Weight Loss: సమ్మర్ లో ఈ ఒక్క డ్రింక్ తాగినా ఈజీగా బరువు తగ్గొచ్చు

Published : May 12, 2025, 06:56 PM IST
Weight Loss: సమ్మర్ లో ఈ ఒక్క డ్రింక్ తాగినా ఈజీగా బరువు తగ్గొచ్చు

సారాంశం

వేసవిలో దాహం తీర్చడంతో పాటు బరువు తగ్గించడంలో నిమ్మరసం, కాఫీతో చేసిన చల్లని పానీయం మ్యాజిక్ లా పనిచేస్తుంది. ఇంట్లోనే దొరికే పదార్థాలతో, నిమ్మరసం, కాఫీతో పాటు పుదీనా, అల్లం, తులసి గింజలు కలిపి తయారుచేసిన ఈ పానీయం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

వేసవిలో చల్లని పానీయం దొరికితే చాలు, అమృతంలా మనకు అనిపిస్తుంది . కానీ చక్కెర, రంగులు, ప్రిజర్వేటివ్స్ ఉన్న కోల్డ్ డ్రింక్స్ కంటే ఇంట్లో తయారుచేసుకునే చల్లని పానీయాలే మంచివి. అవి దాహం తీర్చడమే కాదు, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇప్పుడు మనం సమ్మర్ లో వేసవి తాపాన్ని తగ్గిస్తూ , మన ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు  బరువు తగ్గించడంలో కూడా సహాయపడే ఒక మ్యాజికల్ పానీయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఇంట్లోనే దొరికే పదార్థాలతో తయారుచేసుకోవచ్చు. పేరు లెమన్ కోల్డ్ కాఫీ. ఇంట్లోనే కేఫ్ లాంటి అనుభూతి కలుగుతుంది. మరి, ఆ డ్రింక్ ఎలా  తయారు చేయాలి? దాని వల్ల ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం...

ఎందుకు తాగాలి?

వేసవికి అనువైన ఈ పానీయంలో ప్రధాన పదార్థాలు నిమ్మరసం, కాఫీ. నిమ్మరసం పుల్లటి రుచి, కాఫీ చేదు రుచి కలిసి ఒక అద్భుతమైన రుచినిస్తాయి. ఈ పానీయం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, లివర్ లో కొవ్వు పేరుకుపోకుండా చూస్తుంది. నిమ్మరసం, కాఫీతో పాటు మరికొన్ని పదార్థాలు కలిపి ఈ చల్లని పానీయం తయారుచేసుకోవచ్చు.

కావలసినవి

2 టేబుల్ స్పూన్లు కాఫీ పొడి, 1 టేబుల్ స్పూను అల్లం ముద్ద, 4-5 పుదీనా ఆకులు, 1 నిమ్మకాయ, 1 టేబుల్ స్పూను సబ్జా గింజలు, 3-4 ఐస్ క్యూబ్స్, 500 ml నీళ్ళు

తయారీ విధానం

రాత్రి 500 ml నీళ్ళలో కాఫీ పొడి కలిపి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం లెమన్ కోల్డ్ కాఫీ తయారుచేసుకోవచ్చు. సబ్జా గింజలను కొన్ని గంటలు నీళ్ళలో నానబెట్టాలి. నిమ్మకాయను పలుచగా ముక్కలుగా కోయాలి. ఒక గ్లాసులో నిమ్మ ముక్కలు, పుదీనా ఆకులు, సబ్జా  గింజలు వేసి నలపాలి. ఒక జార్ లో నీళ్ళు పోసి, నిమ్మరసం, నిమ్మ ముక్కలు, పుదీనా ఆకులు, సబ్జా గింజలు వేయాలి. ఐస్ క్యూబ్స్ వేసి బాగా కలపాలి. చివరగా కాఫీ మిశ్రమాన్ని వడకట్టి జార్ లో పోసి కలపాలి. ఈ చల్లని పానీయం దాహం తీర్చడమే కాకుండా బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. రోజుకి ఒకసారి తాగినా చాలు. మంచి రిజల్ట్స్ చూస్తారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

పచ్చి బఠానీలు రోజూ తింటే ఏమౌతుంది?
ఇవి తింటే జుట్టు రాలిపోతుంది జాగ్రత్త..!