
ఉలవలు, బార్లీ గంజి:
ఉలవలు, బార్లీ కలిపి చేసే ఈ గంజిని రోజూ ఒక కప్పు తాగితే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి, పేరుకుపోయిన కొవ్వు కరిగి బరువు త్వరగా తగ్గడం మొదలవుతుంది. రోజూ ఉదయం అల్పాహారంగా కూడా ఈ గంజిని తాగవచ్చు. ఉలవలు, బార్లీ రెండూ శరీరాన్ని బలోపేతం చేస్తాయి. ఆరోగ్యకరమైన బరువు తగ్గడానికి దోహదపడతాయి.
కావాల్సినవి:
తయారీ విధానం:
బాణలిలో నూనె లేకుండా, ఉలవలను, బార్లీని విడివిడిగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిరియాలు, జీలకర్ర వేయించి, అన్నింటినీ మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.
బాణలిలో అర టీస్పూన్ నెయ్యి వేసి, అల్లం వెల్లుల్లి వేసి వేయించాలి. వాసన పోయేవరకు వేయించాక ఉల్లిపాయ వేసి వేయించాలి. ఉల్లిపాయ వేగాక క్యారెట్, బీన్స్ వేసి వేయించి తగినన్ని నీళ్ళు పోసి ఉప్పు వేసి మరిగించాలి. నీళ్ళు మరిగాక పొడి చేసి పెట్టుకున్న ఉలవాలు, బార్లీ, మిరియాలు, జీలకర్ర మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేసి గడ్డలు లేకుండా కలపాలి.
తర్వాత మంట తగ్గించి 10 నిమిషాలు మరిగించాలి. దించి కరివేపాకు, కొత్తిమీర చల్లితే రుచికరమైన ఉలవాలు, బార్లీ గంజి సిద్ధం. దీన్ని రెండు నెలలు తాగితే బరువు గణనీయంగా తగ్గడాన్ని మీరు స్వయంగా చూడవచ్చు.