అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగానికి అన్ని అర్హతలు కలిగిన అభ్యర్థులు ఏపిపిఎస్సి అధికారిక వెబ్ సైట్ https://psc.ap.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలి... ఇతర ఏ పద్దతుల్లోనూ దరఖాస్తులు స్వీకరించబడవని నోటిఫికేషన్ లో స్పష్టంగా పేర్కొన్నారు.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 19 ఆగస్ట్ 2025
దరఖాస్తు చేసుకోడానికి చివరితేదీ : 08 సెప్టెంబర్ 2025, 11PM వరకు
అభ్యర్థులు ఏపిపిఎస్సి వెబ్ సైట్ లో ఇదివరకే వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (OTPR) చేసుకునివుంటే దీని ద్వారా ఈజీగా దరఖాస్తు చేసుకోవచ్చు. మొదటిసారి ఏపిపిఎస్సి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారు ముందుగా ఈ ఓటిపిఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు :
అభ్యర్థులు రూ.250 అప్లికేషన్ ఫీజు, 120 ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కేవలం ఆన్లైన్ పేమెంట్ అంటే నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.
ఎస్సి, ఎస్టి, బిసి, పిడబ్ల్యూడి అభ్యర్థులు కేవలం ఎగ్జామ్ ఫీజు 120 రూపాయలు మాత్రమే చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. వైట్ రేషన్ కార్డు కలిగిన ఫ్యామిలీకి చెందినవారు, ప్రభుత్వంచే గుర్తింపుపొందిన నిరుద్యోగులు, వికలాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్స్ కు దరఖాస్తు ఫీజు మినహాయింపు ఉంటుంది.