`వకీల్ సాబ్` ని వేణు శ్రీరామ్ డైరక్ట్ చెయ్యలేదా?

By Surya PrakashFirst Published Apr 20, 2020, 8:25 AM IST
Highlights

వేణు శ్రీరామ్ తొలి చిత్రం ఓ మై ఫ్రెండ్ డిజాస్టర్ కావటం, ఎమ్ సీ ఏ చిత్రం కేవలం నాని, సాయి పల్లవి కు ఉన్న క్రేజ్ తో ఆడటం జరిగింది. దాంతో వేణు శ్రీరామ్ ని అంత పెద్ద హీరో సినిమాకు ఎంపిక చేయటం ఏమిటని చాలా మంది సందేహపడ్డారు. అయితే ఇది రీమేక్ కాబట్టి కాబట్టి ధైర్యం చేసి అప్పచెప్పాడన్నారు.


దాదాపు మూడేళ్ల  గ్యాప్ తర్వాత పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న చిత్రం `వకీల్ సాబ్`. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకుడు. ఈ సినిమాకు దర్శకుడుగా ఆయన్ను ఎంచుకోగానే మీడియాలోనూ ,అభిమానుల్లోనూ రకరకాల అభిప్రాయాలు వెల్లడయ్యాయి. ఆయన తొలిచిత్రం ఓ మై ఫ్రెండ్ డిజాస్టర్ కావటం, ఎమ్ సీ ఏ చిత్రం కేవలం నాని, సాయి పల్లవి కు ఉన్న క్రేజ్ తో ఆడటం జరిగింది. దాంతో వేణు శ్రీరామ్ ని అంత పెద్ద హీరో సినిమాకు ఎంపిక చేయటం ఏమిటని చాలా మంది సందేహపడ్డారు. అయితే ఇది రీమేక్ కాబట్టి పెద్దగా క్రియేటివిటీని ఖర్చుపెట్టాల్సన అవసరం ఉండదని ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరిగింది. ఏదైతైనేం వేణు శ్రీరామ్ సక్సెస్ ఫుల్ గా డైరక్టర్ గా ఈ సినిమా షెడ్యూల్స్ ఫినిషి చేసారు. అయితే ఇప్పుడు మరో వార్త మీడియాలో మొదలైంది. అదేమిటంటే..కేవలం వేణు శ్రీరామ్ డమ్మీ డైరక్టర్ గా ఈ సినిమాకు ఉండిపోయారని ఆ వార్త సారాంశం. 

వేణు శ్రీరామ్ డైరక్టర్ కాకపోతే మరెవరు ఈ సినిమాని డైరక్ట్ చేసారు..పవన్ కళ్యాణ్ కాదు..ఆయన ఇప్పుడు ఆ మూడ్ లో లేరు. మరెవరు అంటే పి.ఎస్ వినోద్ ఈ సినిమాకు షాడో డైరక్టర్ గా వ్యవహరించారంటున్నారు. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ ఆయన కావటంతో పూర్తి భాధ్యత వహించాడంటున్నారు. వేణు శ్రీరామ్ మానిటర్ దగ్గర కూర్చుని ఉండేవారని, పిఎస్ వినోద్ షాట్ చెప్పారని అంటున్నారు. దిల్ రాజు ఈ సినిమాని ఎలైగానా బ్లాక్ బస్టర్ చేయాలని జాను లా ఈ రీమేక్ ప్లాఫ్ కాకూడదని ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారట. అందులో భాగంగానే వినోద్ కు ప్రత్యేకంగా ప్రాజెక్టుని అన్ని రకాలుగా గైడ్ చేయమని చెప్పారట. అయితే ఇది కేవలం మీడియాలో పుట్టిన గ్యాసిపా లేక నిజమా అనేది తెలియాల్సి ఉంది. 

మరో ప్రక్కన పవన్ సరసన కనిపించబోయే హీరోయిన్ గురించి కొద్ది రోజులుగా రకరకాల గాసిప్‌లు వినిపించాయి. చివరికి శ్రుతీహాసన్‌ను ఫైనల్ చేశారని వార్త వచ్చింది. అయితే ఆ వార్తను ఇటీవల శ్రుతి ఖండించింది.  ఆ సినిమా కోసం తననెవరూ సంప్రదించలేదని చెప్పింది. అయితే దర్శకుడు వేణు శ్రీరామ్ మాత్రం...`హీరోయిన్‌గా శ్రుతినే తీసుకున్నాం. అయితే కరోనా కారణంగా అన్నీ తలకిందులయ్యాయి. డేట్ల సమస్య వస్తుందేమో` అని వేణు శ్రీరామ్ అన్నాడు. 
 

click me!