ఫ్రిజ్ నుంచి చల్లటి నీరు తీసి తాగడం ప్రమాదమా? క్యాన్సర్ వస్తుందా? నిపుణులు ఏం చెబుతున్నారు?

Published : Aug 10, 2025, 05:30 PM IST
Food in Fridge

సారాంశం

చాలామంది ఫ్రిజ్ నీటికి అలవాటు పడిపోయారు. ఫ్రిజ్ లోంచి చల్లటి నీటిని తీసి నేరుగా తాగేస్తారు. ఇలా తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈమధ్య క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్న వాదన కూడా తెరపైకి వచ్చింది. ఇది నిజమో, కాదో తెలుసుకుందాం. 

ఇప్పుడు రిఫ్రిజిరేటర్ ప్రతి ఇంట్లోనూ కనిపిస్తుంది. అందులో కచ్చితంగా నీళ్లను పెడతారు. అది వేసవి అయినా, వర్షాకాలమైనా, శీతాకాలమైనా ఫ్రిజ్ లో మాత్రం నీరు ఉండాల్సిందే. ఆ నీటిని తాగే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. అయితే రిఫ్రిజిరేటర్ నుండి తీసిన నీరు నేరుగా తాగితే క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో ఎంతోమంది భయాందోళనలకు గురవుతున్నారు. ఇది ఎంతవరకు నిజమో నిపుణులు వివరిస్తున్నారు.

డయాక్సిన్ విడుదల

సోషల్ మీడియాలో చాలా పోస్టులు వైరల్ గా మారాయి. వాటి ప్రకారం రిఫ్రిజిరేటర్ నీటిని నేరుగా తాగకూడదు. అది చల్లటి ఆ క్యాన్సర్ కు కారణం అవుతుంది. దీని గురించి వైద్యులు వివరిస్తూ రిఫ్రిజిరేటర్లో నీటిని ప్లాస్టిక్ బాటిల్ లో వేసి ఉంచితే అది క్యాన్సర్ తో సంబంధం ఉన్న డయాక్సిన్ అనే సమ్మేళనాన్ని విడుదల చేస్తుంది. డయాక్సిన్ అధికంగా శరీరంలో చేరితే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ డయాక్సిన్ ఉష్ణోగ్రత 300 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉన్నప్పుడు మాత్రమే విడుదలవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువే

అదే ఉష్ణోగ్రత తక్కువగా ఉంటే డయాక్సిన్ చాలా తక్కువ విడుదలవుతుంది. కాబట్టి రిఫ్రిజిరేటర్ వాటర్ తాగడం వల్ల క్యాన్సర్ వస్తుందని ఏ అధ్యయనం నిర్ధారించలేదు. మీరు సురక్షితంగా రిఫ్రిజిరేటర్ నీటిని తాగాలనుకుంటే ప్లాస్టిక్ బాటిల్ లో ఆ నీటిని వేయకండి. స్టీలు లేదా గాజు సీసాలను వాడండి అదే మీకు సురక్షితం.

బంగాళాదుంపలు వద్దు

అలాగే ఫ్రిజ్ లో బంగాళదుంపలను కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు. బంగాళదుంపలను ఇతర కూరగాయలతో ఉంచి కలిపి ఉంచితే అది హానికరమైన సమ్మేళనాలకు కారణం అవుతుంది. బంగాళాదుంపల్ని ఫ్రిజ్లో పెడితే ఆక్రిలమైడ్ అనే సమ్మేళనం ఏర్పడుతుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో హానికరం. అలాంటి బంగాళదుంపలను తినడం వల్ల ఆరోగ్య సమస్యలు అధికంగా వస్తాయి. అంటే ఫ్రిజ్ ఉష్ణోగ్రత 120 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉండాలి. ఉష్ణోగ్రత దీనికంటే తక్కువగా ఉన్నట్టు అనిపిస్తే మాత్రం బంగాళదుంపలను ఇతర కూరగాయలతో కలిపి ఫ్రిజ్ లో ఎప్పుడు పెట్టకండి.

నిజానికి బంగాళదుంపలు ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువ కాలం నిలవ ఉంటాయి. కాబట్టి మీరు బంగాళదుంపలను ఇతర కూరగాయలతో కలపకుండా అలాగే ఉల్లిపాయలతో కూడా కలపకుండా సెపరేట్ గా ఉంచాల్సిన అవసరం ఉంది.

ఫ్రొజెన్ ఫుడ్ ఇలా తినండి

అలాగే ఫ్రిజ్లో ఫ్రోజెన్ ఫుడ్ ఉండడం సహజం. అలాంటి ప్రోగ్రాం అధికంగా తినడం వల్ల కూడా క్యాన్సర్ వస్తుందని వైద్యులు వివరిస్తున్నారు. కానీ ఫ్రోజెన్ ఫుడ్ తినే వారి సంఖ్య మాత్రం అధికంగానే ఉంది. ఫ్రొజెన్ ఫుడ్ లో చక్కెర, ఉప్పు, పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇలాంటి ఆహారాన్ని ఎక్కువ కాలం పాటు తీసుకుంటే అది క్యాన్సర్ మాత్రమే కాదు ఇతర తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశాన్ని పెంచుతుంది. అలాగే అందులో ఉండే విటమిన్ సి, విటమిన్ బి వంటి పోషకాలు కూడా నాశనం అయ్యే అవకాశం ఉంది. తినాల్సిన పరిస్థితి ఏర్పడితే దానిపై నిమ్మకాయ రసాన్ని చల్లండి. లేదా పక్కన పెరుగు కూడా ఉంచుకొని దానితో కలిపి తినేందుకు ప్రయత్నించండి. దీనివల్ల పోషకాల లోపం రాకుండా ఉంటుంది. శరీరానికి కావలసిన పోషకాలు కూడా అందే అవకాశం ఉంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

పచ్చి బఠానీలు రోజూ తింటే ఏమౌతుంది?
ఇవి తింటే జుట్టు రాలిపోతుంది జాగ్రత్త..!