ఈ అలవాట్లే పిల్లలకు డయాబెటీస్ వచ్చేలా చేస్తాయి.. తల్లిదండ్రులూ జర పైలం..

By Shivaleela Rajamoni  |  First Published Nov 14, 2023, 12:48 PM IST

world diabetes day 2023: పిల్లల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. కానీ కానీ కొన్నిసార్లు తల్లిదండ్రుల అలవాట్లు పిల్లలకు పెను ప్రమాదంగా మారుతాయి. అవును తల్లిందుడ్రుల అలవాట్ల వల్ల పిల్లలకు డయాబెటీస్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు చిల్డ్రన్స్ డే, వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా పిల్లల్లో టైప్ 2 డయాబెటిస్ రావడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 


world diabetes day 2023: ప్రస్తుతం ఇండియాలో ప్రతి ముగ్గురిలో ఒకరు షుగర్ వ్యాధితో బాధపడుతున్నట్టు సర్వేలు వెల్లడిస్తున్నాయి. పెద్దలే కాదు పిల్లలు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. తల్లిదండ్రులకున్న కొన్ని అలవాట్ల వల్ల కూడా పిల్లలకు మధుమేహం వచ్చే ప్రమాదం చాలా రెట్లు పెరుగుతోందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. కాగా ప్రతి ఏడాది నవంబర్ 14న ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా అసలు పిల్లలకు మధుమేహం రావడానికి కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

టైప్ 1 డయాబెటిస్ 

Latest Videos

పిల్లలకు వచ్చే డయాబెటీస్ ను జువెనైల్ డయాబెటిస్ లేదా టైప్ 1 డయాబెటిస్ అంటారు. ఇది స్వయం ప్రతిరక్షక ప్రతిచర్య. అంటే దీనిలో శరీరం పొరపాటుగా తనపై తానే దాడి చేసుకుంటుంది. ఈ ప్రతిచర్య ప్యాంక్రియాస్లోని ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలను నాశనం దెబ్బతీస్తుంది. వీటిని బీటా కణాలు అని పిలుస్తారు. ఇది టైప్ 1 డయాబెటిస్ కు దారితీస్తుంది. అయితే ఈ డయాబెటీస్ లక్షణాలు కనిపించడానికి నెలలు లేదా సంవత్సరాల సమయం పట్టొచ్చు. 

పిల్లల్లో టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం

టైప్ 1 డయాబెటిస్ ను ఇన్సులిన్-డిపెండెంట్ లేదా జువెనైల్ డయాబెటిస్ అని పిలిచేవారు. ఇది ఏ వయసులోనైనా రావొచ్చు. టైప్ 1 డయాబెటిస్ టైప్ 2 కంటే చాలా తక్కువగా వస్తుంది. టైప్ 1 డయాబెటిస్ 5-10% మందిలో సంభవిస్తుంది.

ఇప్పుడు పిల్లల్లో  కూడా టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం చాలా వరకు పెరుగుతోంది. రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసం తినడం, చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలను తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అలాగే ఈ డయాబెటీస్ కుటుంబ చరిత్ర ఉన్నవారికి కూడా ఇది వచ్చే అవకాశం ఉంది. 

తల్లిదండ్రుల ఈ అలవాట్లు కూడా పిల్లల్లో డయాబెటీస్ ప్రమాదాన్ని పెంచుతాయి

అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు 

ప్రస్తుత కాలంలో చాలా మంది తల్లిదండ్రులు అనారోగ్యకరమైన ఆహారాన్నే పిల్లలకు ఇస్తున్నారు. అంటే పిజ్జాలు, బర్గర్లు వంటి వాటిని ఎక్కువగా కొనిపెడుతుంటారు. కానీ వీటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తిన్న పిల్లలు ఊబకాయం బారిన పడటమే కాకుండా వారికి డయాబెటీస్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. మనం ఆరోగ్యకరమైనవిగా చెప్పుకునే అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాలు కూడా రక్తంలో చక్కెరను బాగా పెంచుతాయి. అలాగే ఇంట్లో వండిన ఆహారాన్ని ఎప్పుడు కావాల్సితే అప్పుడే వేడి చేసి తినే అలవాటు కూడా పిల్లలో బ్లడ్ షుగర్ ను పెంచే అవకాశం ఉంది. 

చక్కెర ఆహారాలు, పానీయాలు

ఎక్కువ చక్కెర, కృత్రిమ చక్కెరతో తయారుచేసిన ఆహారాలు, పానీయాలు పెద్దల ఆరోగ్యానికే కాదు పిల్లల ఆరోగ్యానికి కూడా ఎంతమాత్రం మంచివి కావు. కేకులు, పేస్ట్రీలు, సోడా, ప్యాకేజ్డ్ పండ్ల రసాలు, ఐస్డ్ టీ వంటివి పిల్లల ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీస్తాయి. చాలా మంది తల్లిందడ్రులు ఇలాంటి ఆహారాలను ఓకేసారి ఎక్కువగా కొని ఫ్రిజ్ లో పెడుతారు. పిల్లలు అడిగినప్పుడు వాటిని ఇస్తుంటారు. కానీ ఇవి పిల్లల బరువును పెంచడమే కాకుండా వారికి డయాబెటీస్ వచ్చేలా కూడా చేస్తాయి. 

స్క్రీన్ ముందు కూర్చోవడం 

మితిమీరిన గ్యాడ్జెట్ల వాడకం వల్ల పిల్లలు ఆటలకు దూరంగా ఉంటున్నారు. ఇదే పిల్లల ఆరోగ్యాన్ని ఎంతో ప్రభావితం చేస్తోంది. ఉద్యోగం చేసే తల్లిదండ్రులు వారి వర్క్ ను కంప్లీట్ చేసుకోవడానికి పిల్లలకు ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను ఇస్తుంటారు. ఇంకేముందు పిల్లలు ఆడుకోకుండా మొబైల్ లో మునిగిపోతారు. మీకు తెలుసా? శారీరక శ్రమ లేకుంటే పిల్లలలో టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం చాలా రెట్లు పెరుగుతుంది.
 

click me!