బరువు తగ్గాలనుకుంటున్నరా? అయితే రాత్రిళ్లు ఈ పనులు అస్సలు చేయకండి

By Shivaleela Rajamoni  |  First Published Nov 15, 2023, 3:41 PM IST

weight loss tips: బరువు తగ్గడం అంత సులువైన పనేం కాదు. ఈ ముచ్చట అందరికీ తెలుసు. రెగ్యులర్ గా వ్యాయామం చేస్తూ.. ఆరోగ్యకరమైన ఆహారాలను లిమిట్ లో తింటే నెమ్మదిగా బరువు తగ్గుతారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. బరువు తగ్గాలనుకునేవారు రాత్రిపూట కొన్ని పనులను చేయకుంటే సులువుగా బరువు తగ్గుతారు. 
 


weight loss tips: ప్రస్తుత కాలంలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. బరువు పెరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వంటి వివిధ కారణాల వల్ల బరువు పెరుగుతారు. బరువు తగ్గాలంటే మాత్రం కొన్ని పనులను ఖచ్చితంగా చేయాలి. అంటే ప్రతి రోజూ వ్యాయామం చేయాలి. హెవీగా తినకూడదు. బరువును పెంచే ఆహారాల జోలికి అసలే వెళ్లకూడదు. ఎన్నో ఆహారాలను, పానీయాలను తగ్గిస్తేనే మీరు బరువు తగ్గుతారు. బరువు తగ్గడానికి రాత్రిపూట ఎలాంటి పనులను చేయకూడదో తెలుసుకుందాం పదండి. 

టీ, కాఫీలు వద్దు

Latest Videos

ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పూటే కాదు రాత్రి తిన్న తర్వాత కూడా టీ, కాఫీలను తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ ఈ అలవాటు అస్సలు మంచిది కాదు. ఎందుకంటే వీటిలో ఉండే కెఫిన్ మీకు కంటెంట్ మీకు నిద్రలేకుండా చేస్తుంది. అలాగే వాటిలో ఉండే షుగర్ మీ బరువును పెంచుతుంది. కాకపోతే ఈ టీ, కాఫీలకు బదులుగా మీరు పుదీనా టీ ని తాగొచ్చు.  ఎందుకంటే ఇది మీ జీర్ణ ప్రక్రియను పెంచుతుంది. అలాగే కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. 

సింపుల్ డిన్నర్

బరువు తగ్గాలనుకుంటే మీరు రాత్రిపూట హెవీగా అలాగే మసాలా ఫుడ్ ను అసలే తినకూడదు. నైట్ టైం మీ డిన్నర్ సింపుల్ గా ఉండాలి. అప్పుడే మీరు బరువు తగ్గుతారు. రాత్రిపూట కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారాలను, ప్రాసెస్ చేసిన ఆహారాలను తినడం మానుకోండి. ఎందుకంటే ఇవి మీ బరువును మరింత పెంచుతాయి. 

సమయానికి తినడం

రాత్రి పూట లేట్ గా తినడం, లేట్ గా పడుకోవడం, ఉదయం లేట్ గా నిద్రలేవడం అస్సలు మంచి అలవాట్లు కావు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి. అందుకే మీరు వీలైనంత తొందరగా తినండి. అలాగే త్వరగా నిద్రపోవడం అలవాటు చేసుకోండి. అలాగే రాత్రిపూట హెవీగా తినకండి. అలాగే ఆలస్యంగా తినకండి. వీటివల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. ఇవన్నీ మీరు బరువు తగ్గకుండా చేస్తాయి. 

ఆల్కహాల్

మీరు రెగ్యులర్ గా మందుతున్నట్టైతే ఆ అలవాటును ఈ రోజు నుంచే మార్చుకోండి. అవును ఆల్కహాల్ మీ బరువును తగ్గకుండా చేస్తుంది. ముఖ్యంగా రాత్రిపూట మర్చిపోయి కూడా ఆల్కహాల్ ను తాగకండి. ఆల్కహాల్ మాత్రమే కాదు రాత్రిపూట అన్ని ఆల్కహాల్ పానీయాలకు దూరంగా ఉంటేనే మీరు బరువు తగ్గుతారు. 

స్నాక్స్

రాత్రిపూట స్నాక్స్ తినాలనిపిస్తే అనారోగ్యకరమైన ఆహారాలను తినకూడదు. మీకు స్నాక్స్ తినాలనిపిస్తే నట్స్, పాప్ కార్న్ వంటి ఆరోగ్యకరమైన వాటిని తినండి. వీటిని కూడా లిమిట్ లోనే తినాలి. రాత్రిపూట ఆరోగ్యాన్ని పాడు చేసే స్నాక్స్ ను తింటే మీరు బరువు తగ్గడం కష్టమవుతుంది.
 

click me!