రోజుల సెలవులు ఖాయం... ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అయితే కొన్ని ప్రాంతాల్లో విద్యార్థులు, ఉద్యోగులకు మూడ్రోజులు సెలవులుండే అవకాశం ఉంది... ఏరోజు ఎందుకు సెలవులున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

DID YOU KNOW ?
తెలంగాణలో నిమజ్జనం సెలవు
తెలంగాణ రాజధాని హైదరాబాద్ తో పాటు మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రతిసారి సెలవు ఉంటుంది. ఇలా ఈసారి కూడా ఉండే అవకాశాలున్నాయి.
25
ఈ శుక్రవారం సెలవే.. ఎందుకో తెలుసా?

సెప్టెంబర్ 5 అంటే ఈ శుక్రవారం ముస్లింల పండగ ఈద్ మిలాదున్ నబి ఉంది. ముస్లింల ఆరాధ్యదైవం మహ్మద్ ప్రవక్త పుట్టినరోజును ఇలా మిలాదున్ నబీగా జరుపుకుంటారు. ఈరోజు ఎంతో భక్తిశ్రద్దలతో సామూహిక ప్రార్థనలు నిర్వహిస్తారు... రకరకాల వంటకాలతో కుటుంబసభ్యులంతా విందు జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ముస్లింలు అధికంగా ఉంటారు.. కాబట్టి వీరి సౌకర్యార్థం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ 5న అధికారిక సెలవుగా ప్రకటించింది. తెలంగాణలో కూడా ఈరోజు సెలవు ఉంది.

35
ఈ శనివారం ఏపీలో సెలవు ఉంటుందా?

వినాయక చవితిరోజున బొజ్జ గణపయ్య విగ్రహాలను ప్రతిష్టించి కొందరు 5, మరికొందరు 7, 9 రోజులు పూజలుచేసి నిమజ్జనం చేస్తారు. అయితే ఎక్కువమంది మాత్రం 11 రోజులకు నిమజ్జనం చేస్తారు... ఇలా చూసుకుంటే ఈనెల 6న అంటే శనివారం రాష్ట్రవ్యాప్తంగా వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరగనున్నాయి. అయితే వినాయక నిమజ్జనానికి ఏపీ ప్రభుత్వం గతంలో ఎన్నడూ సెలవు ప్రకటించలేదు... కానీ ఈసారి సెలవు ప్రకటించాలని కొన్ని హిందుత్వ సంస్థలు, వినాయక మండపాల నిర్వహకులు, విద్యార్థుల పేరెంట్స్ కోరుతున్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే మాత్రం ఈసారి ఏపీలో కూడా వినాయక నిమజ్జనం సెలవు ఉంటుంది.

ప్రభుత్వం సెలవు ఇవ్వకున్నా విశాఖపట్నం వంటి నగరంలో ఐటీ, కార్పోరేట్ ఉద్యోగులకు సాధారణంగా ప్రతి శనివారం సెలవు ఉంటుంది. ఇక కొన్ని కార్యాలయాలు, స్కూల్స్, కాలేజీల్లో వినాయకున్ని ప్రతిష్టించారు.. ఇలాంటి విద్యాసంస్ధలు, ఆఫీసులకు నిమజ్జనం రోజు స్వచ్చందంగా సెలవు ఇచ్చే అవకాశాలుంటాయి. కాబట్టి అందరికి కాదుగానీ కొందరు ఉద్యోగులు, విద్యార్ధులకు ఈ శనివారం కూడా సెలవు ఉంటుంది.

45
సెప్టెంబర్ 7 ఎలాగూ సెలవే..

సెప్టెంబర్ 7 ఆదివారం...కాబట్టి ఎలాగూ సాధారణ సెలవే. ఇలా ఈవారం వరుసగా మూడ్రోజులు సెలవులు వస్తున్నాయి... అవీ వీకెండ్ తో కలిసి రావడంతో లాంగ్ వీకెండ్ గా మారింది. ఈ సెలవుల్లో యువత వినాయక నిమజ్జన వేడుకల్లో ఎంజాయ్ చేయడం ఖాయం.. గణపయ్య ఊరేగింపులో పాల్గొని డ్యాన్సులతో లేదా ఇతర కార్యక్రమాల్లో సందడి చేస్తారు. ఇలా నిమజ్జనంలో అలసిపోయినా ఆదివారం సెలవే కాబట్టి విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంటుంది.

55
ఆంధ్ర ప్రదేశ్ లో దసరా సెలవులు ఎన్నిరోజులు?

ఈ నెలలో (సెప్టెంబర్) ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులకు భారీ సెలవులు వస్తున్నాయి. ఆరంభంలో అడపాదడపా సెలవులు వచ్చినా చివర్లో మాత్రం వరుస సెలువులున్నాయి. దసరా పండగ నేపథ్యంలో ఇప్పటికే సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 3 వరకు సెలవులు ఇచ్చారు.. ఇలా మొత్తం 9 రోజులు సెలవులు ఇవ్వనున్నట్లు ఏపీ విద్యాశాఖ ప్రకటించింది. మొత్తంగా ఈ సెప్టెంబర్ లో ఏపీ విద్యార్థులకు దాదాపు రెండువారాలు సెలవులు వస్తున్నాయి... కేవలం రెండు వారాలు మాత్రమే స్కూళ్లు నడిచేది.

Read more Photos on
click me!

Recommended Stories