Success Story : ఆటోడ్రైవర్ కూతురు అనుకున్నది సాధించిందిగా.. మెగా డిఎస్సిలో టాప్ ర్యాంకు కొట్టింది.. టీచర్ జాబ్ పట్టింది

Published : Aug 29, 2025, 01:20 PM IST

ఓ సామాన్య ఆటోడ్రైవర్ కూతురు అనుకున్నది సాధించింది. ఆంధ్ర ప్రదేశ్ మెగా డిఎస్సిలో అత్యుత్తమ ర్యాంకు సాధించిన ఓ తెలుగమ్మాయి సక్సెస్ స్టోరీని ఇక్కడ తెలుసుకుందాం. 

PREV
15
అసలైన సక్సెస్ అంటే ఇది కదా

Andhra Pradesh Mega DSC : ''కృషి వుంటే మనుషులు రుషులవుతారు... మహాపురుషులవుతారు'' అన్న మాటలను నిజంచేసింది ఈ తెలుగమ్మాయి. పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చని నిరూపించింది. కుటుంబం అండగా ఉంటే అవహేళనలు, ఆర్ధిక కష్టాలు మనల్ని ఏమీ చేయలేవని... కలల్ని సాకారం చేసుకునేందుకు అడ్డురావని మరోసారి చాటిచెప్పింది. ఇలా ఓ ఆటో డ్రైవర్ కూతురు అనుకున్నది సాధించింది... ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి సర్కార్ నిర్వహించిన మెగా డిఎస్సిలో అత్యుత్తమ ర్యాంకు సాధించి టీచర్ జాబ్ పొందింది. ఆమె సక్సెస్ స్టోరీ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

25
గాదె మనీష వ్యక్తిగత జీవితం

ఆంధ్ర ప్రదేశ్ కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన గాదె మనీష అతి సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి ఆటో డ్రైవర్.. తల్లి ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి. ఈమెకు ఓ సోదరుడు ఉన్నాడు. ఇద్దరు పిల్లలను చదివించేందుకు, కుటుంబాన్ని పోషించుకునేందుకు తల్లిదండ్రులు రెక్కలుముక్కలు చేసుకునేవారు. తండ్రి రోజంతా ఆటో నడుపుతూ వచ్చిన చాలిచాలని ఆదాయంతో కుంటుంబాన్ని నెట్టుకువచ్చేవాడు... తల్లి అతడికి ఆసరాగా ఉండేందుకు ఉద్యోగం చేసింది. ఇలా కుటుంబకష్టాలు చూస్తూ పెరిగిన మనీష జీవితంలో ఏదైనా సాధించాలని చిన్నప్పుడే నిర్ణయించుకుంది.

ఎదిగే క్రమంలో మనీష తన లక్ష్యాన్ని నిర్దేశించుకుంది... చిన్నారులను తీర్చిదిద్దడంతో పాటు తన జీవితాన్ని మరింత మెరుగుపర్చుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని భావించింది. అందుకే ఆ దిశగానే చదువు సాగించింది. ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించేందుకు అన్ని అర్హతలు సాధించిన ఆమె ప్రిపరేషన్ ప్రారంభించింది. ఈ సమయంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నట్లు తాజా విజయం తర్వాత మనీష వెల్లడించింది.

35
ఆటో డ్రైవర్ కూతురి నుండి గవర్నమెంట్ టీచర్ వరకు..

చదువు పూర్తిచేసుకుని మనీష ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల నియామకాల కోసం చేపట్టే డిఎస్సి ఎగ్జామ్ కోసం ప్రిపరేషన్ ప్రారంభించింది. అయితే ఏళ్లు గడుస్తున్నా డిఎస్సి నోటిఫికేషన్ రాకపోవడంతో ఆమెలో అలజడి మొదలయ్యింది... కుటుంబంలో కూడా ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. దీంతో మనీష సోదరుడు జాబ్ చేస్తూ కొంతకాలం చదివించాడు. కానీ డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురుచూసి ఆ కుటుంబం విసిగిపోయింది.

తెలిసినవాళ్లు అమ్మాయికి ఈ ప్రిపరేషన్ ఎందుకు? ఏం సాధిస్తుంది? అని మనీష తల్లిదండ్రులను ఎగతాళి చేసేవారు... అయితే వాళ్ళు కూతురిపై నమ్మకంతో ఉన్నారు. కానీ ఆరు సంవత్సరాలు ఎలాంటి నోటిఫికేషన్ రాకపోవడంతో వాళ్లుకూడా విసిగిపోయారు... మంచి సంబంధం రావడంతో మనీషకు పెళ్ళిచేశారు. పెళ్లి తర్వాత కూడా భర్త సహకారంతో ప్రిపరేషన్ కొనసాగించింది... చివరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెగా డిఎస్సి వేసింది... ఇందులో ప్రతిభ చాటిన మనీష తన కలను నిజం చేసుకుంది... కుటుంబసభ్యులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టి వారు గర్వపడేలా చేసింది.

