మార్కెట్లో కల్తీ పనీర్.. మీరు కొన్న పనీర్ మంచిదో కాదో ఇలా గుర్తించండి

Published : Aug 21, 2025, 06:56 PM IST
Paneer

సారాంశం

మార్కెట్లో కల్తీ సరుకులు ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు పనీర్ ని కూడా కల్తీ చేస్తున్నారు. మీరు కొన్న పనీర్ మంచిదో కాదో తెలుసుకోవాలంటే ఇంట్లోనే ఈ సింపుల్ చిట్కాలను పాటించండి. 

వెజ్ ప్రియులకు పనీర్ తో చేసే వంటకాలు ఎంతో నచ్చుతాయి. నాన్ వెజ్ ప్రియులు కూడా పనీరు అధికంగానే తింటారు. ఎప్పుడైతే పనీర్ వాడకం పెరిగిందో అప్పుడు దాని మార్కెట్ కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ఎప్పుడైతే ఒక వస్తువు డిమాండ్ పెరిగిందో కల్తీ రాయుళ్లు... ఆ ఉత్పత్తులను కల్తీ చేయడం మొదలు పెడతారు. అలా ఇప్పుడు పనీర్ కూడా కల్తీ అయిపోయింది. మీరు కొన్న పనీర్ మంచిదో కాదో తెలుసుకునేందుకు ఇంట్లోనే కొన్ని చిట్కాలను పాటించవచ్చు. కల్తీ పనీర్ ను తింటే ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది.

నిజమేనా పనీర్ ఆకృతి రబ్బరులా సాగేలా ఉండదు. సులభంగా విరిగిపోతుంది. అదే కల్తీ పనీర్ అయితే గట్టిగా ఉండి రబ్బర్లా సాగేలా కనిపిస్తుంది. సులభంగా విరిగిపోదు. చూడ్డానికి అసాధారణంగా అనిపిస్తుంది.

వాసనను బట్టి

నిజమైన పనీర్ నుంచి తాజా పాలవాసనా వస్తూ ఉంటుంది. ఎలాంటి పుల్లటి వాసనలు లేదా ఇతర వాసనలు రావు. అదే కల్తీ పనీర్ అయితే ఒక రకమైన పుల్లని వాసన వచ్చే అవకాశం ఉంది. లేదా డిటర్జెంట్, సింథటిక్ పదార్థాల వాసన కూడా రావచ్చు. అలాంటి వాసన వస్తే మీరు కొన్న పనీర్ మంచిది కాదని అర్థం చేసుకోవాలి.

నీటి పరీక్ష

చిన్న పరీక్ష ద్వారా కూడా అసలైన పనీర్‌ను కనిపెట్టవచ్చు. ఇందుకోసం మీరు చిన్న పనీర్ ముక్కను తీసుకొని నీటిలో వేయండి. నీరు ఉన్న ఆ గిన్నెను స్టవ్ మీద పెట్టి పది నిమిషాలు మరిగించండి. మరిగించాక స్టవ్ ఆఫ్ చేసేయండి. అది మెత్తగా మరి నీటి రంగును ప్రభావితం చేయకపోతే అది నిజమైన పనీర్ అని అర్థం చేసుకోవాలి. అదే కల్తీ పనీర్ అయితే నీటిలో మరిగించాక గట్టిగా మారుతుంది. రబ్బరులా అనిపిస్తుంది. లేదా మరిగించిన ఆ నీరు తెలుపు రంగులోకి మారడం లేదా పసుపు రంగులోకి మారడం వంటివి జరుగుతాయి. అలాగే అడుగున పిండిలాంటి పదార్థం కూడా మిగిలిపోయే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఆ పనీర్ కల్తీదని అర్థం చేసుకోవాలి.

చిన్న శాస్త్ర పరీక్ష ఆధారంగా కూడా అసలైన పనీర్ ను తేల్చవచ్చు. చిన్న పనీర్ ముక్కను తీసుకొని దానిపై కొన్ని చుక్కల అయోడిన్ వేయండి. లేదా పసుపు ద్రావణాన్ని వేయండి. ఈ పరీక్షలో అయోడిన్ పసుపు రంగులోకి మారితూ అది నిజమైన పనీర్ అని అర్థం చేసుకోవాలి. అదే పనీర్ ఇతర పదార్థాలు కలిసి ఉంటే అది ఎరుపు లేదా నారింజ రంగులోకి మారిపోతుంది. అయోడిన్ వేస్తే నీళ్లు నలుపు రంగులోకి మారిపోతాయి. ఇది కల్తీ పనీర్ ను సూచిస్తుంది.

నిమ్మ రసంతో

నిమ్మకాయతో కూడా పనీర్ ను పరీక్షించవచ్చు. గోరువెచ్చని నీటిలో పనీర్ ముక్కను వేయండి. అందులో కొన్ని చుక్కల నిమ్మరసం కూడా వేసి కలపండి. పనీర్ కల్తీ లేనిది. అయితే అది కొద్దిగా కరిగి ఒక పాలవాసనను విడుదల చేస్తుంది. అలాగే ఆ నీరు కొద్దిగా మబ్బుగా మారుతుంది. అదే నకిలీ పనీర్ అయితే దాని నుంచి దుర్వాసన వస్తుంది. నీరు జిడ్డుగా మారిపోతుంది. ఈ పరీక్షలు ద్వారా మీరు పనీర్ కల్తీదో, నిజమైనదో తెలుసుకోవచ్చు

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇవి తింటే జుట్టు రాలిపోతుంది జాగ్రత్త..!
WeightLoss: నార్మల్ దోశ కాదు... ఓట్స్ దోశ తింటే ఏమౌతుంది? బరువు తగ్గుతారా?