రచయిత వేధింపులపై ఆడియో క్లిప్.. అందులో ఏముందంటే..?

Published : Oct 16, 2018, 02:57 PM IST
రచయిత వేధింపులపై ఆడియో క్లిప్.. అందులో ఏముందంటే..?

సారాంశం

ప్రముఖ తమిళ రచయిత వైరముత్తుపై కొందరు మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. సింగర్ చిన్మయి తనతో పాటు వైరముత్తు మరెందరినో వేధించిన విషయాలను బయటపెట్టింది. తాజాగా సోషల్ మీడియాలో ఆమె ఓ ఆడియో క్లిప్ ని షేర్ చేసింది. 

ప్రముఖ తమిళ రచయిత వైరముత్తుపై కొందరు మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. సింగర్ చిన్మయి తనతో పాటు వైరముత్తు మరెందరినో వేధించిన విషయాలను బయటపెట్టింది.

తాజాగా సోషల్ మీడియాలో ఆమె ఓ ఆడియో క్లిప్ ని షేర్ చేసింది. అందులో ఒక మహిళ వైరముత్తుని విమర్శించింది. తనకు తెలిసిన ఒక అమ్మాయికి వైరముత్తు అంటే చాలా అభిమానమని, అతడి ఆటోగ్రాఫ్ కోసం ప్రయత్నించగా ఆయన వెంటనే ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ అడిగి తీసుకున్నాడని, తండ్రిలాగా భావించి ఆ అమ్మాయి నంబర్ ఇస్తే.. ఆరోజు రాత్రే వైరముత్తు ఆ అమ్మాయికి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడాడని, ఆ అమ్మాయిపై ఓ కవిత కూడా రాసి వినిపించాడని సదరు మహిళా వెల్లడించింది.

అంతేకాదు.. ఆ కవితలో రెండు లైన్లు కూడా వినిపించి ఈ కవిత మీది కాదా..? అంటూ వైరముత్తుని ప్రశ్నించింది. దమ్ముంటే ఈ విషయంపై వైరముత్తు చర్చకు రావాలని, సాక్ష్యాలతో సహా ఆయన బండారం బయటపెడతానని సదరు మహిళ సవాల్ విసిరింది. చిన్మయి బాధితులకి అండగా నిలబడి మాట్లాడుతున్నందుకు ఆమెకి హ్యాట్సాఫ్ అని చెప్పింది.  

ఇది కూడా చదవండి.. 

సింగర్ చిన్మయి కామెంట్స్ పై రచయిత ఘాటు స్పందన!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు!

PREV
click me!

Recommended Stories

Ram Charan: కెరీర్ లో 2 సార్లు కాస్ట్లీ మిస్టేక్స్ చేసిన రాంచరణ్.. చిరంజీవి కూడా ఏం చేయలేకపోయారా ?
Rithu Chowdary Eliminate: చివరి నిమిషంలో బిగ్‌ బాస్‌ షాకింగ్‌ ట్విస్ట్, రీతూ ఎలిమినేట్‌.. కారణం ఇదే