నాకు ఎన్టీఆర్ కావాలి.. రూ.10 లక్షలు ఇస్తా: రామ్ గోపాల్ వర్మ!

By Udayavani DhuliFirst Published Oct 16, 2018, 2:31 PM IST
Highlights

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ముఖ్య పాత్రల కోసం వర్మ వెతుకులాట మొదలుపెట్టారు. అక్టోబర్ 19న తిరుపతిలో ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని నిర్వహించనున్నారు. 

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ముఖ్య పాత్రల కోసం వర్మ వెతుకులాట 
మొదలుపెట్టారు. అక్టోబర్ 19న తిరుపతిలో ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని నిర్వహించనున్నారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ అల్లుడి పాత్ర చంద్రబాబు నాయుడు కోసం ఆయనలా కనిపించే ఓ వ్యక్తి వీడియోని షేర్ చేసిన వర్మ అతడి వివరాలు పంపితే రూ.లక్ష కానుకగా ఇస్తానని ప్రకటించారు. అన్నట్లుగా రోహిత్ అనే వ్యక్తి వివరాలు తెలపగా.. అతడికి లక్ష నగదు బదిలీ చేశారు. తాజాగా వర్మ సోషల్ మీడియాలో మరో పోస్ట్ పెట్టారు.

ఎన్టీఆర్ పాత్ర కోసం ముగ్గురిని షార్ట్ లిస్ట్ చేశానని, కానీ తనకి ఇంకా ఉత్తమమైన నటుడు కావాలని వర్మ అన్నారు. ఈ మేరకు ఆయన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఓ పోస్ట్ పెట్టారు. ''ముగ్గురు నటుల్ని షార్ట్ లిస్ట్ చేశా.. కానీ నాకు ఇంకా ఉత్తమమైన వ్యక్తి కావాలి. 

లక్ష్మీపార్వతిని కలిసినప్పుడు ఎన్టీఆర్ ఏ వయసులో ఉన్నారో, అప్పుడు ఎలా కనిపించేవారో.. అలా ఉండే నటుడు కావాలి. ఆయనలా ఉండే, మాట్లాడే వ్యక్తి కనబడితే వీడియోని laksmisntr@gmail.comకు పంపండి. వారికి రూ.10లక్షలు బహుమతిగా ఇస్తానని ఓపెన్ ఆఫర్ చేస్తున్నా'' అంటూ వెల్లడించాడు. 

ఇవి కూడా చదవండి.. 

వర్మ చెప్పింది నిజమే.. బాబు గారి మరో వీడియో చూసారా?

ఆ చంద్రబాబును పట్టేసిన వర్మ!

ఆర్జీవీ ట్వీట్.. ఈ వ్యక్తిని పట్టిస్తే లక్ష ఇస్తాడట!

click me!