అవనిగడ్డకు చెందిన విద్యార్థులు ఎస్జిటిలో మంచి ర్యాంకులు సాధించారు.. వీరిలో మనీష ఒకరు. ఈమె 90.43 మార్కులతో జిల్లాలో కృష్ణా జిల్లాలో 12వ ర్యాంకు సాధించింది... టీచర్ జాబ్ ఖాయం చేసుకుంది. తన కల నెరవేరడంతో మనీష ఆనందానికి అవధులు లేవు... తన సక్సెస్ గురించి చెబుతూ ఆమె చాలా ఎమోషన్ అవుతున్నారు. ఒకప్పుడు ఎగతాళి చేసిన సమాజమే ఇప్పుడు 'శభాష్ మనీష... ఆడపిల్లంటే ఇలా ఉండాలి' అంటున్నారు.

45
తన సక్సెస్ పై మనీష కామెంట్స్...

తనకు ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేసేందుకు ఇంత తొందరగా అవకాశం వస్తుందని ఊహించలేదు... కూటమి అధికారంలోకి రాగానే డిఎస్సి నోటిషికేషన్ ఇచ్చి ఈ అవకాశం ఇచ్చారని మనీష పేర్కొన్నారు. ఇందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారామె. మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగం ఖాయమని నమ్మాను.. కానీ ఇంత మంచి ర్యాంకు సాధిస్తానని అనుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి తమ కుటుంబాల్లో సంతోషాలు నింపిందన్నారు.

జాబ్ కలగానే భావించాం... గత ఆరు సంవత్సరాల్లో డిఎస్సి వేస్తారో లేదోనని ఆందోళనతోనే ఉన్నామన్నారు మనీష. కానీ కూటమి అధికారంలోకి రాగానే, చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే మొదట 16,347 పోస్టులతో మెగా డిఎస్సి ఫైల్ పైన్ సంతకం పెట్టారు. ఇలా తమ కలను నెరవేర్చారన్నారు. ఇంత భారీగా పోస్టులు చూడగానే తనకు జాబ్ పక్కా అనిపించిందని... అనుకున్నట్లే మంచి ర్యాంకు సాధించానని మనీష వెల్లడించారు.

సీఎం చంద్రబాబు నాయుడు అన్నమాట నిలబెట్టుకున్నారు... ఇంత తొందరగా నియామక ప్రక్రియ జరగడం అసాధ్యం... కానీ ఆయన దాన్ని సాధ్యం చేశారన్నారు. డిఎస్సి నిర్వహణ ఎంతో లాంగ్ ప్రాసెస్ తో కూడుకున్నది... మధ్యలో అడ్డంగులు కూడా వచ్చినా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. ఇలా ఎట్టిపరిస్థితుల్లో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉందనేది దీన్నిబట్టే అర్థమవుతోందని మనీష పేర్కొన్నారు..

ఇంతపెద్ద అవకాశం ఎవ్వరూ ఇవ్వరు... తక్కువ పోస్టులిస్తే వస్తుందో రాదోనని భయపడేవారం.... కానీ చంద్రబాబు మెగా డిఎస్సి ఇచ్చారన్నారు మనీష. ఇలా పోస్టులు ఎక్కువగా ఉండటంతో ఉద్యోగం ఖాయమని నమ్మకంతో చదివాను... ఒత్తిడి లేకపోవడంతో అనుకున్నది సాధించానన్నారు. చంద్రబాబు అంటేనే ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ బాగుంటుంది... ఇప్పుడు మంత్రి నారా లోకేష్ తో కలిసి కొత్త ఉపాధ్యాయులమంతా స్కూల్స్ ని, విద్యార్థులను తీర్చిదిద్దుతామని డిఎస్సి విజేత గాదె మనీష తెలిపారు.

55
నేటి ఆడపిల్లకు ఈమె ఆదర్శం...

డిఎస్సి ర్యాంకర్ మనీష కుటుంబంలో ఇప్పటివరకు పెద్దగా చదువుకున్నవారు లేరు... తండ్రి ఆటోడ్రైవర్, తల్లి ప్రైవేట్ ఉద్యోగి కాబట్టి కెరీర్ ను గైడ్ చేసేవారు ఎవరూలేరు. కానీ మనీష సొంతగా తన కెరీర్ ను నిర్ణయించుకుంది... ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలని భావించిన ఆమె చివరకు డిఎస్సి ర్యాంకు సాధించింది.

తమ ఫ్యామిలీలోనే మొదటి ఆడపిల్ల టీచర్ జాబ్ సంపాదించడం... అంతేందుకు గవర్నమెంట్ జాబ్ కొట్టడం కూడా తమ కుటుంబంలో మొదటిసారి అంటూ మనీష గర్వంగా చెప్పుకుంటోంది. ఎంతోమంది ఆడపిల్ల ఏం జాబ్ కొడుతుందంటున్నా అమ్మానాన్న మాత్రం ప్రోత్సహించారు... సోదరుడు, భర్త నమ్మకం పెట్టుకున్నారు.. వీళ్లందరివల్లే తాను డిఎస్సి ర్యాంకు సాధించినట్లు గాదె మనీష తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories