Andhra pradesh: ఏపీలో కొత్త ప‌థ‌కం.. ఒక్కోక్క‌రి ఖాతాల్లోకి రూ. 15 వేలు జ‌మ చేయనున్న ప్ర‌భుత్వం.

Published : Oct 03, 2025, 04:03 PM IST

Andhra pradesh: ఆంధ్ర‌ప్రదేశ్ ప్ర‌భుత్వం కొత్త ప‌థ‌కాన్ని తీసుకొస్తోంది. ఆటో డ్రైవ‌ర్ సేవ‌లో పేరుతో శ‌నివారం ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్నారు. ఈ ప‌థ‌కానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
ఆటో డ్రైవర్ల కోసం కొత్త పథకం

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల జాబితాలో మరో కీలకమైన పథకాన్ని చేర్చబోతోంది. “ఆటో డ్రైవర్ సేవలో” అనే ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు నేరుగా ఆర్థిక సాయం అందించనున్నారు.

25
ఏడాదికి రూ.15 వేలు సహాయం

ఈ పథకం కింద అర్హులైన ప్రతి డ్రైవర్‌కు సంవత్సరానికి రూ.15 వేల చొప్పున ప్రభుత్వం అందించనుంది. గతంలో డ్రైవర్లకు రూ.10 వేలు మాత్రమే ఇచ్చినప్పటికీ, ఇప్పుడు దానికంటే 50 శాతం అధికంగా సాయం ఇవ్వడం విశేషం. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 2.90 లక్షల మందిని లబ్ధిదారులుగా గుర్తించారు. వీరికి రూ.436 కోట్ల నిధులు కేటాయించి నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు.

35
లబ్ధిదారుల విభజన

ఈ పథకం ద్వారా ఆటో డ్రైవర్లు ఎక్కువగా లబ్ధి పొందుతున్నారు. వారిలో ఆటో రిక్షా డ్రైవర్లు 2,25,621 మంది కాగా, మూడు చక్రాల ప్యాసింజర్ వాహనాల డ్రైవర్లు 38,576 మంది, మోటార్ క్యాబ్ డ్రైవర్లు 20,072 మంది, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు 6,400 మంది ఉన్నారు. విశాఖపట్నం జిల్లాలోనే అత్యధికంగా 22,955 మంది డ్రైవర్లకు ఈ ఆర్థిక సాయం చేరనుంది.

45
మేనిఫెస్టోలో లేకపోయినా..

డ్రైవర్లకు సంవత్సరానికి రూ.15 వేలు అందించే విషయం కూటమి మేనిఫెస్టోలో లేకపోయినా, ప్రభుత్వం స్వయంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. స్త్రీశక్తి బస్సు పథకం కారణంగా ఆటో డ్రైవర్లు ఎదుర్కొనే ఇబ్బందులను తగ్గించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా, రోడ్ల మరమ్మతులకు రూ.1,000 కోట్లు ఖర్చు చేసి వాహనదారులకు ఉపశమనం కలిగించారు. అలాగే పాత వాహనాలపై గతంలో రూ.20 వేలు వసూలు చేసిన గ్రీన్ ట్యాక్స్‌ను రూ.3 వేలకు తగ్గించారు.

55
గ్రీవెన్స్ పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ

ఈ పథకం అందరికీ సమానంగా చేరేందుకు ప్రభుత్వం ప్రత్యేక గ్రీవెన్స్ వ్యవస్థను రూపొందించింది. అర్హత ఉన్నప్పటికీ జాబితాలో పేరు లేకపోతే వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసుకునే అవకాశం కల్పించారు. అర్హులైన లబ్ధిదారులు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్‌లో చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Read more Photos on
click me!

Recommended Stories