చలికాలంలో జొన్న రొట్టె తింటే ఇంత మంచిదా?

By Shivaleela Rajamoni  |  First Published Dec 19, 2023, 11:41 AM IST

జొన్న రొట్టెలో మన శరీరానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలుంటాయి. కానీ చాలా మంది గోధుమ పిండి రోటీనే ఎక్కువగా తింటుంటారు. ఎందుకంటే దీన్ని తయారుచేయడం చాలా సులువు. తొందరగా అవుతుంది కూడా. కానీ గోధుమ రొట్టె కంటే జొన్న రొట్టెనే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతుంది. 
 


వారం నుంచి చలి తీవ్రత మరీ ఎక్కువైంది. చలికాలంలో ఆరోగ్యంగా పట్ల ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. మనం ఎన్నో రోగాల బారిన పడాల్సి వస్తదది. మీకు తెలుసా? చలికాలంలో మన జీర్ణవ్యవస్థ, రోగనిరోధక శక్తి బలహీనపడతాయి. దీనివల్ల ఎన్నో రోగాలు సోకుతాయి. ఈ సీజన్ లో మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మన రోజువారి ఆహారంలో ఎన్నో మార్పులు చేసుకోవాలంటారు ఆరోగ్య నిపుణులు. 

అయితే చాలా మంది గోధుమ రొట్టెలనే ఎక్కువగా తింటుంటారు. కానీ చలికాలంలో గోధుమ రొట్టెల కంటే జొన్నల రొట్టెలను తింటే ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. జొన్న రొట్టె తినడం వల్ల మన జీర్ణవ్యవస్థ బలంగా ఉంటుంది. అలాగే ఎన్నో వ్యాధుల ముప్పు తప్పుతుంది. చాలా మంది చలిలో చిరుధాన్యాలు, మొక్కజొన్న రొట్టెను తినడానికి ఇష్టపడతారు. మరి చలికాలంలో జొన్నరొట్టెను తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

Latest Videos

ఎన్నో వ్యాధుల నుంచి రక్షణ

జొన్నల్లో కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, ఐరన్, ప్రోటీన్, విటమిన్-బి, కాంప్లెక్స్ వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇలాంటి జొన్నలు మన శరీరాన్ని ఎన్నో వ్యాధుల నుంచి రక్షిస్తాయి.

జీర్ణవ్యవస్థ బలోపేతం 

జొన్నల్లో తగినంత మొత్తంలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది, ఇది మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. జొన్న రొట్టెలను తినడం వల్ల మలబద్దకం వంటి సమస్యలు తగ్గిపోతాయి. 

బరువు నియంత్రణ

జొన్న రొట్టెలను తింటే కూడా బరువు తగ్గుతారు. ఎలా అంటే ఈ రొట్టెలను తింటే కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. దీనివల్ల మీరు అతిగా తినలేరు. ఈ రొట్టెల్లో ఉండే ఫైబర్ కంటెంట్ కడుపు నిండుగా ఉంచి బరువును నియంత్రిస్తుంది. 

గుండె జబ్బుల నివారణ

జొన్నలు మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం మన గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే చలికాలంలో జొన్న రొట్టెను ఖచ్చితంగా తినండి.

రక్తంలో చక్కెర అదుపు

మధుమేహులకు జొన్న రొట్టెలు ఎంతో మేలు చేస్తాయి. మీకు తెలుసా? చలికాలంలో జొన్న రొట్టెను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అందుకే డయాబెటీస్ పేషెంట్లు చలికాలంలో జొన్న రొట్టెను తినాలి. 

ఎముకలు బలోపేతం 

జొన్న రొట్టె ఎముకల ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రొట్టెను తింటే మన ఎముకలు బలంగా4 ఉంటాయి. జొన్నల్లో ఉండే ప్రోటీన్.. కండరాలు, ఎముకలను బలోపేతం చేస్తుంది.
 

click me!