బడ్జెట్ ఫ్రెండ్లీ నుండి అల్ట్రా లగ్జరీ వరకు.. టికెట్ ధరల వివరాలు
కార్డేలియా క్రూయిజ్‌లో మీరు ఎంచుకునే రూమ్ కేటగిరీని బట్టి టికెట్ ధరలు మారుతుంటాయి. నౌకలో మొత్తం 5 రకాల క్యాబిన్ కేటగిరీలు అందుబాటులో ఉన్నాయి.
• ఇంటీరియర్ క్యాబిన్: తక్కువ బడ్జెట్‌లో ప్రయాణించాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. సాధారణంగా ఒక వ్యక్తికి ప్రారంభ ధర రూ. 22,000 నుండి రూ. 25,000 వరకు ఉంటుంది.
• ఓషన్ వ్యూ క్యాబిన్: రూమ్ కిటికీలో నుంచే అంతులేని సముద్ర అందాలను వీక్షించవచ్చు.
• బాల్కనీ, సూట్ రూమ్స్: అత్యంత విలాసవంతమైన ప్రైవేట్ బాల్కనీ సౌకర్యంతో ఇవి ఉంటాయి. డిమాండ్‌ను బట్టి వీటి ధరలు రూ. 80,000 పైగా ఉంటాయి.
కార్డేలియా క్రూయిజ్ ప్రెసిడెంట్ అండ్ సీఈఓ జుర్గెన్ బైలోమ్ మాట్లాడుతూ.. విశాఖపట్నం కేవలం ఒక పర్యాటక ప్రాంతంగానే కాకుండా, క్రూయిజ్ ప్రయాణాలకు ఒక ప్రధాన కేంద్రంగా ఎదుగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ గ్రూప్స్‌కు ఈ జర్నీ ఒక మరువలేని జ్ఞాపకంగా నిలుస్తుంది. ఆసక్తి గలవారు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.