ఇడ్లీల కోసం ఏకంగా రూ.6 లక్షల ఖర్చు పెట్టిన కస్టమర్ .. దేశంలో సెకనుకు 2.5 బిర్యానీ ఆర్డర్లు , స్విగ్గీ రిపోర్ట్

By Siva Kodati  |  First Published Dec 14, 2023, 8:29 PM IST

 ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ఈ ఏడాది ప్రజల ఆహార అభిరుచులు, ప్రాధాన్యతలు, కోరికలు, భారతీయులు  ఏయే ఆహారాలను ఎక్కువగా ఆర్డర్ చేశారు వంటి ఆసక్తికరమైన విషయాలను  'Annual Trends Report: How India Swiggy'd 2023' పేరుతో వెల్లడించింది. 


మరికొద్దిరోజుల్లో 2023 కాలగర్భంలో కలిసిపోనుంది. సరికొత్త ఆశలతో కొత్త సంవత్సరంలోకి ప్రపంచం అడుగుపెట్టనుంది. గడిచిపోయిన ఏడాదిలో తీపి జ్ఞాపకాలు, సంతోషం, దు:ఖం, ఓటమి, గెలుపు , సాధించిన ప్రగతిని మనిషి మననం చేసుకుంటున్నాడు. అలాగే 2023లో మనలో ఎంతోమంది కొత్త కొత్త రుచులు ఆస్వాదించి వుంటారు. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ఈ ఏడాది ప్రజల ఆహార అభిరుచులు, ప్రాధాన్యతలు, కోరికలు, భారతీయులు  ఏయే ఆహారాలను ఎక్కువగా ఆర్డర్ చేశారు వంటి ఆసక్తికరమైన విషయాలను  'Annual Trends Report: How India Swiggy'd 2023' పేరుతో వెల్లడించింది. 

ఎవరు ఏం, ఎక్కడ ఆర్డర్ చేసారు :

Latest Videos

ముంబైలోని సందడిగా వున్న వీధుల నుంచి ఢిల్లీ నడిబొడ్డు వరకు భారతదేశంలోని ఆహార ప్రియులు ఆర్డర్లు ఇవ్వడంలో చురుగ్గా వున్నారని స్విగ్గీ తెలిపింది. దేశవ్యాప్తంగా స్విగ్గీ మెనూలో 6.6 మిలియన్లకు పైగా ప్రత్యేకమైన వంటకాలు అందుబాటులో వున్నాయి. కొందరు వినియోగదారులు "Swiggy" , "order" లలో శోధిస్తున్నప్పుడు వరుసగా 5028, 1682 సార్లు వారు వెతుకున్నది కనిపించలేదు. 

2023 ఆర్డరింగ్ స్టార్స్:

ముంబైలోని ఓ వ్యక్తి 42.3 లక్షల రూపాయల విలువైన ఫుడ్ ఆర్డర్‌లను సంపాదించగలిగాడని స్విగ్గీ తెలిపింది. పెద్ద నగరాలు మాత్రమే కాదు.. ఝాన్సీ వంటి చిన్న పట్టణాలకు చెందిన వారు కూడా భారీగా ఆహారాన్ని ఆర్డర్ చేశాయి. ఓ వినియోగదారుడు పార్టీ కోసం ఒకేసారి 269 వస్తువులను ఆర్డర్ చేశాడట. 

ఎక్కువమంది ఆర్డర్ చేసిన వంటకాలు :

7.7 మిలియన్లకు పైగా ఆర్డర్‌లతో దుర్గాపూజ సందర్భంగా గులాబ్ జామూన్‌లు రసగుల్లాపై పైచేయి సాధించాయి. నవరాత్రులు జరిగిన మొత్తం 9 రోజులూ టాప్ వెజ్ ఆర్డర్‌గా మసాలా దోశ నిలిచింది. హైదరాబాద్‌లో ఒక కస్టమర్‌ ఇడ్లీ కోసం ఏకంగా 6 లక్షలు వెచ్చించాడు. సెకనుకు 2.5 బిర్యానీలు ఆర్డర్ చేయడంతో వరుసగా 8వ ఏడాది అత్యధికంగా ఆర్డర్ చేయబడిన వంటకంగా బిర్యానీ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుందని స్విగ్గీ తెలిపింది. 

'ది కేక్ క్యాపిటల్'గా ఆవిర్భవించిన నగరం:

చాక్లెట్ కేక్ కోసం 8.5 మిలియన్ల ఆర్డర్‌లతో బెంగళూరు 'కేక్ క్యాపిటల్' టైటిల్‌ను క్లెయిమ్ చేసింది. వాలెంటైన్స్ డే సందర్భంగా భారత్‌లో నిమిషానికి 271 కేక్‌లు ఆర్డర్ చేశారట. 

మార్కెట్‌లోకి కొత్తగా వచ్చిన వంటకాలు :

Swiggy గిల్ట్‌ఫ్రీలో శాకాహార ఆర్డర్‌లు 146% పెరగడంతో ఈ కేటగిరీలో వున్నవారు హర్షం వ్యక్తం చేశారు. జపనీస్ , కొరియన్ వంటకాల మధ్య జరిగిన యుద్ధంలో Anime విజయం సాధించింది. జపనీస్ వంటకాలు 2 రెట్లు ఎక్కువ ఆర్డర్‌లను స్కోర్ చేశాయి. 

డైనింగ్ అవుట్‌లు, సేవింగ్స్:

Swiggy One , One Lite వినియోగదారులు రూ.900 కోట్లకు పైగా సేవింగ్స్‌ను పొందారు. తర్వాత Swiggy Dineout వినియోగదారులు రూ.300 కోట్లను ఆదా చేశారు. ఇన్‌స్టామార్ట్ ఔత్సాహికులు 'ఇన్‌స్టా-పూర్' నుండి ఆర్డర్ చేసారు. జైపూర్‌లోని ఒక వినియోగదారు ఒకే రోజులో 67 ఆర్డర్‌లు చేయగా.. ఢిల్లీలో ఇన్‌స్టంట్ నూడుల్స్ డెలివరీకి కేవలం 65 సెకన్ల సమయం పట్టిందని స్విగ్గీ స్పష్టం చేసింది. 

2023కి వీడ్కోలు పలుకుతున్నప్పుడు ఈ గణాంకాలు భారతదేశవ్యాప్తంగా వైవిధ్యమైన రుచిని, దేశంలో నానాటికీ విస్తరిస్తున్న ఆహార సంస్కృతిని తెలియజేస్తున్నాయని స్విగ్గీ పేర్కొంది. 

click me!