Ambati Rambabu: అంబ‌టి రాంబాబుకు కూడా త‌ప్ప‌ని ట్రంప్ సెగ‌.. అస‌లేం జ‌రిగిందంటే.?

Published : Oct 04, 2025, 11:55 AM IST

Ambati Rambabu: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు ప్ర‌పంచాన్ని షాక్‌కి గురి చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణ‌యంపై వైసీపీ నేత అంబ‌టి రాంబాబుపై కూడా ప‌డింది. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే. 

PREV
15
అమెరికాలో అంబటి రాంబాబు కుటుంబానికి ప్రత్యేక వేడుక

వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబంలో ఆనందకర వేడుక జరిగింది. ఆయన కుమార్తె డాక్టర్ శ్రీజ వివాహం అమెరికాలోని ఇల్లినాయిస్ మహాలక్ష్మి ఆలయంలో సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌ హర్షతో ఘనంగా జరిగింది.

25
అమెరికాలో వైద్యురాలిగా

డాక్టర్ శ్రీజ ప్రస్తుతం ఇల్లినాయిస్ యూనివర్సిటీలో ఎండోక్రినాలజీ ఫెలోషిప్ చేస్తున్నారు. ఆమె విద్యార్హతలు, వైద్యరంగంలో మంచి విజ‌యాల‌ను ప్ర‌ద‌ర్శించారు. ఇక వ‌రుడు హర్ష అమెరికాలో డ్యూచ్ బ్యాంక్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. తన కెరీర్‌లో స్థిరంగా ముందుకు సాగుతున్నారు.

35
తెలుగు సంప్రదాయాలతో ఆలయంలో వివాహం

ఈ వివాహం పూర్తిగా తెలుగు సంప్రదాయ రీతిలో జరిగింది. మహాలక్ష్మి ఆలయ ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ వేడుకలో కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు. భారత్‌లో ఉన్న అనేక మంది మిత్రులు, అభిమానులు వర్చువల్‌గా శుభాకాంక్షలు తెలియజేశారు.

45
వీడియో విడుద‌ల

వివాహ వేడుకలో అంబటి రాంబాబు స్వయంగా అతిథులను ఆహ్వానించి, కార్యక్రమాలను పర్యవేక్షించారు. వివాహం అనంతరం కొత్త జంట అమెరికాలోనే తమ వృత్తి జీవితాన్ని కొనసాగించనున్నారు. కుటుంబ వర్గాల ప్రకారం, త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో ఒక గ్రాండ్ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేసే అవకాశమున్న‌ట్లు తెలుస్తోంది. అయితే వివాహ వేడుక‌కు సంబంధించిన వివ‌రాల‌ను పంచుకుంటూ అంబ‌టి రాంబాబు ఓ వీడియోను విడుద‌ల చేశారు. 

55
ధన్యవాదాలు తెలిపిన అంబటి

ఈ వీడియోలో పెళ్లి స‌జావుగా సాగ‌డానికి స‌హ‌క‌రించిన వారంద‌రికీ ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా అమెరికాలో వివాహం జ‌రిపేందుకు గ‌ల కార‌ణాన్ని కూడా చెప్పుకొచ్చారు. ట్రంప్ వ‌ల్లే ఇలా చేయాల్సి వ‌చ్చింద‌న్నారు. అమెరికా వ‌దిలి వెళ్తే మ‌ళ్లీ తిరిగి రాణిస్తాడో లేదో అన్న అనుమానాన్ని రాంబాబు వ్య‌క్తం చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories